చిత్తూరు: మా నాయకుడి పైనే ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధపడుతున్నావంట? నీకెంత ధైర్యం? అసలు నువ్వు ప్రాణాలతో ఉంటే కదా పోటీకి దిగేది? అంటూ యాదమరి మండలంలో టీడీపీ శ్రేణులు బరితెగించారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున పోటీకి ఆసక్తి చూపు తున్న ఓ కార్యకర్తపై ఆదివారం కర్రలతో విచక్షణా రహితంగా దాడిచేసి, కత్తితో బెదిరించారు. బాధితు ల కథనం మేరకు.. గొందివాళ్లవూరు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త దాము ఆదివారం యాదమరిలోజరిగిన పార్టీ కార్యకర్తల సమావేశా నికి హాజరయ్యారు.
తిరిగి ఇంటికి వెళ్తుండగా పచ్చాపూరు సమీపంలో మొఖాలకు రుమాళ్లు చుట్టుకుని వచ్చిన కొందరు పచ్చ రౌడీలు దాముపై విరుచుకుపడ్డారు. ‘ఏమిరా దాము.. రాబోయే ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నావంట. ఎంత ధైర్యముంటే మా అన్నకు ఎదురుగా పోటీ చేస్తావు. నా సంగతి తెలిసే ఇలా చేస్తున్నావా?’ అంటూ కర్రలతో చావబాదారు. కత్తి చూపించి.. ‘నిన్ను చంపేస్తే ఇక్కడ అడిగే వారే లేరు’ అంటూ హెచ్చరించారు. బాధితుడి ఆర్తనాదాలు విన్న స్థానికులు గట్టిగా కేకలు వేయడంతో పచ్చ మూక లు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దాడిలో దాము తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యు లు అతన్ని 108లో చిత్తూ రు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మండల కన్వీనర్ ధనుంజయరెడ్డి, మాజీ ఎంపీపీ సురేష్ బాబు, పలువురు పార్టీ నాయకులు ఆస్పత్రికి చేరుకుని దామును పరామర్శించారు.
ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ధనుంజయరెడ్డి మాట్లాడుతూ దాముపై దాడి పిరికిపందల చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశా రు. కూటమి నేతలు తమ ఓటమిని ముందే గ్రహించి, దాడులకు పాల్పడు తున్నాని దుయ్యబట్టారు. ఈ దాడి వెనుక గొందివాళ్లవూరు నుంచి ఎంపీటీసీగా పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్న టీడీపీలోని ఓ అక్రమ మైనింగ్ నేత కుమారుడి హస్తం ఉన్నట్లు బాధితుడి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. సదరు నేత అండ చూసుకునే పట్రపల్లికి చెందిన ఓ ఫీల్డ్ అసిస్టెంట్ తన స్నేహితులతో కలిసి హత్యాప్రయత్నానికి ఒడి గట్టాడని ఆరోపించారు. పోలీసులు తక్షణమే విచారణ జరిపి, నిందితులపై కఠిన చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


