ఏపీలో జంగిల్‌రాజ్‌పై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఓటమి భయంతోనే పట్టపగలు దాడులు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలు, నిర్బంధాలు
నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకోవడం ఎక్కడైనా చూశామా?
చంద్రబాబుకు ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం లేకనే అడుగడుగునా దౌర్జన్యాలు
పోలీసులు ఆయనకు తొత్తుగా వ్యవహరిస్తున్నారు
గూండాలను దాటుకుని లోపలకు వెళ్లినా నామినేషన్ పత్రాలు తీసుకోని ఆర్వోలు
అసలు నామినేషన్ కేంద్రాల్లో వేలాది మంది గూండాలు ఎందుకున్నట్లు? పోలీసులు ఏం చేస్తున్నట్లు?
నామినేషన్ దాఖలు చేసేలా చర్యలు తీసుకోవాల్సిన ఎస్‌ఈసీ చేష్టలుడిగి చూస్తోంది
అందుకే సీఈసీ, ఎస్‌ఈసీ నియామకాల్లో సంస్కరణలు రావాలి
సీజేఐ, విపక్షనేత, ప్ర«ధాని కలిసి సీఈసీని.. హైకోర్టు సీజే, సీఎం, విపక్షనేత కలిసి ఎస్‌ఈసీని నిర్ణయించాలి
రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితిని గవర్నర్, ఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళ్లిన వైఎస్ జగన్
తక్షణమే పారా మిలటరీ బలగాలను దించాలని విజ్ఞప్తి
నామినేషన్ వేసే హక్కును కాలరాస్తుండటం దారుణమని మండిపాటు
పోలింగ్ స్టేషన్లలో, స్ట్రాంగ్ రూమ్‌లతో లైవ్ వెబ్‌కాస్టింగ్ పెట్టాలని డిమాండ్
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ఉద్యోగులు, పార్టీ శ్రేణులు తిరగబడాలని పిలుపు
ఎన్నికలు సజావుగా జరిగితే, గెలుస్తామన్న ధైర్యం చంద్రబాబుకు లేదు. అందుకే చంద్రబాబు నారాసుర రక్త చరిత్ర రాస్తూ స్థానిక ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వమే హింసకు పాల్పడేలా చేస్తున్నారు. ఎలాగైనా ఈఎన్నికల్లో గెల్చేందుకు అక్రమాలు, కుట్రలకు తెగబడుతున్నాడు.
అన్యాయం చేసిన ప్రతి అధికారికీ చెబుతున్నా. అన్యాయం చేస్తున్న ప్రతి వెన్నుపోటు పార్టీ నాయకుడికి చెబుతున్నా. టైమ్ మీది నడుస్తుండవచ్చు. కానీ మా టైమ్ కూడా వస్తుంది. మా టైమ్ వచి్చనప్పుడు మీరు చేసిన ఈ అక్రమాలే మీకు తిరిగి చుట్టుకుంటాయి.
ఇంతవరకు ఇన్ని కష్టాలను ఓర్చి నిలబడ్డ ప్రతి వైఎస్సార్‌సీపీ కార్యకర్తకు, చంద్రబాబు తుపాకీ తూటాలకు వెరవకుండా,పోలీసుల లాఠీలకు భయపడకుండా, చంద్రబాబు గూండాల దాడికి బెదరకుండా, వెన్ను చూపకుండా ఎదురొడ్డి నిలిచిన ప్రతి వైఎస్సార్‌సీపీ కార్యకర్తకు, ప్రతి ప్రజాస్వామ్యవాదికి శాల్యూట్ చేస్తున్నా. హ్యాట్సాఫ్ చెబుతున్నా. – వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి


