తాడిపత్రిలో జేసీ వర్గీయుల దాష్టీకం | Brutality of JC Prabhakar Reddy Camp in Tadipatri | Sakshi
Sakshi News home page

తాడిపత్రిలో జేసీ వర్గీయుల దాష్టీకం

Oct 19 2026 9:39 AM | Updated on Oct 19 2026 9:55 AM

Brutality of JC Prabhakar Reddy Camp in Tadipatri

సాక్షి,అనంతపురం: తాడిపత్రిలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల వేళ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి వర్గీయులు పేట్రేగిపోయారు. నామినేషన్లు వేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు.

తాడిపత్రి మునిసిపాలిటీ పరిధిలోని 24వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కోట్ల షఫీ ఇంట జేసీ వర్గీయులు వీరంగం సృష్టించారు. ఆయన ఇంటిపై దాడి చేసి, ఇంట్లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. నామినేషన్లు ఉప సంహరించుకోవాలని, లేదంటే అంతుచూస్తామని హెచ్చరికలు జారీ చేశారు.

అభ్యర్థి కిడ్నాప్, అర్ధరాత్రి విడుదల
ఇదే క్రమంలో 1వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మహమ్మద్ జాఫర్‌ను జేసీ వర్గీయులు కిడ్నాప్ చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయనను తీవ్రంగా బెదిరించి, ఆ తర్వాత వదిలిపెట్టారు. జేసీ వర్గీయుల ఈ గూండాగిరి, బెదిరింపుల కారణంగా తాడిపత్రిలో భయాందోళన వాతావరణం నెలకొంది. ప్రత్యర్థుల బెదిరింపులతో భయపడిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు సుమారు ఐదు వార్డుల్లో నామినేషన్లు కూడా వేయలేకపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement