AP Minister RK Roja Comments On Chandrababu Naidu - Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ను ఎవరు వ్యతిరేకించినా వారికే నష్టం: మంత్రి రోజా

Mar 24 2023 10:54 AM | Updated on Mar 24 2023 12:20 PM

Ap Minister Roja Comments On Chandrababu - Sakshi

సాక్షి, విజయవాడ: సీఎం జగన్‌ను ఎవరు వ్యతిరేకించినా వారికే నష్టమని మంత్రి ఆర్కే రోజా అన్నారు. సీఎం జగన్‌ తన సొంత చరిష్మాతో ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారని, చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలను లాక్కునప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. వైశ్రాయ్‌ హోటల్లో మొదలు పెట్టిన వెన్నుపోటు రాజకీయాన్ని ఇంకా నడిపిస్తున్నారని మంత్రి రోజా మండిపడ్డారు.

‘‘సీఎం అయితేనే అసెంబ్లీకి వస్తానంటూ భార్య పరువును పక్కనపెట్టి చంద్రబాబు అసెంబ్లీకి వచ్చారు. రాజకీయం అంటే అసహ్యించుకునే పరిస్థితికి టీడీపీ దిగజారింది. టీడీపీకి ఓటు వేసిన  ఎమ్మెల్యేలకు భవిష్యత్తు ఉండదు. జగన్‌ను  రాజకీయంగా మోసం చేసినవారు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. టీడీపీకి ఓటు వేసిన వారు  పొలిటికల్‌గా సూసైడ్‌ చేసుకున్నట్టే. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలను ప్రజలు తరిమికొట్టాలి’’ అని మంత్రి రోజా పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement