సీటు కోసం మొదలైన గొడవ కట్ చేస్తే..30 మంది.. | Kakinada RTC Bus Seat Fight | Sakshi
Sakshi News home page

సీటు కోసం మొదలైన గొడవ కట్ చేస్తే..30 మంది..

Oct 19 2026 8:20 AM | Updated on Oct 19 2026 8:44 AM

Kakinada RTC Bus Seat Fight

తూర్పుగోదావరి: ఆర్టీసీ బస్సులో సీటు విషయమై ఇరు వర్గాలకు జరిగిన ఘర్షణలో ఒకరికి గాయాలు కాగా, ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. తుని నుంచి రాజమహేంద్రవరం బయలుదేరిన బస్సులో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం తునిలో రాజమహేంద్రవరం వెళుతున్న బస్సులో రాజమహేంద్రవరం సుబ్బారావు నగర్‌కు చెందిన గారా అప్పారావు తన భార్య, తన తమ్ముడి ఇద్దరు కుమారైలు, మనమరాలితో కలిసి బస్సు ఎక్కాడు. 

ఇదే బస్సులో ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామానికి చెందిన నలుగురు మహిళలు ఎక్కారు. వారి మధ్య మధ్య సీటు విషయమై వివాదం జరిగింది. సిరిపురం గ్రామానికి చెందిన మహిళలు తమ బంధువులకు ఫోన్‌ చేసి, బస్సులో తమపై దాడి జరిగిందని తెలిపారు. దీంతో వారికి సంబంధించిన 30 మంది యువకులు సిరిపురం సమీపంలోని చిన్నింపేట జాతీయ రహదారిపై బస్సును ఆపి అప్పారావుపై దాడి చేశారు. 

ఈ ఘటనలో అప్పారావుకు గాయాలు కాగా, తమ్ముడి కుమారైలకు ఆందోళనతో ఫిట్స్‌ వచ్చాయి. వెంటనే అప్పారావు తన బంధువులకు ఫోన్‌ చేసి తనపై దాడి జరిగిందని చెప్పడంతో వారు మూడు కార్లల్లో చిన్నింపేటకు చేరుకున్నారు. ఇరువర్గాల మధ్య వాదన జరగగా, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివాదాన్ని సద్దుమణిగించారు. గాయపడిన వారికి ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ తీసుకువెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement