Feb 17th: ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్ | AP Elections Today Political News Updates And Headlines On Feb 17th In Telugu - Sakshi
Sakshi News home page

AP Political Updates Feb 17th: ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్

Feb 17 2024 7:05 AM | Updated on Feb 17 2024 8:46 PM

andhra pradesh political updates february 17th - Sakshi

ఏపీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా కొద్దీ.. పొలిటికల్‌ హీట్‌ పెరిగిపోతోంది.. 

AP Elections Political Latest Updates Telugu..

8:45 PM, Feb 17th, 2024
అబద్దాల బతుకు ఇంకెంత కాలం చంద్రబాబూ..: ఎంపీ నందిగం సురేష్

  • వయసు పెరిగేకొద్దీ చంద్రబాబుకు అసహనం పెరుగుతోంది
  • రాజధానిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు
  • చంద్రబాబు వీరుడు, శూరుడైతే పవన్ చంక ఎందుకు ఎక్కావ్? 
  • ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో ఏం మాట్లాడావో ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతున్నావ్?
  • రాజధానిలో పచ్చటి పొలాలను సర్వనాశనం చేసింది చంద్రబాబే
  • బలవంతంగా భూసేకరణ చేయలేదని మనవడిపై ఒట్టేసి చెప్పాలి
  • అబద్దాల బతుకు ఇంకెంతకాలం?
  • కుప్పంలో దొంగ ఓట్లతో గెలిచే చంద్రబాబు పర్చూరు గురించి మాట్లాడటం సిగ్గుచేటు
  • రాష్ట్రంలో ఉన్న చెత్త చంద్రబాబు, పవన్, ఎల్లోమీడియా అధినేతలే
  • తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే చంద్రబాబు గెలిచినట్టు చంకలు కొట్టుకుంటున్నారు 
  • రాజధాని ఫైల్స్ పేరుతో సినిమా తీసి ఆత్మవంచన చేసుకున్నారు
  • రాజధానిని కుల రాజధానిగా మార్చారు
  • జగన్‌ని చూసి చంద్రబాబు భయపడుతున్నారు
  • పంటపొలాలను ఎవరు కాల్చారో నార్కోటెస్టులతో తేల్చుకుందామా?
  • నాలుగు వందలు చొప్పున జనానికి ఇచ్చి సభకు తెచ్చుకునే దుస్థితిలో చంద్రబాబు ఉన్నారు
  • ఎస్సీలను దొంగల్లాగ చిత్రీకరించాలని చంద్రబాబు చూస్తున్నారు
  • ఎస్సీలు, బీసీలతో పెట్టుకునే 2019లో ఓడిపోయాడు
  • ఒళ్లంతా రోగాలని చెప్పుకుని బెయిల్ పై బయటకు వచ్చిన వ్యక్తి చంద్రబాబు
  • ఆయన ప్రజకు భవిష్యత్తు ఇవ్వటమేంటి? 
  • రాజాధానిపై చర్చకు 24 గంటల సమయం ఇస్తున్నా
  • ఎవరైనాసరే చర్చకు‌ రావాలి
  • దమ్ముంటే నా సవాల్ ని స్వీకరించాలి

5:28 PM, Feb 17th, 2024
లోకేష్‌ శంఖారావం యాత్ర అట్టర్‌ ఫ్లాప్‌

  • విశాఖ, పెందుర్తి, భీమిలి నియోజకవర్గాల్లో లోకేష్‌ శంఖారావం యాత్ర అట్టర్‌ ఫ్లాప్‌
  • లోకేష్‌ సభకు ప్రజల నుంచి స్పందన కరువు
  • ఖాళీగా దర్శనమిచ్చిన కుర్చీలు
  • జనాలు లేకపోవడంతో వాహనానికే పరిమితమైన లోకేష్‌
  • రాష్ట్రస్థాయి కార్యక్రమంలా కాకుండా వార్డు కార్యక్రమంలా జరుగుతున్న లోకేష్‌ యాత్ర 

5:22 PM, Feb 17th, 2024
లోకేష్‌ను మరోసారి మడత పెట్టేస్తాం: మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

  • లోకేష్ నాలుక మడత తీస్తే కనీసం పదాలైన సరిగ్గా పలుకుతాడు
  • జగన్ దెబ్బకు లోకేష్ నాలుక, చంద్రబాబు కుర్చీ ఎప్పుడో మడత పడిపోయాయి
  • నీ కుర్చీని 2019లో మేం మడత బెడితే, ఇప్పుడు నీ కుర్చీని నువ్వే మడత  బెట్టుకుంటామని నువ్వే సంకేతాలు ఇచ్చాం
  • లోకేష్‌ను మరోసారి మడత పెట్టేస్తాం
  • రెడ్‌ బుక్‌ను ఎక్కడ మడత పెట్టి పెట్టు కుంటావో నీ ఇష్టం
  • లోకేష్‌ ఎంత సీరియస్‌నెస్‌ క్రియేట్ చేసినా నీ కామెడీ ఫేస్ అందుకు సూటవ్వదు

5:06 PM, Feb 17th, 2024
అసలు కుర్చీనే లేనప్పుడు టీడీపీ నేతలు ఎలా మడత పెడతారు?: వైవీ సుబ్బారెడ్డి

  • రాజ్యసభలో టీడీపీకి ఒక్క సీటు కూడా లేకుండా పోయింది
  • వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఇదే పరిస్థితి ఉంటుంది
  • అసలు కుర్చీనే లేనప్పుడు టీడీపీ నేతలు ఎలా మడత పెడతారు
  • మాకు షర్ట్స్ ఉన్నాయి కాబట్టి మేం మడత పెడతాం
  • "విధ్వంసం" పుస్తకం రాసిన వాళ్లు, ఆవిష్కరించిన వాళ్లను చూస్తేనే దాని వెనుక విద్వేషం అర్దం అవుతోంది.

4:59 PM, Feb 17th, 2024
విజయవాడ: బోండా ఉమపై సీపీకి వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ ఫిర్యాదు

  • సీఎం జగన్‌, వెల్లంపల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బోండా ఉమ
  • చట్ట ప్రకారం బోండా ఉమపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్న వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌

3:02 PM, Feb 17th, 2024
ప్రతిపక్షాలపై మంత్రి రాజన్న దొర మండిపాటు

  • రాజకీయ పరిస్థితులు బట్టి ఎవరి సర్వేలు వాళ్లు చేసుకుంటారు: మంత్రి రాజన్న దొర
  • దాని ప్రకారం వారి ఎక్కడ నుంచి పోటీ చేయాలో పార్టీ నిర్ణయిస్తుంది.
  • దానిపై కూడా ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి
  • గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యేలు ప్రతి గడపకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు
  • రాజధాని కోసం ఎవరి విమర్శలు వారు చేసుకుంటున్నారు
  • న్యాయ పరమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి దీనిపై మాట్లాడకూడదు
  • అన్నీ ప్రాంతాలకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో సీఎం జగన్‌ మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్నారు

2:49 PM, Feb 17th, 2024
ఏబీఎన్ రాధాకృష్ణకు ఓపెన్ ఛాలెంజ్

  • నాపై రాసిన రాతలకు చర్చకు సిద్ధం: ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు
  • ఏబీఎన్ రాధాకృష్ణకు దమ్ముంటే నాతో చర్చకు రావాలి 
  • కాపుల వ్యతిరేక పత్రిక ఆంధ్రజ్యోతి 
  • చిరంజీవి గురించి తప్పుడు రాతలు రాసింది ఆంధ్రజ్యోతి కాదా? 
  • బోండా ఉమాను గెలిపించడానికి నువ్వెంత ప్రయత్నించినా బోండా ఓడిపోవడం ఖాయం 
  • చంద్రబాబు,పవన్, బీజేపీ విజయవాడను మోసం చేశారు 
  • విజయవాడకు రావాల్సిన నిధులను అమరావతికి తరలించారు
  • విజయవాడ అభివృద్ధి వైసీపీతోనే సాధ్యం
  • ఈ ఐదేళ్లలో ఎంతో అభివృద్ధి చేశాం
  • రానున్న ఐదేళ్లలోనూ మరింతగా విజయవాడను అభివృద్ధి చేస్తాం 
  •  సీఎం జగన్‌ పేదల పక్షపాతి 
  • ఎన్నికలొస్తున్నాయి కాబట్టే టీడీపీ, జనసేన విజయవాడపై కపట ప్రేమ చూపిస్తున్నాయి
  • రాబోయే ఎన్నికల్లో విజయవాడలో మూడు అసెంబ్లీలు గెలిచి తీరతాం

2:27 PM, Feb 17th, 2024
టీడీపీ కౌన్సిలర్లపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫైర్ 

  • విజయవాడ నగరపాలక సంస్థ బడ్జెట్‌పై కౌన్సిల్‌లో టీడీపీ కౌన్సిలర్ల ఓవరాక్షన్ 
  • టీడీపీ నేతల తీరు అసెంబ్లీలోనూ.. వీఎంసీ కౌన్సిల్‌లోనూ ఒకేలా ఉంది: మల్లాది విష్ణు
  • బడ్జెట్‌పై చర్చ జరగకుండా అనవసర రాద్ధాంతం చేస్తున్నారు 
  • టీడీపీ కౌన్సిలర్లు ఇంగిత జ్ఞానం లేకుండా సభలో వ్యవహరిస్తున్నారు 
  • విజయవాడ అభివృద్ధి కోసం హెల్త్, వెల్త్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాం
  • ప్రజల అవసరాలను అనుగుణంగా మేయర్ బడ్జెట్ ప్రవేశపెట్టారు
  • చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు విజయవాడ అభివృద్ధిలో వెనకబడిపోయింది
  • వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఐదేళ్లలో విజయవాడను పూర్తిగా అభివృద్ధి చేశాం 
  • గత ప్రభుత్వంలో ఉన్నదంతా మోసం.. దగా.. నిర్లక్ష్యమే
  • మేం గడప గడపకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించాం 
  • రోడ్లు...మంచినీరు సదుపాయం కల్పించాం
  • మెరుగైన పరిపాలన అందించాం 
  • జవాబుదారీతనంతో కౌన్సిల్ పనిచేసింది 
  • 20 వేల మందికి హక్కుతో కూడిన ఇళ్లపట్టాలిస్తున్నాం 
  • ఈ నెలలోనే సీఎం చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేస్తాం

1:32 PM, Feb 17th, 2024
నారా లోకేష్‌ ఏమైనా దిగొచ్చాడా?: మంత్రి కారుమూరి

  • చంద్రబాబు నయవంచకుడు.. ద్రోహి
  • గుంట నక్కలా ఎన్టీఆర్ పంచన చేరి వెన్నుపోటు పొడిచిన వాడు.. మనకు ఏం మేలు చేస్తాడు.
  • లోకేష్ కి తద్దినానికి దినానికి తేడా తెలియదు
  • లోకేష్ వల్ల టీడీపీ నాశనం అవుతుందనే కొంత కాలం దాచారు
  • ఇప్పడు వదిలితే శంఖారావం అంటున్నాడు
  • ఎర్ర బుక్కు రాయడానికి లోకేష్ దిగొచ్చాడా?
  • చంద్రబాబు ప్రజల మంచి కోరేవాడు కాదు కాబట్టే.. భగవంతుడు  లోకేష్ లాంటి వాడిని కొడుకుగా పుట్టించాడు
  • సీఎం వైఎస్ జగన్‌కు ఇవాళ రాష్ట్రంలో వ్యతిరేక ఓటు అంటూ లేదు.. అంతా కలిసొచ్చే ఓటే.
  • గతంలో ఓటు వేసిన వాళ్ళు.. వెయ్యని వాళ్ళు.. తటస్థులు కూడా ఇప్పుడు ఓట్లేయడానికి సిద్దంగా ఉన్నారు
  • బీసీలకు రాజ్యాధికారం వచ్చింది సీఎం జగన్ వల్లే
  • సీఎం జగన్ బీసీల పక్షపాతి
  • బీసీలను చంద్రబాబు ఓట్లేసే యంత్రాల్లా వాడుకున్నాడు
  • బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు


మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కామెంట్లు

1:10 PM, Feb 17th, 2024
టీడీపీకి ఎంపీ కేశినేని నాని కౌంటర్‌

  • కోవిడ్ సమయంలో కూడా మీ అందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఏకైక సీఎం జగన్ మాత్రమే
  • నమ్మిన వాళ్లకు భవిష్యత్ ఇచ్చేది ముఖ్యమంత్రి జగన్
  • నమ్మిన వాళ్ళను మోసం చేసే వ్యక్తి చంద్రబాబు
  • చంద్రబాబు గ్యారెంటీ కార్డులు పట్టుకుని కొంతమంది మీ ఇళ్లకు వస్తున్నారు.. వాళ్లను నమ్మొద్దు
  • చంద్రబాబు అతని దొంగల మాయ మాటలు నమ్మకండి. 
  • మీకోసం మీ కుటుంబాల కోసం పని చేస్తున్నది ముఖ్యమంత్రి జగన్ మాత్రమే.. 
  • అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలి
  • సీఎం జగన్ ప్రభుత్వంలో ఎంత అభివృద్ధి జరిగిందో మీకు తెలుసు
  • రాష్ట్ర భవిష్యత్ బాగుండాలి అంటే నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది

12:45 PM, Feb 17th, 2024
టీడీపీ వక్రీకరిస్తోంది: తలశిల రఘురాం

  • రాప్తాడు సిద్ధం సభ ఏర్పాట్లు పూర్తి
  • కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు చొక్కా స్లిప్స్ ఫోల్డ్ చేయాలని సీఎం జగన్ అన్నారు
  • దానికి మడత పెడతామంటూ చంద్రబాబు నోరుపారేసుకుంటున్నారు
  • దీన్ని టీడీపీ, జనసేన నేతలు వక్రీకరిస్తున్నారు
  • సీఎం జగన్ బహిరంగ సభలకు లక్షలాది మంది తరలివస్తున్నారు
  • చంద్రబాబు సభలు జనం లేక వెలవెలబోతున్నాయి 
  • వచ్చే ఎన్నికల్లో రాజధాని అమరావతి ప్రభావం ఉండదు
  • అమరావతి రాజధానిగా 29 గ్రామాలకే పరిమితం
  • వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 175 సీట్లు ఖాయం
  • సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీ భూస్థాపితం 
  • ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సభలపై ఎల్లో మీడియా అసత్య ప్రచారం 

12:30 PM, Feb 17th, 2024
నూజివీడు టీడీపీలో కొనసాగుతున్న అసమ్మతి

  • పార్టీకి రాజీనామా చేసిన టీడీపీ నేత కాపా శ్రీనివాసరావు 
  • కాపా శ్రీనివాస్‌ హాట్‌ కామెంట్స్‌..
  • నూజివీడులో లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్ ఉంది 
  • పచ్చ చొక్కాలు వేసుకున్న వారిని తరిమికొట్టామన్న వ్యక్తికి టికెట్ ఇచ్చారు 
  • టికెట్ స్థానికులకే ఇవ్వాలని కోరినా అధిష్టానం పట్టించుకోలేదు 
  • పార్టీ కోసం పని చేస్తుంటే టీడీపీ వాళ్లే నాపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు
  • పార్టీలో సమస్యలున్నా పట్టించుకునే నాథుడే లేరు. 
  • మరోవైపు.. పార్ధసారధికి టికెట్ ఇవ్వడంపై కాపా, ముద్దరబోయిన అసంతృప్తి 
  • ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కూడా పార్టీ మారుతారని జోరుగా ప్రచారం

12:05 PM, Feb 17th, 2024
టీడీపీకి కౌంటరిచ్చిన భూమన అభియన్‌ రెడ్డి

  • వారసత్వ రాజకీయాలకు ప్రతినిధిగా నేను ముందుకు రాలేదు.
  • నేను చేసిన అభివృద్ధి పనులను చూసి ఆదరించండి.
  • కొత్త తరానికి ప్రతినిధిగా నగరాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళే బాధ్యత నేను తీసుకుంటా.
  • టీడీపీ హయాంలో శ్రీనివాస సేతును ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేసింది వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ.
  • 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు 80 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించాం.
  • వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉంటే మీ ఇంటి వద్దకే ఫించన్ వస్తుంది.
  • చంద్రబాబు అధికారంలోకి వస్తే సచివాలయ వ్యవస్థను తీసి వేస్తారు.
  • టీడీపీ అధికారంలోకి వస్తే ఫించన్ కోసం క్యూ లైన్‌లో నిలబడే పరిస్థితి వస్తుంది.
  • సంక్షేమ ప్రభుత్వం కావాలంటే వైఎస్సార్‌సీపీకి ఓటు వేసి గెలిపించుకోవాలి.

11:45 AM, Feb 17th, 2024
టీడీపీ పతనావస్థకు ఇదే నిదర్శనం: మంత్రి పెద్దిరెడ్డి

  • రాప్తాడు సిద్ధం సభకు సర్వం సిద్ధం చేశాం
  • సిద్ధం సభ నుంచి ముఖ్యమంత్రి జగన్‌ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు
  • వైఎస్సార్‌సీపీ ఎన్నికల శంఖారావం పూరించింది
  • భీమిలి, దెందులూరు సభలుఇప్పటికే విజయవంతమయ్యాయి
  • రాప్తాడు సభకు రాయలసీమ జిల్లాల నుంచి లక్షలాది మంది వైఎస్సార్‌సీపీ శ్రేణులు తరలి వస్తాయి
  • టిక్కెట్లు దక్కని వారికి సముచిత ప్రాధాన్యం ఉంటుంది
  • ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ సారథి
  • దూషణలు, తిట్ల పర్వంతో టీడీపీ అభాసుపాలు
  • 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రాష్ట్రానికి ఏమీ చేయలేదు
  • నాలుగున్నరేళ్ల పాలనలో సీఎం జగన్ 99 శాతం హామీలను అమలు చేశారు
  • రాజ్యసభలో టీడీపీ జోరో అయ్యింది
  • టీడీపీ పతనావస్థకు ఇదే నిదర్శనం. 

11:15 AM, Feb 17th, 2024
టీడీపీ కుర్చీ మడత పెట్టడానికి ప్రజలు సిద్ధమయ్యారు: దేవినేని అవినాష్

  • డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశాడు 
  • చంద్రబాబు మాటలు నమ్మి మహిళలు డ్వాక్రా సొమ్ము కట్టకపోతే బ్యాంక్ అధికారులు నోటీసులు జారీ చేశారు
  • మహిళలను మాయ చేసిన పార్టీ టీడీపీ 
  • కోట్లు కొట్టు సీటు పట్టు అనేదే టీడీపీ విధానం
  • కోట్లు ఇచ్చే వారికే టీడీపీ టిక్కెట్లు ఇస్తారు
  • బలహీన వర్గాలకు అండగా వైఎస్సార్‌సీపీ టిక్కెట్లు కేటాయిస్తుంది
  • బీసీలకు మైలవరం, పెనమలూరు టికెట్స్ ఇచ్చారు
  • ఈ నియోజకవర్గాల్లో బీసీ అభ్యర్థులకు టికెట్ ఇచ్చే దమ్ము టీడీపీకి ఉందా?
  • ఏలూరు పార్లమెంట్ సీటు కూడా వైఎస్సార్‌సీపీ బీసీలకు ఇచ్చింది
  • పేరుకు మాత్రమే టీడీపీ బీసీల పార్టీ అంటుంది
  • నిజమైన బీసీల పార్టీ వైఎస్సార్‌సీపీ మాత్రమే
  • 2019లో ప్రజలు కుర్చీ మడత పెట్టి కొడితే చంద్రబాబు హైదరాబాద్ పారిపోయాడు
  • 2024 ఎన్నికల్లో కూడా కుర్చీ మడత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు
  • వైఎస్సార్‌ ఆసరా ద్వారా నాలుగు విడతలుగా డ్వాక్రా మహిళలకు ముఖ్యమంత్రి జగన్ ఆసరాగా నిలిచారు 
  • మాట ఇచ్చి నిలబెట్టుకున్న వైఎస్సార్‌సీపీతో వైపు ఉంటారో, మాట తప్పిన టీడీపీతో ఉంటారో ప్రజలే నిర్ణయించుకోవాలి
  • గత టీడీపీ హయంలో తమ అభ్యర్థి కార్పోరేటర్ ఉంటేనే అభివృద్ధి చేసేవారు 
  • గెలుపు ఓటములతో సంబంధం లేకుండా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.  
  • కృష్ణలంక అంటే స్థానిక టీడీపీ ఎమ్మెల్యేకి ఇష్టం ఉండదు
  • సీఎం జగన్‌ చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని ప్రతీ గడపకు వెళ్లి వివరిస్తున్నాం.

10:36 AM, Feb 17th, 2024
నూజివీడు టీడీపీలో కొనసాగుతున్న అసమ్మతి

  • టీడీపీకి కాపా శ్రీనివాసరావు రాజీనామా 
  • నూజివీడులో లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్ ఉంది: కాపా
  • పచ్చ చొక్కాలు వేసుకున్న వారిని తరిమికొట్టామన్న వ్యక్తికి టికెట్ ఇచ్చారు: కాపా
  • టికెట్ స్థానికులకే ఇవ్వాలని కోరినా అధిష్టానం పట్టించుకోలేదు : కాపా
  • పార్టీ కోసం పని చేస్తుంటే టీడీపీ వాళ్లే నాపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు : కాపా
  • పార్టీలో సమస్యలున్నా పట్టించుకునే నాథుడే లేరు : కాపా
  • పార్ధసారధికి టికెట్ ఇవ్వడంపై కాపా, ముద్దరబోయిన అసంతృప్తి
  • ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పార్టీ మారుతారని జోరుగా ప్రచారం

10:15 AM, Feb 17th, 2024
చంద్రబాబులా వెన్నుపోటు పొడిచే రకం కాదు: మంత్రి అమర్నాథ్‌

  • చంద్రబాబుపై మంత్రి గుడివాడ అమర్నాథ్‌ సీరియస్‌
  • బాబులా వెన్నుపోటు పొడిచి కుర్చీ లాక్కునే రకం కాదు నేను. 
  • మేము సీఎం జగన్‌ వద్ద పనిచేసే సైనికులం. 
  • సీఎం జగన్‌ అనుకుంటే ఎక్కడైనా కూర్చోబెడతారు. 

9:30 AM, Feb 17th, 2024
సోమిరెడ్డి తన ధోరణి మార్చుకోవాలి: మంత్రి కాకాణి సీరియస్‌

  • కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్‌పై టీడీపీ నేత సోమిరెడ్డి నానా హడావిడి చేశారు
  • నిన్న వెజల్ వచ్చి కంటైనర్లను అన్ లోడ్ చేసింది
  • కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్‌ను కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి  కూడా తీసుకెళ్లాం
  • కానీ, సోమిరెడ్డి మాత్రం అఖిలపక్షం పేరుతో ఆందోళనలు చేశారు
  • సోమిరెడ్డి తన స్వార్ధ ప్రయోజనాల కోసం అభివృద్ధిని అడ్డుకుంటున్నారు
  • పోర్టు యాజమాన్యంతో పాటు పరిశ్రమల ప్రతినిధులను బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు ఇవన్నీ చేస్తున్నారు
  • ఎన్నికల్లో పోటీకి సోమిరెడ్డి పనికిరారని చంద్రబాబు భావిస్తున్నాడు. 
  • అందుకే ఈ నియోజకవర్గంపై సర్వే చేయిస్తున్నారు
  • ఆ సర్వేకి సంబంధించిన కాల్ నాకు కూడా వచ్చింది
  • ప్రజలు ఎవరిని ఆదరిస్తారో ఎన్నికల్లో చూసుకుందాం..
  • ఇప్పటికైనా సోమిరెడ్డి తన ధోరణి మార్చుకోవాలి.

8:00 AM, Feb 17th, 2024
రాజ్యసభలో టీడీపీ సున్నా

  • మూడు స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు 
  • రాష్ట్ర కోటాలో రాజ్యసభలోని 11 స్థానాలూ వైఎస్సార్‌సీపీ ఖాతాలోకే 
  • 41 ఏళ్ల టీడీపీ చరిత్రలో రాజ్యసభలో ఆ పార్టీ ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే తొలిసారి 
  • ఈ ఎన్నికల్లో ఓటుకు కోట్లు వెదజల్లడానికి సిద్ధమైన బాబు 
  • కుయుక్తులు ఫలించక.. చివరి నిమిషంలో పోటీ చేయడం లేదని ప్రకటన 
  • చంద్రబాబు మోసాలకు 2019 ఎన్నికల్లోనే చెక్‌ పెట్టిన ప్రజలు.. టీడీపీ చారిత్రక ఓటమి 
  • 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ రికార్డు విజయం 
  •  ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 
  • తొలి ఏడాదే 95 శాతం,  ఇప్పటివరకు 99.5 శాతం హామీలు అమలు 
  • సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో ప్రజల మనసులు గెల్చుకున్న జగన్‌  

7:30 AM, Feb 17th, 2024
స్పీడ్‌ పెంచిన వైఎస్సార్‌సీసీ

  • దూకుడు మీదున్న వైఎస్సార్‌సీపీ.. కేడర్‌ కోసం సిద్ధం సభలు
  • మరోవైపు నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌ల ప్రకటనలు
  • తాజాగా ఏడో లిస్టు రిలీజ్ చేసిన పార్టీ అధిష్టానం
  • కందుకూరుకు అరవిందాయాదవ్, పర్చూరుకి ఎడం బాలాజీ నియామకం
  • ఇప్పటికి 65 నియోజకవర్గాలలో మార్పులు, చేర్పులు
  • 16 పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ ఇన్‌ఛార్జ్‌ల మార్పు
  • ఇంకా పొత్తులు, సీట్లు తేలక గందరగోళంలో ప్రతిపక్షాలు
  • రేపు రాప్తాడులో మూడో సిద్ధం సభకు పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ హాజరు
  • 175 నియోజకవర్గాలలో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ
  • ముఖ్యమంత్రి జగన్ వ్యూహాలతో బెంబేలెత్తుతున్న చంద్రబాబు అండ్ కో.
     

7:15 AM, Feb 17th, 2024
టీడీపీలో మరో నియామకం..

  • కడప పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడిగా శ్రీనివాస రెడ్డి నియామకం
  • కడప లోక్‌సభ స్థానం ఆశిస్తున్న శ్రీనివాస రెడ్డి
  • ప్రొద్దుటూరు టీడీపీ టికెట్‌ ఆశిస్తున్న లింగారెడ్డి. 

7:00 AM, Feb 17th, 2024
బ్రో.. డైలాగ్‌ మారింది!

  • ‘పవనా’లు ఎటు వీస్తే అటు పరుగులు 
  •  పవన్‌కళ్యాణ్‌ నోట్లో లెక్కపెట్టలేనన్ని నాలుకలు 
  • రాజధాని మొదలు అవినీతి, పొత్తులు, వలంటీర్ల వరకూ అదే తీరు  
  • విద్రోహ శక్తులతో పోల్చిన నోటితోనే వలంటీర్లపై పొగడ్తలు  
  • అప్పుడు అలా అనలేదంటూ నాలుక మడతలు 
  • అమరావతి కొద్ది మందిదే అంటూ 2018లో వ్యాఖ్య  
  • టీడీపీ, బీజేపీ, వామపక్షాల పార్టీ లతో విచిత్ర వేషాలు   

6:50 AM, Feb 17th, 2024
పొత్తు పొడవండి ప్లీజ్‌

  • మేం పొత్తుకు రెడీ.. మీరు ఓకే అంటే వచ్చేస్తాం
  • ఈ నెల 20 తర్వాత ఢిల్లీ వెళ్లేందుకు చంద్రబాబు, పవన్ రెడీ
  • ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న ఏపీ బీజేపీ ముఖ్యనేతలు
  • ఎన్డీయేలో టీడీపీ చేరాలా లేదా అన్నదానిపై పార్టీ పెద్దల సమాలోచనలు
  • వచ్చే నెల మొదటి వారం వరకు వేచి చూద్దామన్న యోచనలో బీజేపీ
  • టిడిపి, జనసేన నుంచి పెరుగుతున్న ఒత్తిడి
  • సీట్ల సర్దుబాటు పై క్లారిటీ ఇవ్వాలంటూ విజ్ఞప్తులు
  • ముందు ఎన్డీయేలో చేరండి, తర్వాత సీట్ల సంగతి చూద్దామంటున్న బీజేపీ

6:40 AM, Feb 17th, 2024
పార్లమెంటులో టీడీపీ అసలుందా?

  • రాజ్యసభలో సున్నాకు పడిపోనున్న టీడీపీ సంఖ్యాబలం
  • లోక్‌సభలో టీడీపీకి మిగిలింది ఒక్కరే 
  • 2019లో టీడీపీ తరపున గెలిచింది ముగ్గురు
  • రాజకీయాలకు రిటైర్మెంట్‌ ప్రకటించిన గల్లా జయదేవ్‌
  • టీడీపీకి రాజీనామా చేసిన కేశినేని నాని
  • ప్రస్తుతం టీడీపీకి పార్లమెంటులో మిగిలిన ఏకైక సభ్యుడు రామ్మెహన్‌
  • తెలంగాణలో పోటీకి దిగని తెలుగుదేశం జాతీయ పార్టీ అని ఎలా చెప్పుకోగలదు?
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా వ్యూహం పని చేసింది, రాజ్యసభకు పోటీ చేస్తామని ఎందుకు చెప్పింది?
  • ఫలానా వాళ్లు అభ్యర్థులు అంటూ పార్టీలో చర్చ ఎందుకు లేవనెత్తింది?
  • ఇంత చేసీ అసలు పోటీకి దిగకుండానే తోక ఎందుకు ముడిచింది?
  • 40 ఏళ్లలో తెలుగుదేశం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో అత్యంత అధమస్థాయికి చేరడం ఇప్పుడే కనిష్టం

6:35 AM, Feb 17th, 2024
మొదలయింది జనసేనకు చుక్కల పర్వం
బుచ్చయ్య సిట్టింగ్‌ ఫిట్టింగ్‌

  • టీడీపీలో సిట్టింగ్ లందరికీ మళ్లీ‌సీట్లు : బుచ్చయ్య చౌదరి
  • రెండేళ్ల క్రితమే నిర్ణయం జరిగిపోయింది 
  • జనసేనకు ఇచ్చే సీట్లలో వాళ్ల సర్దుబాటు వాళ్లిష్టం 
  • టికెట్లు ఆశించి చాలామంది చేరుతున్నారు 
  • కానీ, ఒరిజినల్ టీడీపీ లీడర్లకు అన్యాయం జరగదు 
  • నేను మాత్రం రాజమండ్రి రూరల్ నుంచే పోటీ చేస్తున్నా

6:30 AM, Feb 17th, 2024
అధిష్టానానికి 20 అసెంబ్లీ స్థానాల లిస్టు పంపిన ఏపీ బీజేపీ 

  • 20 చోట్ల బీజేపీకి క్యాడర్‌ ఉంది : రాష్ట్ర నాయకత్వం 
  •  ఉమ్మడి కర్నూలు మినహా మిగతా జిల్లాల్లో పోటీకి బీజేపీ ఆసక్తి 
  • నియోజకవర్గాల పేర్లు సూచిస్తూ హైకమాండ్ కు ఏపీ బీజేపీ రిపోర్ట్ 
  • తూర్పుగోదావరిలో 3, కృష్ణాలో 2, గుంటూరులో 4 సీట్లు కోరుతోన్న బీజేపీ 
  • నెల్లూరులో 2, కడపలో 1, చిత్తూరులో 2, పశ్చిమగోదావరిలో 2 సీట్లు 
  • శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, అనంతపురంలో ఒక్కొక్కటి చొప్పున డిమాండ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement