మదనపల్లి ఫైల్స్‌ దగ్ధంపై మండలిలో రగడ | Ap Assembly: YSRCP Objects Peddireddy Name In Madanapalle Files Incident, More Details Inside | Sakshi
Sakshi News home page

మదనపల్లి ఫైల్స్‌ దగ్ధంపై మండలిలో రగడ

Nov 19 2024 10:44 AM | Updated on Nov 19 2024 11:25 AM

Ap Assembly: YSRCP Objects Peddireddy Name In Madanapalle Files Incident

మదనపల్లి ఆర్డీవో ఆఫీసులో అగ్ని ప్రమాదం ఘటనపై మంత్రి సత్యకుమార్‌ వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు.

సాక్షి, గుంటూరు: మదనపల్లి ఆర్డీవో ఆఫీసులో అగ్ని ప్రమాదం ఘటనపై శాసన మండలి ఇవాళ అట్టుడుకింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరును మంత్రి అనగాని సత్యకుమార్‌ ప్రస్తావనవకు తేవడంపై వైఎస్సార్‌సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రికార్డుల నుంచి  పెద్దిరెడ్డి తొలగించాల్సిందేనని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పట్టుబట్టారు.

మంగళవారం ఏడో రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరిగాయి. శాసన మండలిలో.. మదనపల్లి ఘటన ప్రస్తావించిన మంత్రి అనగాని.. పెద్దిరెడ్డి పేరు లేవనెత్తారు. దీంతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. పెద్దిరెడ్డి పేరును ప్రస్తావించడంపై  వైఎస్సార్‌సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసు విచారణ ఉన్నప్పుడు పేర్లు ఎలా చెప్తారంటూ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. 

‘‘కావాలని బురద చల్లే ప్రయత్నం చేయొద్దు. మీకు చేతనైతే విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకోండి. అనవసరంగా ఆరోపణలు చేయడం సరికాదు. రికార్డుల నుండి పెద్దిరెడ్డి పేరును తొలగించాలి’’ అని బొత్స అన్నారు. ఈ క్రమంలో పేర్లు ప్రస్తావించకుండా మాట్లాడాలంటూ శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు మంత్రి అనగానికి సూచించారు.

Botsa Satya Narayana: కావాలని బురద చల్లే ప్రయత్నం చేయొద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement