అధికారులు అనుమతించక నామినేషన్ వేయకుండా వెళ్లిపోతున్న తండ్రీ కుమార్తెలు
కాకినాడ: సమయానికి అనుగుణంగా నడుకోవాలంటారు పెద్దలు. అలాంటి సమయం మించిపోవడంతో ఓ అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశాన్ని కోల్పోయింది. పెద్దాపురం మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ వేయడానికి ఆదివారం చివరి రోజు. స్థానిక బచ్చు గురుమూర్తి మున్సిపల్ ఆడిటోరియంలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
మధ్యాహ్నం మూడు గంటల లోపు నామినేషన్లు వేయడానికి వచ్చిన అభ్యర్థులను మాత్రమే పోలీసులు లోపలకు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో ఓ యువతి తన తండ్రితో కలసి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు పరుగులెత్తుకుంటూ మూడు గంటల దాటిన తరువాత నామినేషన్ కేంద్రం వద్దకు చేరుకుంది. అయితే అప్పటికే గడుపు ముగిసిందని, నిబంధనల ప్రకారం కుదరదని అధికారులు సృష్టం చేయడంతో, చేసేది లేక ఆ తండ్రీ కూతుర్లు తీవ్ర నిరాశతో వెనుతిరిగారు.


