AP Politics: ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్ | AP Political Updates On February 7, 2024 - Sakshi
Sakshi News home page

AP Political News Feb 7th: ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్

Published Wed, Feb 7 2024 7:13 AM

AP Political Updates Feb 7th - Sakshi

AP Elections Political Latest Updates Telugu..

07:45 PM, Feb 7, 2024
ఉత్తరాంధ్రలో సైకిల్‌ ఉల్టాపుల్టా

 • రాజమండ్రి నుంచి పోటీకి బాలయ్య చిన్నల్లుడు సన్నాహాలు
 • ఇప్పటికే ఓసారి సర్వే చేయించుకున్న భరత్
 • విశాఖ సీటు పొత్తులో బీజేపీకి ఇస్తే రాజమండ్రి ఇవ్వాలని అడుగుతోన్న భరత్
 • ఎమ్మెల్యే టికెట్ వద్దు ఎంపీగా పోటీ చేస్తానంటున్న భరత్
 • ఇప్పటికే రాజమండ్రి టికెట్ పై శిష్ట్లా లోహిత్ కి హామీ ఇచ్చిన లోకేష్‌
 • బొడ్డు వెంకటరమణ చౌదరికి అభయమిచ్చిన చంద్రబాబు
 • టీడీపీ - జనసేన మధ్య పాయకరావుపేట సీటు వివాదం
 • పొత్తులో భాగంగా పాయకరావుపేట సీటు తమకే కేటాయించాలన్న జనసేన
 • తమకు సీటు ఇవ్వకపోతే టీడీపీకి సహకరించేది లేదన్న జనసేన

07:30 PM, Feb 7, 2024
విజయవాడలో జనసైనికుల వీరంగం

 • విజయవాడ : బెజవాడలో జనసేన నాయకుడు పోతిన మహేష్ అనుచరుల వీరంగం
 • పశ్చిమ నియోజకవర్గంలోని పోతిన మహేష్ కు చెందిన జనసేన కార్యాలయం ముందు దాడి
 • జనసేనకు చెందిన మైనార్టీ నాయకుడు యెజాజ్ వద్ద రెండేళ్ల క్రితం స్థలం కొనుగోలు చేసిన రుహుల్లా
 • ధర ఎక్కువగా ఉండటంతో యెజాజ్ ను ఒప్పించి తక్కువకు ఇప్పించాలంటూ పోతిన మహేష్ కార్యాలయానికి వచ్చిన రుహుల్లా
 • తనతో మాట్లాడుతుండగా రుహుల్లాకు తెలియకుండా వీడియో తీయించిన పోతిన మహేష్
 • ఇటీవల మైనార్టీ కోటాలో వెస్ట్ టిక్కెట్ ఆశిస్తున్న యెజాజ్
 • యెజాజ్ తనకు అడ్డుకురాకుండా ఉండేందుకు రెండేళ్ల క్రితం తీసిన వీడియోను మార్పులు చేసి సోషల్ మీడియాలో పెట్టించిన పోతిన మహేష్
 • వివరణ కోరేందుకు పోతిన మహేష్ కార్యాలయానికి వెళ్లిన రుహుల్లా, యెజాజ్
 • యెజాజ్ అనుచరులతో ఘర్షణకు దిగిన పోతిన మహేష్ అనుచరులు
 • అసభ్య పదజాలంతో దూషిస్తూ...విచక్షణా రహితంగా దాడి చేసిన పోతిన మహేష్ అనుచరులు

07:25 PM, Feb 7, 2024
భద్రతపై రాజకీయం చేస్తారా?

షర్మిల, ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌

 • హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చిన షర్మిల
 • ప్రభుత్వం భద్రత కల్పించడం లేదు
 • ప్రజలు, ప్రతిపక్షాలకు భద్రత లేకపోవడం ప్రజాస్వామ్యమేనా?

నిబంధనల మేరకే భద్రత : మంత్రి బొత్స

 • షర్మిల భద్రత పై పోలీసులు నిర్ణయం తీసుకుంటారు
 • భద్రతా ప్రమాణాల ప్రకారమే అధికారుల నిర్ణయం ఉంటుంది
 • షర్మిల భద్రతకు సంబంధించి నాకేమీ తెలియదు
 • 2014లో ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు నా గన్‌మెన్లను తీసేశారు
 • ఇప్పుడు హఠాత్తుగా భద్రత లేదని రాజకీయం చేయడం సరికాదు

07:20 PM, Feb 7, 2024
పొత్తులు - ప్రకటనలు

 • ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు
 • టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ నివాసానికి చంద్రబాబు

రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం, మిత్రుత్వం ఉండదు : సిఎం రమేష్

 • ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా రాష్ట్రానికి మేలు జరగాలి
 • ప్రజలకు మేలు చేసే పలు చట్టాలు చేసేందుకు గతంలో టీడీపీ కూడా మద్ధతిచ్చింది
 • త్వరలో పొత్తులపై స్పష్టత వస్తుందని ఆశిస్తున్నాం
 • అమిత్ షాతో జరిగిన భేటీలో ఏపీ రాజకీయాలపై చర్చించాం

టీడీపీ బలంగా ఉంటే పొత్తలెందుకు? : మంత్రి కాకాణి

 • ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయన్న చర్చ ప్రజల్లో ఉంది
 • జనసేనతో పాటు బీజేపీ పొత్తు కోసం చంద్రబాబు పాకులాడుతున్నారు
 • వీరితో పాటు మిగతా పార్టీలతోనూ పొత్తుకు చంద్రబాబు సిద్ధం

ఎలాంటి ఆశ్చర్యం లేదు : మంత్రి అంబటి

 • బిజెపి పెద్దలతో పొత్తులపై చర్చించడానికి చంద్రబాబు వెళ్లారని తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు
 • ఎన్ని పార్టీలు వచ్చినా ఎంత మంది కలిసి వచ్చిన వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుంది
 • మా టార్గెట్ 175 కు 175 సీట్లు గెలవటం
 • చంద్రబాబు నాయుడు ఎలాంటి వాడో బిజెపి పెద్దలకు బాగా తెలుసు
 • చంద్రబాబు నాయుడు బిజెపి నాయకుల్ని తిట్టింది, అమిత్ షా పై దాడి చేయించింది వాళ్లు మర్చిపోవచ్చు ఏమోగానీ ప్రజలు మాత్రం మర్చిపోరు
 • ఎవరి అవసరాల కోసం వారు తపన పడుతున్నారు
 • చంద్రబాబు ఒకవైపు పవన్ కళ్యాణ్ తో ఉండి, మరొకవైపు బిజెపిని కలుపుకోవడానికి తపన పడుతున్నాడు అంటే గెలవలేమని భయపడుతున్నట్టు అర్థమవుతోంది
 • మాకు 55% పైగా ఓటింగ్ ఉంది, మిగిలిన పర్సంటేజ్ విపక్షాలకు ఉంది
 • 2014లో అబద్దాలు చెప్పి విజయం సాధించారు కానీ ప్రభుత్వం మాత్రం విఫలమైంది
 • ఈసారి వారి కూటమి ఫెయిల్ అవ్వటం ఖాయం
 • అందర్నీ వాడుకుని వదిలేయడం చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య

07:11 PM, Feb 7, 2024
బాబు వ్యవహారం ఊహించిందే: మంత్రి పెద్దిరెడ్డి

 • చంద్రబాబు పొత్తుల వ్యవహారం ఊహించిందే
 • వామపక్షాలు ప్రత్యక్షంగా టీడీపీకి మద్ధతు ఇస్తున్నాయి
 • కాంగ్రెస్‌ పరోక్షంగా టీడీపీకి మద్దతు ఇస్తోంది
 • బీజేపీలో ఉన్నచాలామంది నేతలు టీడీపీ నుంచి వెళ్లినవాళ్లే
 • చంద్రబాబు ఎంత మందితో కలిసి వచ్చినా.. వైఎస్సార్‌సీపీ సింగిల్‌గా వస్తుంది
 • ముందునుండి ప్రతిపక్షాలు కలిసే ఉన్నాయి
 • కాంగ్రెస్ కూడా ఇన్ డైరెక్టుగా టీడీపీకే సపోర్టు చేస్తుంది
 • బీజేపీలో కూడా టీడీపీ నాయకులే ఉన్నారు
 • అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మా మద్దతుతో గెలిచి ఇబ్బంది పెట్టారు
 • మా నాయకుడిని 16 నెలలు జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టారు : మంత్రి పెద్దిరెడ్డి

06:58 PM, Feb 7, 2024
ఈసారి కూటమి ఫెయిల్‌ ఖాయం: మంత్రి అంబటి

 • చంద్రబాబు బీజేపీ పెద్దలతో పొత్తులపై చర్చించడానికి వెళ్లారని తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు
 • ఎన్ని పార్టీలు వచ్చినా ఎంత మంది కలిసి వచ్చిన వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అఖండ విజయం సాధిస్తుంది
 • మా టార్గెట్ 175 కు 175 సీట్లు గెలవటం
 • చంద్రబాబు నాయుడు ఎలాంటి వాడో బీజేపీ పెద్దలకు బాగా తెలుసు
 • చంద్రబాబు నాయుడు బీజేపీ నాయకుల్ని తిట్టింది, అమిత్ షా పై దాడి చేయించింది వాళ్లు మర్చిపోవచ్చు ఏమోగానీ ప్రజలు మాత్రం మర్చిపోరు
 • ఎవరి అవసరాల కోసం వారు తపన పడుతున్నారు
 • చంద్రబాబు ఒకవైపు పవన్ కల్యాణ్ తో ఉండి.. మరొకవైపు బీజేపీని కలుపుకోవడానికి తపన పడుతున్నాడు
 • .. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత బలంగా ఉన్నాడో వారికి అర్థమవుతుంది
 • మాకు 55% పైగా ఓటింగ్ ఉంది మిగిలిన అన్ని పార్టీలు కలుపుకుంటే మిగిలిన పర్సంటేజ్ వాళ్లకు ఉంది
 • 2014లో అందరూ కలిసి విజయం సాధించారు కానీ ప్రభుత్వం మాత్రం విఫలమైంది
 • ఈసారి వారి కూటమి ఫెయిల్ అవ్వటం ఖాయం
 • అందర్నీ వాడుకుని వదిలేయడం చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య

06:28 PM, Feb 7, 2024
రాప్తాడు సిద్ధం సభ 18న

 • అనంతపురం రాప్తాడులో ఈ నెల 11న సిద్ధం సభకు ఏర్పాట్లు
 • అనివార్య కారణాలతో తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ప్రకటించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
 • ఈనెల 11కు బదులుగా 18వ తేదీన సిద్ధం సభ ఉంటుందని వెల్లడి
 • చంద్రబాబుపై మం‍త్రి పెద్దిరెడ్డి విమర్శలు
 • చంద్రబాబు నాయుడు పొత్తుల కోసం తహతహలాడుతున్నారు
 • ఇందులో భాగంగానే బీజేపీ పెద్దలతో భేటీ
 • వలంటీర్లపై ఎల్లో మీడియా అక్కసు వెళ్లగక్కుతోంది
 • కరోనా సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇంట్లో దాక్కుంటే... ప్రజలకు సేవలు అందించింది వలంటీర్లే
 • భద్రత లేదని షర్మిల అంటున్నారు
 • కాంగ్రెస్‌ పార్టీని వీడినప్పుడు.. మాకు రక్షణ తొలగించారు
 • అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మా మద్దతుతో గెలిచి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు 
 • కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో నా కుటుంబానికి భద్రత కల్పించలేదు
 • మా నాయకుడిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారు
 • పాదయాత్రలో వైఎస్‌ జగన్ కూ తగిన భద్రత కల్పించలేదు

06:09 PM, Feb 7, 2024
అవినీతికి పర్యాయపదం కాంగ్రెస్: ఎంపీ విజయసాయిరెడ్డి 

 • రాజ్యసభలో బడ్జెట్ పై చర్చ
 • వైఎస్సార్సీపి తరఫున బడ్జెట్ పై చర్చలో పాల్గొన్న ఎంపీ విజయసాయిరెడ్డి 
 • కాంగ్రెస్‌ పార్టీ దేశానికి చేసిన నష్టం గురించి ప్రస్తావిస్తూ.. విమర్శలు గుప్పించిన విజయసాయిరెడ్డి
 • కాంగ్రెస్ పార్టీ తన సొంత ప్రయోజనాలకి దేశ ప్రజలను తాకట్టు పెట్టింది 
 • దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినడానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణం
 • కాంగ్రెస్ పార్టీని చరిత్రలో ప్రజలు ఎన్నటికీ క్షమించరు 
 • కాంగ్రెస్ పరిపాలనలో దేశం ఆర్థికంగా అధోగతి పాలయింది 
 • ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారనడానికి  గణాంకాలే సాక్ష్యం 
 • దేశ జిడిపి ఏడు శాతాన్ని దాటింది 
 • కాంగ్రెస్ దిగిపోయిన తర్వాత ఇండియా ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరుగుతున్నది
 • ధనిక పేదల మధ్య అంతరం తగ్గుతుంది 
 •  కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ధరలు విపరీతంగా పెరిగాయి
 •  అవినీతికి పర్యాయపదం కాంగ్రెస్ పార్టీ
 • కాంగ్రెస్ సహాయం లోని దేశంలో 2జి, కామన్వెల్త్,  బొగ్గు కుంభకోణం లాంటి బ్ అతిపెద్ద కుంభకోణాలు జరిగాయి 
 • 2014లో ఈజ్ ఆఫ్ డూయింగ్ లో 142వ స్థానం ఉన్న దేశం ఇప్పుడు  నుంచి 62 కి  పెరిగింది

05:48 PM, Feb 7, 2024
చంద్రబాబుకు మంత్రి కాకాణి సవాల్ 

 • నీపై ఉన్న కేసుల్లో ఒక దానికైనా సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్దమా?
 • దమ్ముంటే 24 గంటల్లో చంద్రబాబు స్పందించాలి
 • జగన్ నాయకత్వం బలంగా ఉంది కాబట్టే చంద్రబాబు పొత్తులకోసం ప్రయత్నాలు చేస్తున్నారు
 • చంద్రబాబు మోసం చేస్తారని ప్రజలకు కూడా తెలుసు

05:27 PM, Feb 7, 2024
జనసేన నేత అనుచరుల రౌడీయిజం

 • బెజవాడలో జనసేన నాయకుడు పోతిన మహేష్ అనుచరుల వీరంగం 
 • పశ్చిమ నియోజకవర్గంలోని పోతిన మహేష్ కు చెందిన జనసేన కార్యాలయం సాక్షిగా దాడి 
 • జనసేనకు చెందిన మైనార్టీ నాయకుడు యెజాజ్ వద్ద రెండేళ్ల క్రితం స్థలం కొనుగోలు చేసిన రుహుల్లా 
 • ధర ఎక్కువగా ఉండటంతో యెజాజ్ ను ఒప్పించి తక్కువకు ఇప్పించాలంటూ పోతిన మహేష్ కార్యాలయానికి వచ్చిన రుహుల్లా (మైనార్టీ కుటుంబం)
 • తనతో మాట్లాడుతుండగా రుహుల్లాకు తెలియకుండా వీడియో తీయించిన పోతిన మహేష్ 
 • ఇటీవల మైనార్టీ కోటాలో వెస్ట్ టిక్కెట్ ఆశిస్తున్న యెజాజ్ 
 • యెజాజ్ తనకు అడ్డుకురాకుండా ఉండేందుకు రెండేళ్ల క్రితం తీసిన వీడియోను మార్పులు చేసి సోషల్ మీడియాలో పెట్టించిన పోతిన మహేష్ 
 • వివరణ కోరేందుకు పోతిన మహేష్ కార్యాలయానికి వెళ్లిన రుహుల్లా, యెజాజ్ 
 • యెజాజ్ అనుచరులతో ఘర్షణకు దిగిన పోతిన మహేష్ అనుచరులు 
 • అసభ్య పదజాలంతో దూషిస్తూ...విచక్షణా రహితంగా దాడి చేసిన పోతిన మహేష్ అనుచరులు

04:58 PM, Feb 7, 2024
చంద్రబాబు ఎవరితో కలిస్తేనేం?: మంత్రి బొత్స

 • చంద్రబాబు ఎవరితో పొత్తు పెట్టుకున్నా మాకు సంబంధం లేదు
 • ఎవరు ఎవరితో కలిసి వెళ్లినా మాపై ప్రభావం ఉండదు
 • మేం ఒంటరిగానే పోటీ చేస్తాం.. ప్రజలు మాతోనే ఉన్నారు
 • మా పార్టీ ఎవరినీ.. ఎప్పుడూ వదులుకోదు
 • ఎక్కడ ఏ అవకాశం వచ్చినా వాళ్లకు ప్రాధాన్యత ఇస్తాం
 • అసంతృప్తికి నిర్వచనం ఏముంటుంది?
 • 2014లో ఓడినప్పుడు నా గన్‌మెన్లను తీసేశారు
 • నాకు థ్రెట్‌ లేదు కాబట్టి భయం లేదు

మంత్రి బొత్స వ్యాఖ్యలు

04:32 PM, Feb 7, 2024
నాగబాబుకు షాకిచ్చిన జనసేన నేతలు

 • అనకాపల్లి పాయకరావుపేటలో మరోసారి రాజుకున్న జనసేన-టీడీపీ సీటు వివాదం..
 • పాయకరావుపేట జనసేన నాయకులతో నాగబాబు సమావేశం
 • పొత్తులో భాగంగా పాయకరావుపేట సీటు జనసేనకు కేటాయించాలి
 • గత ఎన్నికల్లో జనసేన మద్దతుతో అనిత అనేక కేసులతో మమ్మల్ని వేధించారు
 • జనసేనకు సీటీ ఇవ్వకపోతే ఎన్నికల్లో టీడీపీకి సహకరించేది లేదు
 • నాగబాబుకి స్పష్టం చేసిన జనసేన నేతలు


03:32 PM, Feb 7, 2024
వసంత కృష్ణప్రసాద్ అంత తోపే అయితే..

 • మైలవరంలో స్థానికుడైన సర్నాల తిరుపతిరావును జగన్ మోహన్ రెడ్డి సమన్వయకర్తగా ప్రకటించడం హర్షణీయం 
 • తాను మంత్రిగా ఉన్నప్పుడు ఇసుక, మట్టి దోపిడీ జరిగిందని బహిరంగంగానే దేవినేని ఉమా ఒప్పుకున్నారు 
 • ఉమా మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అనుచరులు ఇసుక , మట్టి అక్రమ రవాణా చేసి సహజవనరులను దోచుకున్నారు 
 • ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అనుచరులు వేల ట్రిప్పుల మట్టిని తోటల్లో దాచిపెట్టారు
 • మట్టి రవాణా ఎవరితో చేయించారు,వారిలో సామాన్యులు ఎంతమంది, ఎమ్మెల్యే వసంత బందువులు ఎంతమంది అనేది బయటపెట్టాలి..
 • వసంత కృష్ణప్రసాద్ డబ్బు సంపాదించే పనులు తన అనుచరులకు...డబ్బు రాని పనులు సామాన్యులకు ఇప్పించి ఇబ్బందుల పాలు చేశారు 
 • స్థానికంగా ఇన్‌ఛార్జిలను నియమించి దోపిడీలకు పాల్పడ్డారు  
 • నిన్నటిదాకా అక్రమంగా సంపాదించుకున్న ఇరువురు నేతలు ఇప్పుడు వాటాలు తేడా వచ్చి కొట్టుకుంటున్నారు.
 • అవినీతికి వాటాలు కుదరక రోడ్డున పడి కొట్టుకుంటుంటే ప్రజాస్వామ్య వాదిగా నాకు భాద వేసింది
 • అన్ని రాజకీయ పార్టీలు స్థానికులకే టికెట్ ఇవ్వాలి
 • ఈ సైకోల నుండి మైలవరం నియోజకవర్గ ప్రజలకు విముక్తి కల్పించాలని అన్ని పార్టీలను కోరుతున్నాను
 • వసంత కృష్ణప్రసాద్..  అంత తోపువే అయితే ఇండిపెండెంట్ గా వేసి గెలవగలవా?

03:00 PM, Feb 7, 2024
బాబు ఢిల్లీ టూర్‌పై ఏపీ బీజేపీ స్పందన

 • చంద్రబాబు ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారో మాకు తెలియదు: ఏపీ బీజేపీ చీఫ్‌ దగ్గుబాటి పురంధేశ్వరి
 • పొత్తుల వ్యవహారం అధిష్టానం చూసుకుంటుంది: పురంధేశ్వరి
 • ఏపీలో ఏం జరగబోతుందో ప్రజలే చూస్తారు: బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్
 • తినబోతూ రుచి అడగవద్దూ.. 3-4 రోజుల్లో స్పష్టత వస్తుంది:సత్యకుమార్
 • ప్రత్యేక హోదా అంటే ఏంటో షర్మిల తెలుసుకోవాలి:సత్యకుమార్

02:49 PM, Feb 7, 2024
దేశంలోనే డర్టీ పొలిటీషియన్‌ చంద్రబాబు: మంత్రి ఆర్కే రోజా

 • ప్రధాని మోదీ తల్లి, భార్యని తిట్టిన వ్యక్తి చంద్రబాబు
 • మోదీని తిట్టి మరీ నల్ల జెండాలు ఎగురవేశాడు చంద్రబాబు
 • మళ్ళీ మోదీ కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధపడ్డాడు
 • మోదీ దేశంలో లేకుండా చేస్తానని చంద్రబాబు గతంలో అన్నాడు
 • అమిత్ షా పై తిరుమలలో చంద్రబాబు రాళ్లు వేయించాడు
 • ఇప్పుడు అమిత్ షా కాళ్ళు పట్టుకుంటున్నారు
 • చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కాళ్ళు పట్టుకోవడానికి లోకేష్ ని పంపాడు
 • ఈ దేశంలోనే చంద్రబాబు డర్టీ పొలిటీషియన్
 • ఇప్పుడు చంద్రబాబు తో కలిస్తే బీజేపీకే నష్టం
 • ఎన్ని పార్టీలు కలిసినా మళ్ళీ వైఎస్ జగన్  సీఎం అవుతారు

02:45 PM, Feb 7, 2024
ఢిల్లీకి బయల్దేరిన చంద్రబాబు

 • ఢిల్లీకి బయల్దేరిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయడు
 • నేడు రేపు  బీజేపీ పెద్దలతో భేటీకానున్న బాబు!
 • పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుపుతారంటూ ఎల్లో మీడియా ప్రచారం

1:55 PM, Feb 7, 2024

చంద్రబాబుతో పని చేసే వారు అంత అభివృధి నిరోధకులు: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

 • ఎస్సీల ఓట్లను హరించి రిగ్గింగులు చేసే సంస్కృతి చంద్రబాబుది 
 • ఏనాడైనా బలహీన వర్గాలని ఇంటికి పిలిచి గుక్కెడు నీళ్ళైనా చంద్రబాబు ఇచ్చాడా? 
 • ఓట్ల మీద ఉన్న ప్రేమ పేదలమీద బాబుకు లేదు 
 • బడుగు, బలహీన వర్గాలను రాజ్యాధికారం వైపు సీఎం జగన్ నడిపిస్తున్నారు 
 • అహంకారంతో, అక్కసుతో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు 
 • చంద్రబాబు ఏ పార్టీకి అధ్యక్షుడో అర్ధం కావటం లేదు 
 • చంద్రబాబు మాట మాటకి నన్ను ఉద్దేశించి మాట్లాడారు.
 • బానిసనని విమర్శిస్తున్నారు.
 • చంద్రబాబుకి దళితులు అంటే వ్యతిరేకం.
 • నా శాఖలో నేను ఏ విధంగా పనిచేశానో ప్రజలకు తెలుసు
 • ఇప్పటివరకు నేను ఎవరికీ తలవంచలేదు
 • అవినీతి గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకి లేదు
 • ఎస్సీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకి అసలు లేదు.
 • నాకు సీఎం జగన్ అవకాశం ఇచ్చారు.
 • రాష్ట్రపతి దగ్గరికి డైరెక్ట్‌గా వెళ్ళే పదవి నాకు కల్పించారు.
 • నా జీవితంలో నేను పేద వారికి సేవ చేసే అవకాశం లభించింది.
 • చంద్రబాబు పెద్ధిరెడ్డిని దోపిడీ చేశారు అంటున్నారు.
 • రాష్ట్రంలో సీఎం జగన్‌ను, చిత్తూరులో పెద్దిరెడ్డిని వీరు ఏమీ చేయలేరు. 
 • అందుకే ఆరోపణలు చేస్తున్నారు.
 • గతంలో హెరిటేజ్ వాహనంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ జరిగింది వాస్తవం కాదా?
 • హైదరాబాద్‌లో 100 కోట్ల ప్యాలస్ కట్టుకున్నది ఎవరు?
 • ఒక దళిత నియోజవర్గానికి ఏం చేశారో చెప్పాలి. 
 • చంద్రబాబు ముఖ్యమంత్రిగా చిత్తూరు జిల్లాకు ఏం చేశారో చెప్పాలి. 
 • చంద్రబాబుతో పని చేసే వారు అంత అభివృధి నిరోధకులు.

1:45 PM, Feb 7, 2024
ఎల్లో మీడియాకు ఎమ్మెల్యే రాచమల్లు కౌంటర్‌

 • ప్రొద్దుటూరు నియోజకవర్గ వైస్సార్‌సీపీ అభ్యర్థిగా మూడోసారి పోటీ చేస్తున్నాను.
 • గత 5 సంవత్సరాలుగా నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేశాము
 • 500 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నాము
 • ఏబీఎన్, టీవీ-5, ఈనాడు పత్రికలు టీడీపీ కరపత్రాలుగా పనిచేస్తున్నాయి
 • టీడీపీ వారు ధర్మ యుద్ధం చేయాల్సింది పొయి అధర్మ యుద్దం చేస్తున్నారు
 • మా కౌన్సిలర్లను 20 మంది వద్దకు వెళ్లి ప్రలోభాలకు గురిచేస్తున్నారు
 • నలుగురు కౌన్సిలర్లకు ఒక్కొక్కరికి 12 లక్షల 50 వేలు డబ్బు ఆశ చూపారు
 • టీడీపీ వారు చేస్తున్న ప్రలోభాలను మా కౌన్సిలర్లు తిరస్కరించారు.
 • టీడీపీ అభ్యర్థి ఎంపిక కోసం 30 కోట్లు అడుగుతున్నారు
 • వైఎస్సార్‌సీపీలో ప్రజాసేవలో ఉండేవారినే అభ్యర్థిగా ప్రకటించారు

1:30 PM, Feb 7, 2024
ఢిల్లీ పెద్దల కోసం గేట్ల వద్ద చంద్రబాబు కపలా: ఎంపీ భరత్‌

 • రాజమండ్రీ మోరంపూడి ఫ్లైఓవర్ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆలస్యమైంది. 
 • మార్చికి ఫ్లైఓవర్ పూర్తి చేసేందుకు శరవేగంగా పనులను పూర్తి చేస్తున్నాం.
 • టీడీపీ ఎమ్మెల్యే బుచయ్య చౌదరికి ఫ్లై ఓవర్‌లో ఎన్ని పిల్లర్లు ఉన్నాయో తెలుసా?
 • చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వేసే ఎత్తుగడలన్నీ ప్రజలందరికీ అర్థమవుతున్నాయి. 
 • ఢిల్లీ పెద్దల పర్మిషన్ కోసం గేట్ల వద్ద కాపలా కాస్తున్నారు.
 • అమిత్ షా తిరుపతి దర్శనికి వస్తే ఆయన కాన్వాయ్‌పైకి చెప్పులు విసిరించిన వ్యక్తి చంద్రబాబు.
 • సిద్ధం అనే స్లోగన్ మాది.. తెలుగుదేశం కూడా సిద్ధం అంటుంది వారికంటూ ఒక ఎజెండా లేదు.
 • కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటునే మేము రాబట్టాల్సిన నిధులు రాబడుతున్నాము.
 • మళ్ళీ అధికారంలోకి రాగానే మేము పెట్టబోయే మొదటి అంశం ప్రత్యేక హోదా
 • పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు

1:10 PM, Feb 7, 2024

చంద్రబాబుకు దోచుకోవడమే తెలుసు.. ఎమ్మెల్యే మద్దాలగిరి

 • చంద్రబాబు నిజ స్వరూపం నిన్న బట్ట బట్టబయలైంది. 
 • చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు ప్రతీ బడ్జెట్‌లో ఆర్థికలోటు ఉండేది 
 • చంద్రబాబు అధికారంలో నుండి దిగిపోయే నాటికి నాలుగున్నర లక్షల కోట్లు అప్పు ఉంది 
 • నొక్కడం, బొక్కడం, దాచుకోవడం మాత్రమే చంద్రబాబు చేసింది
 • అభివృద్ధి లేకపోతే ఇన్ని కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్‌లో ఎలా వేస్తాం? 
 • రాష్ర్ట అభివృద్ధి, భవిష్యత్ సీఎం జగన్ వల్లనే సాధ్యం.

12:30 PM, Feb 7, 2024
పొత్తుల కోసం వెంపర్లాడుతున్న బాబు

 • తూర్పుగోదావరి జిల్లా : మోరంపూడి ఫ్లైఓవర్ పనులను పరిశీలించిన ఎంపీ మార్గాని భరత్..
 • రాజమండ్రీ మోరంపూడి ఫ్లైఓవర్ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆలస్యం అయింది...
 • మార్చికి ఫ్లైఓవర్ పూర్తి చేసేందుకు శరవేగంగా పనులను పూర్తి చేస్తున్నాం......
 • టీడిపి ఎమ్మెల్యే బుచయ్య చౌదరికి ఫ్లై ఓవర్ లో ఎన్ని పిల్లర్లు ఉంటాయో తెలుసా......?
 • చంద్రబాబు పవన్ కళ్యాణ్ వేసే ఎత్తుగడలన్నీ ప్రజలందరికీ అర్థమవుతుంది...
 • ఢిల్లీ పెద్దల పర్మిషన్ కోసం గేట్ల వద్ద కాపలా కాస్తున్నారు....
 • అమిత్ షా తిరుపతి దర్శనికి వస్తే అమిత్ షా కాన్వాయ్ పైకి చెప్పులు విసిరించిన వ్యక్తి చంద్రబాబు..
 • సిద్ధం అనే స్లోగన్ మాది....తెలుగుదేశం కూడా సిద్ధం అంటుంది వారికంటూ ఒక ఎజెండా లేదు.....
 • కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటునే మేము రాబట్టాల్సిన నిధులు రాబడుతున్నాము....
 • మళ్ళీ అధికారంలోకి రాగానే మేము పెట్టబోయే మొదటి అంశం ప్రత్యేక హోదా...పోలవరం ప్రాజెక్టు.....వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు

12:00 PM, Feb 7, 2024
బోండా ఉమకు వెల్లంపల్లి కౌంటర్‌

 • బోండా ఉమ ఎలక్షన్లకు తప్ప ప్రజల మధ్య లేడు
 • ఉమకు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలను ఓటు అడిగే హార్హత లేదు.
 • కోవిడ్ సమయంలో ప్రజల్ని వదిలేసిన ఘనుడు బోండా ఉమ
 • బోండా ఉమపై TV5 చానల్లోనే ఆయన బాగోతం ప్రచురించారు
 • నువ్వు భూకబ్జా దారుడు కాకపోతే Tv5లో నిరూపించుకో.
 • మీ సొంత చానల్లోనే నీ మీద కథనాలు ప్రచురిస్తున్నారు.
 • నేను ప్రజల మధ్య ఉండేవాణ్ణి నన్ను ఏం చేయగలవు.
 • ఉమలాగా సూర్యుని చూడకుండా ఉండే వ్యక్తిని కాదు.
 • ఉమా మాటలు అదుపులో పెట్టుకుని మాట్లాడు.
 • సెంట్రల్ నియోజకవర్గంలో డిపాజిట్లు లేకుండా ఓడిస్తా.
 • సెంట్రల్ నియోజకవర్గంలో 25 వేల ఓట్ల మెజార్టీతో గెలిచి సీఎం జగన్ సీటు గిప్ట్‌గా ఇస్తాను. 
 • బోండా ఉమ అరాచకాలు, అక్రమాలు సెంట్రల్ నియోజకవర్గంలో సాగనివ్వను.

11:30 AM, Feb 7, 2024
చంద్రబాబుపై దేవినేని అవినాష్ సీరియస్‌

 • వాలంటీర్లపై చంద్రబాబు కక్షపూరిత మాటలను ఖండిస్తున్నాం
 • ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు చేరుస్తున్నందుకా వాలంటీర్లను అరెస్ట్ చేయాలి
 • వాలంటీర్ అరెస్టు వ్యాఖ్యలతో చంద్రబాబు కుటిల బుద్ధి బయటపడింది
 • రాష్ట్రంలో వాలంటీర్లు చేస్తున్న సేవ మరువలేనిది
 • చంద్రబాబు దిగజారుడు మాటలు మానకపోతే రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారు
 • చంద్రబాబు హయాంలో చేసిన అభివృద్ధి చెప్పుకోలేక సీఎం జగన్ ప్రభుత్వంపై విమర్శలు

11:02 AM, Feb 7, 2024
అసెంబ్లీలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌. 

రూ.2లక్షల 86వేల 389కోట్లతో వార్షిక బడ్జెట్‌.
రెవెన్యూ వ్యయం రూ.2లక్షల 30వేల 110 కోట్లు.
మూలధన వ్యయం రూ.30వేల 530 కోట్లు.
 
ద్రవ్యలోటు రూ.55వేల 817కోట్లు. 
రెవెన్యూ లోటు రూ.24వేల 758 కోట్లు. 
జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 1.56శాతం
జీఎస్డీపీలో ద్రవ్యలోటు 3.51శాతం. 

 • మహత్మాగాంధీ సందేశంతో బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభమైంది. 
 • ఐదేళ్లుగా బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం నాకు దక్కింది.
 • మేనిఫెస్టోను సీఎం జగన్‌ ప్రవిత గ్రంధంగా భావించారు.  
 • ఇప్పటి వరకు ఎవరూ చేయని పనులను మా ప్రభుత్వం చేసింది. 

ఏడు అంశాల ఆధారంగా బడ్జెట్‌ రూపకల్పన 
సుపరిపాలన,
సామర్థ్య ఆంధ్ర,
మన మహిళా మహారాణుల ఆంధ్ర
సంపన్నుల ఆంధ్ర
సంక్షేమ ఆంధ్ర,
భూభద్ర ఆంధ్ర,
అన్నపూర్ణ ఆంధ్ర

10:20 AM, Feb 7, 2024

కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు..

 • 2024–25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ఆమోదించిన మంత్రిమండలి.
 • నంద్యాల జిల్లా డోన్‌లో కొత్తగా హార్టికల్చరల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలిటెక్నిక్‌ కాలేజ్‌ ఏర్పాటుకు ఆమోదం.
 • డాక్టర్‌ వైఎస్సార్‌ హార్టికల్చర్‌ యూనివర్శిటీ పరిధిలో పనిచేయనున్న హార్టికల్చరల్‌ పాలిటెక్నికల్‌ కళాశాల.
 • నంద్యాల జిల్లా డోన్‌లో వ్యవసాయరంగంలో రెండేళ్ల డిప్లొమా కోర్సుతో వ్యవసాయ పాలిటెక్నిక్‌ కాలేజీ ఏర్పాటుకు ఆమోదం.
 • ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్‌ యూనివర్శిటీ పరిధిలో పనిచేయనున్న అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల.
 • ఆంధ్రప్రదేశ్‌ ప్రేవేట్‌ యూనివర్శిటీస్‌ (ఎస్టాబ్లిస్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌) యాక్ట్‌ 2016కు సవరణలు చేయడం ద్వారా బ్రౌన్‌ఫీల్డ్‌ కేటగిరిలో మూడు ప్రేవేట్‌ యూనివర్శిటీలకు అనుమతి. 
 • అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్శిటీ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి గ్లోబల్‌ యూనివర్శిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్శిటీల ఏర్పాటుకు ఆమోదం.
 • ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో 05–02–2024 నాడు ఉభయసభలనుద్దేశించి ప్రసంగించిన గవర్నర్‌ ప్రసంగానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి.

10:00 AM, Feb 7, 2024
జనసేన కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తల దాడి 

 • నెల్లూరు సభలో రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌
 • జనసేన కార్యకర్తలను తరిమికొట్టిన ఎల్లో బ్యాచ్‌
 • పొత్తులో భాగంగా పవన్‌ను సీఎం అభ్యర్థి నినాదాలు చేసిన జనసేన కార్యకర్తలు
 • జెండా కూలీ సీఎం ఏంటని దాడి చేసిన టీడీపీ బ్యాచ్‌

09:30 AM, Feb 7, 2024
మార్చాల్సింది అ‍డ్మిన్‌ కాదు.. బాబును..

 • చంద్రబాబు సభలకు ఆదరణ కరువు
 • టీడీపీ సభలను పట్టించుకోని ప్రజలు
 • చంద్రబాబు పని అయిపోయినట్టే..
 • కొత్త నాయకుడు వస్తే ఊపు ఉంటుందేమో..!

07:20 AM, Feb 7, 2024
ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలపై ఈసీ సీరియస్‌

 • ఆంధ్రజ్యోతిలో అబద్ధాలను ఖండించిన సీఈవో ముఖేష్‌కుమార్‌ మీనా
 • ఈసీలో దొంగలు పడ్డారంటూ తప్పుడు కథనం ప్రచురించిన ఆంధ్రజ్యోతి
 • ఈ చెత్త రాతలను ఖండించిన సీఈవో
 • ఈసీకి సంబంధించిన ఎలాంటి డేటా చోరీ కాలేదని స్పష్టం చేసిన సీఈవో
 • అసలు ఈసీ డేటాను చోరీ చేసే అవకాశమే లేదు. 
 • ఆంధ్రజ్యోతిలో రాసింది అబద్ధం, తప్పుదారి పట్టించే కథనం ఇది. 
 • ఎన్నికల కమిషన్‌ విధులపై అవగాహన లేకుండా కథనం రాసినట్టుంది. 
 • ఆంధ్రజ్యోతి కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. 

07:00 AM, Feb 7, 2024
పచ్చ మీడియా పిచ్చి రాతలు

 • రాజ్యాంగబద్ధ ఎన్నికల సంఘంపైనా బురదజల్లే యత్నం 
 • పబ్లిక్‌ డొమైన్‌లోని డేటాను దొంగలించారని దుష్ప్రచారం  
 • సీఈఓ స్థాయిలో ప్రస్తుత ఓటర్ల జాబితా, మార్పులు–చేర్పులు డేటా మాత్రమే యాక్సెస్‌ 
 • ఈ డేటానే దొంగలించారని అంటూ కట్టుకథ  
 • పాతడేటా మొత్తం భారత ఎన్నికల సంఘం ఈ ఆర్వోనెట్‌ 2.0 సర్వర్‌లో భద్రం 
 • ఆ డేటా కావాలంటే సీఈఓ సైతం ఈసీఐని సంప్రదించాల్సిందే 
 • అవగాహన లేకుండా ఎల్లో మీడియా బరితెగింపు పచ్చమీడియా పిచ్చి రాతలు 
 •  వైఎస్సార్‌సీపీ ప్రతిష్టనూ దిగజార్చేలా అసత్య కథనాలు

ఎల్లో మీడియా చెత్త రాతలు.. ఎన్నికల సంఘం సీరియస్‌

07:00 AM, Feb 7, 2024
శరణు.. శరణు.. బీజేపీ కోసం చంద్రబాబు పాట్లు

 • బీజేపీ కోసం చంద్రబాబు పాట్లు.. ఎన్ని సీట్లు అడిగినా ఇచ్చేందుకు సిద్ధం
 • ‘కమలం’ పెద్దలను కలిసేందుకు నేడు ఢిల్లీ పయనం
 • జనసేనతో జతకట్టినా సీఎం జగన్‌ను ఎదుర్కోవడం కష్టమేనని తేటతెల్లం 
 • పవన్‌తో భేటీల్లోనూ దీనిపైనే చర్చించిన వైనం  
 • మోదీ–షా ప్రసన్నం కోసం ముమ్మర యత్నాలు 

06:50 AM, Feb 7, 2024
ధర్మానికి.. అధర్మానికి జరిగే యుద్ధం ఇది

 • సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధిలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ఆయనకు రుణపడి ఉంటాను
 • నేను స్థానికుడిని కావడంతో చింతల పూడిలో కేడర్ కూడా బలంగా.. ఆనందంగా ఉన్నారు
 • సీఎం జగన్‌ అభివృద్ధితో కూడిన సంక్షేమాన్ని పేదలకు చేరువు చేశారు
 • పేదల గడపలు సీఎం జగన్ మోహన్ రెడ్డిని దేవుడుగా చూస్తున్నారు
 • పేదల గడపకి పెన్షన్ చెరువు చేయడంతో ప్రజల గుండెల్లో దేవుడుగా నిలిచారు
 • జగన్‌ మా కోసం 124 సార్లు బటన్  నొక్కారు మేము రెండుసార్లు బటన్ నొక్కెందుకు సిద్ధంగా ఉన్నామని ప్రజలు అంటున్నారు
 • బ్రతికున్నంతకాలం ఆయనే సీఎం చేస్తామంటూ అంటున్నారు ప్రజలు
 • కొన్ని దశాబ్దాల పాటు రాష్ట్రానికి సీఎం జగన్మోహన్ రెడ్డి అవసరం ఉందని అంటున్నారు ప్రజలు
 • దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా ప్రజలకే సంక్షేమ ఫలాలు అందుతున్నాయి
 • టీడీపీలో దళారులు అనేక విధాలుగా దోచుకున్నారు
 • ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధం ఇది
 • జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఎన్నికల కురుక్షేత్రంలో  శత్రువులను చీల్చి చెండాడుతాడు
 • దేవుడు, న్యాయం, పేదలు సీఎం జగన్‌ వైపే ఉన్నారు
 • ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా గాలిలో కలిసిపోవడం ఖాయం
 • వయసు మళ్లిన చంద్రబాబు చేసే విమర్శలు ప్రజలు పట్టించుకోరు 
 • జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ 175 కు 175 ఎమ్మెల్యే సీట్లు.. 25 ఎంపీలు గెలవబోతున్నారు

06:40 AM, Feb 7, 2024
టీడీపీ, జనసేన  సీట్ల పంచాయితీ ఎలా ఉండనుందంటే.. 

 • నేను ఆరు పర్యాయాలు ప్రతిపాడు నుండి ఎమ్మెల్యే గా పోటీ చేసి రెండు సార్లు గెలిచాను.
 •  నియోజకవర్గం లో నా క్యాడర్ ఎక్కడా చెక్కు చెదరలేదు.
 • అందువల్లే సీఎం జగన్ నన్ను గుర్తించి నాకు ఇన్‌ఛార్జి పదవి ఇచ్చారు.
 • నన్ను గెలిపించేందుకు ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు
 • నవరత్నల ద్వారా సంక్షేమ పధకాలు పొందిన ప్రజలు ఎప్పటీకీ సీఎం జగన్ ను మరచిపోలేమని చెబుతున్నారు
 • టీడీపీ, జనసేన  సీట్లు ప్రకటించాక ఆ పంచాయితీ ఎలా ఉంటుందో అందరూ కళ్ళారా చూస్తారు.. చెవులారా ఆలకిస్తారు.
 • వరుపుల సుబ్బారావు, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి వ్యాఖ్యలు

06:30 AM, Feb 7, 2024 
చంద్రబాబు మట్టి మాఫియాను మేం సైతం అడ్డుకున్నాం

 • చింతలపూడి సభలో  చంద్రబాబు చిప్పుదొబ్బి తప్పుడు ఆరోపణలు చేసినట్లున్నారు
 • ఒక్క రూపాయీ అవినీతి చేశానని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా.. నిరూపించకపోతే దమ్ము ఉంటే చంద్రబాబు రాజకీయాల నుండి తప్పుకుంటాడా....?
 • చంద్రబాబు అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారు
 • టీడీపీ హయాంలోనే మట్టి మాఫియా ను మేము అడ్డుకున్నాము... లారీలు అడ్డుకునీ ధర్నాలు సైతం చేశాము
 • పోలవరం కుడి కాలువ గట్టు మట్టి దోచుకున్నది టిడిపి నేతలు
 •  చంద్రబాబు దోపిడీ దొంగలను ఆయన పక్కన కూర్చోబెట్టుకుని చేస్తున్న వ్యాఖ్యలు అర్ధరహితం
 • రెండు ఎకరాలతో ప్రారంభమైన చంద్రబాబు జీవితంలో రెండు లక్షల కోట్లు ఎలా సంపాదించాడు...
 • చంద్రబాబుకు అవినీతి అనేది వెన్నతో పెట్టిన విద్య
 • దెందులూరులో సీఎం జగన్ సిద్ధం సభకు వచ్చిన జనసందొహాన్ని చూసి టీడీపీ శ్రేణులకు గుబులు పట్టుకుంది
 • సీఎం జగన్ మోహన్ రెడ్డి అవినీతి రహిత పాలన చేస్తున్నాడు
 • ఎల్లో మీడియాని పావుగా వాడుకొని ప్రభుత్వం పై బురద చల్లాలని చూస్తున్నారు..
 • గత ప్రభుత్వాలు గాలికి వదిలేసిన వైద్య, విద్య వ్యవస్థలలో సీఎం జగన్మోహన్ రెడ్డి మార్పులు తీసుకొచ్చారు
 • దేశమంతా మన వైపు చూసేలా పాలన సాగిస్తున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.
 • సీఎం జగన్మోహన్ రెడ్డికి 175 కి 175 సీట్లు ఇవ్వడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారు
 • రెండు లక్షల 50వేల కోట్లు జన్మభూమి కమిటీలు లేకుండా.. పేదల ఖాతాలకు చేరువు చేశారు...
 • పెత్తందారులకు పేదలకు జరిగే పోరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ఉంది..
 • అమరావతినీ బూచిగా చూపి ప్రజలను రెచ్చగొట్టేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు
 • వైషమ్యాలు రాకుండా మూడు రాజధానులు సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకువచ్చారు.
 • చంద్రబాబు అనే భూతం మరోసారి గెలవకూడదని ప్రజలు కోరుకుంటున్నారు
 • పోలవరంలో జయము జయము చంద్రన్న అంటూ భజనలు చేయించుకున్న వ్యక్తి చంద్రబాబు..
 • కమిషన్లకు కక్కుర్తి పడి ఎగువ దిగువ కాపర్ డ్యాంలు నిర్మించకుండా డయాఫ్రమ్ వాల్ కట్టాలని చూసాడు..
 • చంద్రబాబు చేసిన తప్పిదం వల్ల డయాఫ్రం వాల్ దెబ్బతింది

Advertisement
 
Advertisement