సాక్షి,వైఎస్సార్ కడప:రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసిన కూటమి శ్రేణుల కక్షలు, దాడులు చల్లారడం లేదు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో అధికార టీడీపీ శ్రేణులు అర్ధరాత్రి వేళ బరితెగించి బీభత్సం సృష్టించాయి. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ స్థానానికి వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన సీనియర్ నాయకుడు పోరెడ్డి నరసింహారెడ్డి నివాసమే లక్ష్యంగా ఈ దౌర్జన్యం చోటుచేసుకుంది.
స్థానిక ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసిన అనంతరం, ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ సంఖ్యలో తరలివచ్చిన టీడీపీ ముఠాలు పోరెడ్డి నరసింహారెడ్డి ఇంటిని ముట్టడించాయి. వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థిపై నేరుగా భౌతిక దాడి చేసేందుకు పచ్చ మూకలు యత్నించాయి. అయితే, అప్పటికే ఇంటి గేట్లు మూసివేసి ఉండటంతో లోపలికి వెళ్లడం సాధ్యం కాలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన హల్చల్ శ్రేణులు.. పోరెడ్డి నివాసంపైకి విచక్షణారహితంగా రాళ్లు, ఇటుకలతో దాడికి దిగాయి.
కారు అద్దాలు ధ్వంసం.. ఆస్తి నష్టం
ఈ రాళ్ల దాడిలో పోరెడ్డి నరసింహారెడ్డి ఇంటి ఆవరణలో నిలిపి ఉంచిన కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. నిందితులు కర్రలు, రాళ్లతో కారుపై దాడి చేసి తీవ్ర నష్టం చేకూర్చారు. నివాసంలోని కిటికీల అద్దాలు సైతం ఈ దాడిలో పగిలిపోయాయి. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా పెద్ద పెట్టున రాళ్లు పడుతుండటంతో ఇంట్లోని కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ఇదీ చదవండి: ఇది ప్రజాస్వామ్యమా?


