AP Political Updates Feb 22nd: ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్ | Sakshi
Sakshi News home page

AP Political Updates Feb 22nd: ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్

Published Thu, Feb 22 2024 6:43 AM

Andhra Pradesh Political News Updates Telugu Feb 22nd Updates - Sakshi

AP Elections Political Latest Updates Telugu..

9:02 PM, Feb 22nd, 2024

జగనన్న  ఆదేశించాడు.. ఈ రాంబంటు అమలుచేస్తాడు: అనిల్ కుమార్ యాదవ్‌

 • ఘనమైన చరిత్ర కలిగిన నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గానికి బీసీ అయిన నన్ను అభ్యర్ధిగా పంపించిన గొప్ప వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి
 • నేను ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన తరువాత గొర్రెలు కాసుకునే వ్యక్తిని మంత్రిని చేశారని టీడీపీ వ్యక్తులు హేళనగా మాట్లాడారు
 • తల పగిలినా, రక్తం కారినా వెనుకడుగు వేసే వ్యక్తి కాదు మీ అనిల్ కుమార్
 • ప్రతి ఒక్క బీసీ సోదరుడు తమ సత్తా చూపించాల్సిన సమయం వచ్చింది
 • ఇంతమంది కట్ట కట్టుకొని ఒక్క జగనన్న పై పోటీకి వస్తున్నారంటే ఎవరి సత్తా ఏంటో అందరికీ తెలిసింది
 • మనం అందరం నమ్మున్న మన నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి  వెంట నిలబడుదాం
 • మీ అందరి ఆశీసులతో నరసరావుపేట ఎంపీగా గెలిచిన తరువాత ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటా
   

8:49 PM, Feb 22nd, 2024

పల్నాడు జిల్లా:

గతంలో బీసీలు అంటే ఏవో నాలుగు రకాల కులాలు మాత్రమే కనిపించేవి:  ఎంపీ మోపిదేవి వెంకటరమణ

 • కానీ ఇప్పుడు 136 బీసీ కులాలను వెలుగులోకి తీసుకువచ్చిన గొప్ప నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి
 • వార్డు మెంబర్లుగా కూడా పోటీ చేయలేని వారిని ఎమ్మెల్యేలుగా కార్పొరేషన్ చైర్మన్ గా చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిది
 • సామాన్య కార్యకర్త కూడా ఉన్నతమైన పదవులు అందటం కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే చూశాం
 • లక్షల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలను అందించిన వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీని బీసీ లందరూ మళ్లీ అధికారంలోకి తీసుకురావాలి

జగన్‌మోహన్‌రెడ్డి పాలన బీసీలకు స్వర్ణయుగం: ఆర్ కృష్ణయ్య 

 • బీసీలు పాలితులు కాదు పాలకులుగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీల రాజకీయ అభివృద్ధికి పెద్దపీట వేశారు
 • రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే కోరుకుంటున్నారు అది కొంతమందికి నచ్చటం లేదు
 • బీసీ కులాలు మరింత అభివృద్ధి చెందాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిది బీసీలంతా కలిసి మళ్ళి ముఖ్యమంత్రి చేసుకోవాలి

7:00 PM, Feb 22nd, 2024

విజయవాడ:

దమ్ము, ధైర్యం ఉంటే పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబు సింగిల్‌గా పోటీ చేయాలి: వెలంపల్లి శ్రీనివాసరావు

 • సీఎం జగన్‌ను ఎదుర్కొనే సత్తా చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లకు లేదు
 • నారా భువనేశ్వరి ఎప్పటి నుంచో కోరిక, చంద్రబాబను పక్కన పెట్టి లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయాలని
 • లోకేష్ వల్ల సాధ్యం కాదనే చంద్రబాబు పక్కన కూర్చోపెట్టాడు
 • ఎన్టీఆర్‌కు చంద్రబాబు ఏ విధంగా వెన్నుపోటు పొడిచాడో.. భువనేశ్వరి కూడా అదే విధంగా చేస్తుందేమోనని అనిపిస్తోంది
 • చంద్రబాబు వేస్ట్‌ అని భువనేశ్వరి మనసులో మాట బయటపెట్టారు
 • చంద్రబాబును పక్కన పెట్టి లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయాలని గతంలోనే భువనేశ్వరి ఆలోచించింది

6:50 PM, Feb 22nd, 2024

ప్రకాశం జిల్లా: 
సీఎం జగన్‌ మాట ఇచ్చాడంటే తప్పడు అనడానికి ఇదే నిదర్శనం: బాలినేని శ్రీనివాస్‌రెడ్డి

 • ఒకేసారి 25వేల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టడం ఒక చరిత్ర
 •  ఒంగోలు నియోజక నగరంలో పూరి గుడిసె లేని ఇంటిని చూడాలనిదే లక్ష్యం
 •  536 ఎకరాల్లో సుమారు 25వేల మందికి ఇంటి స్థలం లేని పేదలకు రేపు రిజిస్ట్రేషన్ చేసి పత్రాలు అందజేస్తాం
 •  ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాట ఇచ్చాడంటే తప్పడు అనడానికి ఈ బృహత్తర కార్యక్రమం నిదర్శనం
 • కష్ట కాలంలో కూడా 231 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి  జగన్‌మోహన్‌రెడ్డి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటా
 • తెలుగుదేశం పార్టీ ఇన్ని కుట్రలు చేసినా పేదల పక్షాన ముందుకెళ్తూనే ఉంటాం
 •  ముఖ్యమంత్రి  జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా రేపు లబ్ధిదారులకు స్థల రిజిస్ట్రేషన్ పత్రాలు అందిస్తాం
 •  అలాగే 339 కోట్ల రూపాయలతో  నిర్మించే త్రాగు నీటి ప్రాజెక్టుకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు 
 • పేద మధ్యతరగతి వర్గాల పక్షాన మా ప్రభుత్వం చేస్తున్న చిత్తశుద్ధిని, సేవను ప్రజలు గుర్తుపెట్టుకోవాలి

5:40 PM, Feb 22nd, 2024

విజయవాడ: 

పవన్‌పై ఆంధ్రప్రదేశ్ ఇంటలెక్చువల్స్ & సిటిజన్స్ ఫోరం (APIC) అధ్యక్షులు పి. విజయబాబు ఫైర్

 • పవన్ కళ్యాణ్ సీజనల్  పొలిటీషియన్ 
 • ఎన్నికలు సమీపిస్తున్నప్పుడైనా వాస్తవాలు తెలుసుకుని‌ మాట్లాడాలి
 • పవన్ వ్యాఖ్యలు రాజకీయాల పై అతని డొల్లతనాన్ని బయటపెట్టాయి
 • పవన్‌కి అసలు అభివృద్ధి అంటే తెలుసా
 • దోచుకుని సింగపూర్‌లో దాచుకోవడమా అభివృద్ధి అంటే..
 • కోవిడ్‌ వచ్చిన రెండేళ్లు మినహాయిస్తే..  జగన్ చేసిన అప్పుల శాతం బేరీజు వేసుకోవాలి
 • మిగులు రెవిన్యూ ఉన్న ఏపీ బాబు అధికారంలోకి వచ్చాక  పతనమైంది
 • ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ స్వయంగా ఆ విషయాన్ని గణాంకాలతో సహా స్పష్టంగా చెప్పింది.
 • సిద్ధం అంటే యుద్ధం అని పవన్ అంటున్నారు
 • ఆయన చేసిన యుద్ధమేంటో గత ఎన్నికల్లో ప్రజాస్వామ్య యుద్ధంలో చూశాం
 • 151 సీట్లు సాధించిన యోధుడైన జగన్‌ను ప్రశ్నించే అర్హత పవన్‌కు ఉందా? 
 • చంద్రబాబు,లోకేష్ గురించి ఏం మాట్లాడాడో పవన్ మర్చిపోయాడా
 • చంద్రబాబు, లోకేష్ ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మాట్లాడిన వీడియోలు యూట్యూబ్ లో ఉన్నాయి ఓసారి చూడు పవన్
 • బటన్ నొక్కుడు కార్యక్రమం అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నావ్
 • కానీ ఆ డబ్బు మార్కెట్ లో సర్క్యులేట్ అవుతోంది.. అది అభివృద్ధి కాదా?
 • చంద్రబాబు హయాంలో కొందరు వ్యక్తులు దోచేసిన డబ్బు సింగపూర్ బ్యాంకుల్లోకి వెళ్లింది.
 • రెండు చోట్ల ఓడిపోయిన పిరికివాడికి జగన్ గురించి మాట్లాడే అర్హత లేదు
 • షర్మిల చేసిన సరిదిద్దుకోలేని చారిత్రక తప్పిదాలను ఆమె తెలుసుకునే రోజు దగ్గర్లోనే ఉంది

5:30 PM, Feb 22nd, 2024

కాకినాడ రూరల్‌లో జనసేనతో పొత్తును వ్యతిరేకిస్తున్న తెలుగు తమ్ముళ్లు

 • పిల్లి అనంతలక్ష్మికే టికెట్‌ ఇవ్వాలని తెలుగు తమ్ముళ్ల డిమాండ్‌
 • టికెట్‌ పిల్లి అనంతలక్ష్మికి ఇవ్వకపోతే జనసేనకు సహకరించమని స్పష్టీకరణ

5:01 PM, Feb 22nd, 2024

సత్తెనపల్లె:

చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది: మంత్రి అంబటి

 • ఓట్లు కొనాల్సిందేనని పవన్‌ మాటలతో అర్థమవుతోంది
 • చంద్రబాబుతో పొత్తు అంటే బీజేపీ జాతీయ నేతలు ఎందుకు తిట్టకుండా ఉంటారు
 • బీజేపీతో పొత్తులో ఉండి చంద్రబాబుతో పొత్తు ఏంటి?
 • రానున్న రోజుల్లో పవన్‌ మరిన్ని చివాట్లు తింటారు
 • ఓట్లు కొనాల్సిందేనని పవన్‌ మాటలతో అర్థమవుతోంది
 • టీడీపీ, జనసేన పార్టీలు గందరగోళంలో ఉన్నాయి
 • ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో తెలీదు
 • ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో కూడా తెలీదు
 • చంద్రబాబు, పవన్‌ రెస్ట్‌ తీసుకోవాల్సిన టైం వచ్చింది
 • పార్టీలు మారిన వ్యక్తులు మాపై పోటీ చేస్తున్నారు
 • ఇద్దరు విశ్వాస ఘాతకులు నాపైనా, అనిల్‌పైనా పోటీ చేస్తున్నారు
 • విశ్వాసఘాతకులను తరిమికొట్టాలని సత్తెనపల్లె ప్రజలను కోరుతున్నా
 • భువనేశ్వరి వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించలేదు
 • కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారని తేలిపోయింది
 • చంద్రబాబు బాటలోనే పవన్‌ నడుస్తున్నాడు
 • చంద్రబాబు, పవన్‌లకు రెస్ట్‌ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధం

4:07 PM, Feb 22nd, 2024

షర్మిలపై ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ధ్వజం

 • షర్మిల.. మీరే అసలైన ఉగ్రవాది, నియంత
 • ఈ రాష్ట్రంలో సీఎం జగన్‌ ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో చర్చకు రండి
 • తెలంగాణలో యువతను రెచ్చగొట్టేటట్లు ఇక్కడ చేయాలని అనుకుంటున్నారు
 • దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి పేరు ఎఫ్‌ఐఆర్‌లో పెట్టిన పార్టీలో చేరిన మీరు ఎలా విమర్శలు చేస్తారు
 • ఈ రాష్ట్రానికి విభజన హామీలు ఇవ్వని పార్టీ కాంగ్రెస్‌ పార్టీ
 • ప్రత్యేక హోదా రాకపోవడానికి కాంగ్రెస్‌ పార్టీయే కారణం
 • జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక రెండు లక్షల పద్నాలుగువేల ఉద్యోగాలు ఏపీలో వచ్చాయి
 • చంద్రబాబు నాయుడు ఇచ్చిన డీఎస్సీలో అభ్యర్థులకు సీఎం జగన్‌ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చింది
 • మీరు చంద్రబాబు స్క్రిప్ట్‌ చదువుతున్నారు
 • దీనికి సాక్ష్యం ఉద్యోగాలు లేవని పదేపదే మీరు చెప్పడం
 • ఒక్క రికమండేషన్ లేకుండా సచివాలయంలో డిగ్రీ ఇంజనీరింగ్ ఎంటెక్ చేసిన యువతకు ఉద్యోగాలు కల్పించారు
 • సచివాలయ ఉద్యోగులను పార్టీ కార్యకర్తల అనడం  షర్మిల అవివేకం

3:28 PM, Feb 22nd, 2024

బీజేపీ హైకమాండ్ పిలుపు కోసం పవన్ ఎదురుచూపులు 

 • నిన్న అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందంటూ ప్రచారం
 • నిన్న భీమవరం పర్యటన అర్థాంతరంగా ముగించిన పవన్‌
 • ఇవాళ ఢిల్లీ వెళతారంటున్న జనసేన వర్గాలు

3:22 PM, Feb 22nd, 2024

విజయవాడలో తెలుగుదేశం - జనసేన సమన్వయ కమిటీ సమావేశం

 • భేటీలో పాల్గొన్న ఇరుపార్టీల సమన్వయ కమిటీ సభ్యులు 
 • ఒక్క భారీ సభ లేదు, జనం మరిచిపోతున్నారని ఆందోళన
 • ఈ నెల 28న ఒక సభ పెడితే ఎలా ఉంటుందన్న దానిపై చర్చ
 • ఉమ్మడి సభకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ వస్తే జనం వస్తారా?
 • ఎంత మందిని రప్పిస్తే జనం దృష్టిలో పడతాం?
 • ఎంత భారీగా వస్తే పోటీలోకొస్తాం?
 • అసలు జనానికి ఏమని చెప్పాలి? ఎలా ఒప్పించాలి?
 • ఇంకా పొత్తులు కూడా ఖరారు కాని చోట అభ్యర్థులని ఎవరిని చూపించాలి?

3:00 PM, Feb 22nd, 2024

ఎన్టీఆర్ జిల్లా: 
పవన్ మాటలకు, చేతలకు పొంతన లేదు : వెల్లంపల్లి

 • దీర్ఘకాలిక రాజకీయానికి పవన్ పనికిరారు
 • పవన్ ను రాష్ట్రంలోని ప్రజలెవరూ నమ్మరు
 • చంద్రబాబును సీఎంను చేయడానికే జనసేన ఉంది
 • టీడీపీలో జనసేనను విలీనం చేస్తే సరిపోతుంది

2:50 PM, Feb 22nd, 2024

తాడేపల్లి: 
పవన్ కళ్యాణ్ పూర్తిగా దిగజారిపోయాడు
కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు

 • ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా అధికారంలోకి రావాలనేది చంద్రబాబు ఆలోచన
 • ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అవే మాటలు మాట్లాడుతున్నారు
 • పూర్తిగా రూపాంతరం చెంది జన సైనికులను త్యాగాలకు సిద్ధం కావాలంటున్నారు
 • పార్టీ అధినేతను అని మర్చిపోయాడు
 • పవన్ నీచ రాజకీయాలను గమనించాలి
 • భీమవరంలో పవన్ కళ్యాణ్ ఎవరిని కలిసాడో జన సైనికులు ఆలోచించాలి
 • టీడీపీ నాయకుల ఇళ్లకు వెళ్లి మరీ పవన్ కలిశాడు
 • జనసేన, కాపు నాయకుల ఇళ్లకు పవన్ ఎప్పుడైనా వెళ్ళారా
 • కాపులకు రాజ్యాధికారం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారనే చంద్రబాబు రంగాను అంతమొందించారు
 • పవన్ జనసేనను మర్చిపోయి సీనియర్ టీడీపీ నాయకుడిలా ప్రవర్తిస్తున్నారు
 • ఢిల్లీ వెళ్లి చీవాట్లు తిన్నానని చెప్పుకుంటున్నారు
 • పవన్ అసలు ఢిల్లీ వెళ్లి ఎవరిని కలిశాడు, ఎవరికోసం కలిశాడు
 • కాపులను ఉద్ధరించడానికి, జనసైనికులను ఎమ్మెల్యేలుగా చేయడానికి వెళ్లాడా?
 • పాతవాళ్లు పోతారు.. కొత్తవాళ్లు వస్తారని పవన్ చెప్తున్నారు
 • టీడీపీ నేతలను చేర్చుకోవడానికి పవన్ సిద్ధమయ్యారు
 • కాపులు తనకి ఓటు వేయరని, తనను నమ్మరని పవన్ ముందే చెప్పారు
 • పవన్ జనసేనను టీడీపీలో విలీనం చేస్తారనే అనుమానం కలుగుతోంది
 • పవన్ తెలుగుదేశం తొత్తు
 • పేదల రక్తాన్ని పీల్చేసిన వ్యక్తి చంద్రబాబు
 • ప్రజాసొమ్మును పెత్తందార్లకు దోచిన వ్యక్తి చంద్రబాబు
 • రాబోయే కురుక్షేత్రంలో కాపులంతా టీడీపీని భూస్థాపితం చేయాలి

2:35 PM, Feb 22nd, 2024

విజయవాడ: స్కిల్‌ స్కామ్‌ కేసు విచారణ వాయిదా

 • ఈనెల 27కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
 • అప్రూవర్‌గా అనుమతించాలని ఇప్పటికే ఏసీఐ ఎండీ చంద్రకాంత్‌ పిటిషన్‌
 • చంద్రకాంత్‌ జత చేసిన డాక్యుమెంట్లు ఇవ్వాలంటూ  ఏ-2 నిందితుడు మాజీ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణ పిటిషన్‌
 • లక్ష్మీ నారాయణకు డాక్యుమెంట్స్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని సీఐడీ వాదనలు
 • తదుపరి విచారణ ఈ నెల 27కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు

1:15 PM, Feb 22nd, 2024
చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు: కేశినేని నాని

 • దేశంలో వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుంది
 • ప్రతీ 50 కుటుంబాలకు సేవ చేసే వ్యక్తి వాలంటీర్
 • ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది. కానీ వాలంటీర్లకు గౌరవం అదనం
 • ఒక తాత్కాలిక సచివాలయం చంద్రబాబు కడితే.. 
 • సీఎం జగన్‌ పాలనలో 11వేల వార్డ్ సచివాలయాల నిర్మాణం పూర్తి దశకు చేరుకుంది. 
 • పేద ప్రజల ఆర్థిక స్థితి మెరుగు పరచిన వ్యక్తి సీఎం జగన్
 • కరోనా కష్టకాలంలో కూడా పథకాలను జగన్ ప్రభుత్వం అమలుపరిచింది. 
 • అంబేడ్కర్‌పై ఉన్న గౌరవానికి సూచనగా స్మృతివనం ఏర్పాటు చేశారు
 • చంద్రబాబుకు ఇవే ఆఖరి ఎన్నికలు

1:00 PM, Feb 22nd, 2024
చంద్రబాబుకు దేవినేని అవినాష్‌ కౌంటర్‌

 • వాలంటీర్లను సంచీలు మోసేవాళ్ల అని చంద్రబాబు విమర్శించారు. 
 • వాలంటీర్ వ్యవస్థ అంటే ముఖ్యమంత్రి జగన్ సైన్యం
 • ప్రభుత్వ వ్యవస్థలో వాలంటీర్ కూడా భాగమే
 • ప్రభుత్వ పథకాలను ప్రజలు ఇంటివద్దకే అందిస్తున్నారు వాలంటీర్లు.
 • కరోనా సమయంలో వాలంటీర్లు ఫ్రంట్‌ లైన్‌ వార్నియర్స్‌గా పనిచేశారు
 • లబ్ధిదారులను కుటుంబ సభ్యులు పలకరించకపోయినా వాలంటీర్లు వారి క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారు
 • గ్రాఫిక్స్ రాజకీయాలకు టీడీపీ నాయకులు బ్రాండ్ అంబాసిడర్లు 

12:45 PM, Feb 22nd, 2024
బీజేపీ, పవన్‌కు కొడాలి నాని కౌంటర్‌

 • పవన్ యుద్ధం కామెంట్స్‌కు మంత్రి కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
 • పవన్ కళ్యాణ్ ఎక్కడ యుద్ధం చేస్తాడు 
 • చంద్రబాబు ఎక్కడ యుద్ధం చేస్తాడు 
 • బీజేపీ ఎక్కడ యుద్ధం చేస్తుంది 
 • అందరూ కలిసి యుద్ధం చేస్తారా?.
 • ఎవరు ఎవరితో యుద్ధం చేస్తారు
 • ఎవరు ఎక్కడ యుద్ధానికి రెడీనో కనీసం వాళ్లకైనా క్లారిటీ ఉందా?.
 • పవన్ ఎక్కడ యుద్ధం చేయబోతున్నాడు .. ఎన్ని చోట్ల యుద్ధం చేస్తాడు. 
 • చంద్రబాబు ఎక్కడ యుద్ధం చేయబోతున్నాడు.. ఎన్ని చోట్ల చేస్తాడు. 
 • బీజేపీ వీళ్లతో కలిసే యుద్ధం చేయబోతుందా? విడిగా చేస్తుందా?.
 • టీడీపీ, జనసేనలో టిక్కెట్లు ఆశించేవారికైనా తెలుసా 
 • ఎక్కడ, ఎన్ని సీట్లలో పోటీచేస్తారో ముందు క్లారిటీ తెచ్చుకోండి 
 • తర్వాత యుద్ధం..సై.. అనండి 
 • ఫ్లెక్సీల పక్కన ఫ్లెక్సీలు పెడితే అది యుద్ధం అవ్వదు.. కామెడీ పోస్ట్ అవుతుంది
   

12:30 PM, Feb 22nd, 2024
రాజకీయాల్లో పవన్‌ ఓ అనైతిక రాజకీయవేత్త: మంత్రి అంబటి

 • ఎన్నికల సమయంలో పొత్తులపై బీజేపీ నాయకత్వంతో చీవాట్లు తిన్నానన్న పవన్‌
 • పవన్‌కు మంత్రి అంబటి కౌంటర్‌
 • పవన్‌ కల్యాణ్‌ మాటలు చిత్రంగా, ఆశ్చర్యకంగా ఉన్నాయి. 
 • పవన్‌ లాంటి అనైతిక రాజకీయవేత్త ఈ రాష్ట్రంలోనే లేడు. 
 • ఒక పార్టీతో పొత్తులో ఉండి మరో పార్టీతో రాజకీయం చేస్తున్నాడు. 
 • ఓట్లు కొనుక్కోకూడదని చెగువేరాలాగా పవన్‌ కాకమ్మ కథలు చెప్పాడు. 
 • మళ్లీ మాట మార్చి ఓట్లు కొనుక్కోమంటూ తన కేడర్‌కు పవన్‌ లైసెన్స్‌ ఇచ్చాడు

12:15 PM, Feb 22nd, 2024
టీడీపీ సీటు విషయంలో గంటా గరం గరం..

 • సీటుపై గంటా శ్రీనివాస్ గరం గరం
 • నాకు విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని ఉంది
 • నేను విశాఖ నార్త్‌ నుండి పోటీ చేయడం లేదు
 • విశాఖ నార్త్‌లో వేరే ఇన్‌ఛార్జ్‌ను పెట్టమన్నాను. 
 • నన్ను చీపురుపల్లి వెళ్లమని పార్టీ చెప్పింది
 • కానీ చీపురుపల్లిపై నేను నిర్ణయం తీసుకోలేదు
 • నేనైతే ఈ జిల్లాలోనే పోటీ చేయాలని అనుకుంటున్నాను
 • నన్ను ఈ జిల్లా నుండి పంపేద్దాం అనుకుంటున్నారా?
 • పార్టీ నాయకులకు నా అభిప్రాయాలు చెప్తాను
 • ఇంకా టీడీపీ, జనసేన సీట్ల లెక్క తేలలేదు
 • కేవలం నాలుగు సీట్లపై మాత్రమే స్పష్టత వచ్చింది
 • నేను ప్రతీ ఎన్నికల్లోనూ నియోజకవర్గం మారుతున్నా
 • కానీ విశాఖ జిల్లాలోనే పోటీ చేస్తున్నాను
 • ఇప్పుడు కూడా విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని ఉంది

11:50 AM, Feb 22nd, 2024
టీడీపీకి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కౌంటర్‌

 • ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహనశీలి
 • ఏపీలోని వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు ప్రజాస్వామిక వాదులు
 • దుష్టచతుష్టయం ఎన్ని తప్పుడు వార్తలు రాసినా సీఎం జగన్ ఎంతో ఓర్పుతో ఉన్నారు
 • ఎల్లో మీడియా పదేపదే రెచ్చగొట్టినా సహనం పాటిస్తున్నారు
 • ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5లను వైఎస్సార్‌సీపీ బహిష్కరించింది
 • ఆహ్వానం లేకపోయినా ఎల్లో మీడియా ప్రతినిధులు వైఎస్సార్‌సీపీ సభలకు ఎందుకు వస్తున్నారు?.
 • రామోజీ, రాధాకృష్ణ.. చంద్రబాబు నాయుడు తొత్తులే
 • ప్రతిపక్షాలు, మీడియా సంస్థలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి 
 • వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు ఎల్లో మీడియా బాధ్యత వహిస్తుందా?
 • కుప్పంలో చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వాలన్న భువనేశ్వరి వ్యాఖ్యలను ప్రజలు నిశితంగా గమనించాలి
 • ఓటమి భయంతోనే చంద్రబాబు కుప్పం నుంచి తప్పుకుంటున్నారు
 • భువనేశ్వరి వ్యాఖ్యల వెనుక నందమూరి ఫ్యామిలీ ఉద్దేశాలు కూడా ఉండొచ్చు
 • రాజ్యసభలో టీడీపీ జీరో అయ్యింది
 • త్వరలోనే అసెంబ్లీలో కూడా తెలుగుదేశం పార్టీ జీరో అవుతుంది
   

11:30 AM, Feb 22nd, 2024
పొత్తులపై పురంధేశ్వరి కామెంట్స్‌..

 • పొత్తులపై పార్టీ అధిష్టానం చూసుకుంటుంది.
 • ఎన్ని సీట్లల్లో పోటీ చేస్తామనేది కూడా హైకమాండే నిర్ణయిస్తుంది.
 • పార్టీ బలోపేతంపైనే మేం ఫోకస్ పెట్టాం.
 • కార్యకర్తలు ఉత్సాహంగా పని చేస్తున్నారు.
 • బీజేపీ ప్రజా సేవకు అంకితమైన పార్టీ.
 • ప్రజా సేవ చేసి.. అధికారంలోకి రావాలనేది బీజేపీ ఉద్దేశ్యం.
 • రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం.
 • వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు వస్తాయి.
 • 370 అనేది బీజేపీకి నంబర్ కాదు.. సెంటిమెంట్.

11:10 AM, Feb 22nd, 2024
కాంగ్రెస్‌పై విజయసాయిరెడ్డి సెటైర్లు..

 • ​కాంగ్రెస్‌కు ఎంపీ విజయసాయిరెడ్డి స్ట్రాంగ్‌ కౌంటర్‌
 • కాంగ్రెస్ పార్టీలో నాయకుల కొరత బాగా ఉంది
 • రేపు రాహుల్ గాంధీ కూడా బీజేపీలో చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు
 • కాంగ్రెస్ తన పునాదిని, అగ్రనేతలను కూడా కోల్పోయింది
 • ఏపీకి కాంగ్రెస్ చేసిన ద్రోహం వల్లే దేశమంతటా ఈ పరిస్థితి ఏర్పడింది

10:00 AM, Feb 22nd, 2024
టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు చుక్కలు చూపించిన ప్రజలు..

 • టీడీపీ నేతలను నిలదీసిన ప్రజలు
 • అనంత మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరికి చేదు అనుభవం
 • ఇంటింటికి వెళ్లిన ప్రభాకర్‌ నిలదీసిన ప్రజలు
 • ఇంతకుముందు ప్రభాకర్‌ను చూడలేదన్న ఓ మహిళ
 • సదరు మహిళ మాటలకు అసహనం వ్యక్తం చేసిన ప్రభాకర్‌
 • ప్రతీరోజూ మీ ఏరియాకు రాలేనంటూ ప్రభాకర్‌ కామెంట్స్‌

9:30 AM, Feb 22nd, 2024
చంద్రబాబుకు మంత్రి రోజా కౌంటర్‌..

 • కుప్పంలో చంద్రబాబు అవుట్‌
 • కుప్పంలో భువనేశ్వరి మాటల వెనుక అర్థం అదే..
 • మేము ఇన్ని రోజులు చెప్పిన మాటనే నేడు ఆమె బయటపెట్టారు.
 • కుప్పంలో కూడా చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదు. 

8:40 AM, Feb 22nd, 2024
కుప్పంలో మారుతున్న పొలిటికల్‌ సమీకరణాలు..

 • కుప్పంలో రోజురోజుకు మారుతున్న రాజకీయ సమీకరణాలు
 • కుప్పంలో పోటీకి భయపడుతున్న చంద్రబాబు
 • కృష్ణా జిల్లా పెనుమలూరు స్థానంపై దృష్టి పెట్టిన చంద్రబాబు 
 • కుప్పంపై పట్టుకొల్పోతున్న టీడీపీ, ఇప్పటికే నాలుగు మండలాలు, కుప్పం మున్సిపాలిటీ వైఎస్సార్ కాంగ్రెస్ వశం
 • కుప్పం నియోజకవర్గంలో సర్పంచ్ లు, ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గెలుపు
 • కుప్పం సర్వేల్లో చంద్రబాబుకు వ్యతిరేక పవనాలు
 • నారా భువనేశ్వరి వాఖ్యలపై స్పందించని టీడీపీ, అయోమయంలో తెలుగు తమ్ముళ్లు
   

7:45 AM, Feb 22nd, 2024
కుప్పం నుంచి చంద్రబాబు యూటర్న్‌.. 

 • కుప్పం నుండి చంద్రబాబు పరార్‌పై రాజకీయ కలకలం
 • వైఎస్సార్‌సీపీ సవాల్‌ను స్వీకరించలేక చేతులెత్తేసిన చంద్రబాబు
 • 35 ఏళ్లుగా మోసపూరిత మాటలతో చంద్రబాబు రాజకీయం
 • అభివృద్ధి మంత్రంతో కుప్పం ప్రజలను అక్కున చేర్చుకున్న ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం
 • 20వేల మందికి ఇళ్ల పట్టాలు, ఇప్పటికే 10 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి
 • కుప్పాన్ని మున్సిపాలిటీగా, రెవిన్యూ డివిజన్ కేంద్రంగా చేసిన సీఎం జగన్‌
 • హంద్రీనీవా నుండి తాగునీరు ఏర్పాటు
 • దీంతో ఓటమిని ముందే గ్రహించి పోటీ నుండి తప్పుకున్న చంద్రబాబు. 

7:30 AM, Feb 22nd, 2024
పవన్, చంద్రబాబుకు కొడాలి నాని కౌంటర్‌

 • పవన్, చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్‌
 • మేం సిద్ధం అంటుంటే పవన్ కళ్యాణ్ కూడా సిద్ధం అంటున్నాడు. 
 • సీఎం జగన్‌ 175 స్థానాల్లో అభ్యర్ధుల్ని పెట్టి సిద్ధం అంటున్నారు.. మీరు దేనికి సిద్ధం 
 • మా ఫ్లెక్సీల పక్కన ఫ్లెక్సీలు పెట్టడానికి మీరు సిద్ధమా?
 • 175 మంది అభ్యర్థులను పెట్టరా.. ఫ్లెక్సీలే పెడతారా?
 • మాపై మీ అభ్యర్ధుల్ని నిలబెట్టి సిద్ధం అంటే బాగుంటుంది అంటూ కౌంటర్‌

7:15 AM, Feb 22nd, 2024
చంద్రబాబుకు షాకిచ్చిన టీడీపీ నేతలు

 • నూజివీడులో చంద్రబాబు ఫ్లెక్సీలు తొలగింపు
 • నూజివీడులోని టీడీపీ ఆఫీసులో ఫ్లెక్సీలు తొలగించిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు
 • టీడీపీ నేతల తీరుతో చంద్రబాబుకు షాక్‌

6:45 AM, Feb 22nd, 2024
నేడు విజయవాడలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం

 • సమావేశంలో పాల్గొననున్న టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సభ్యులు
 • క్షేత్రస్థాయిలో సమన్వయం, ఉమ్మడి కార్యాచరణ పై చర్చ
 • సమావేశంలో మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై చర్చ
 • వివిధ జిల్లాల్లో ప్రచార వ్యూహాల రూట్ మ్యాప్ పై చర్చ
 • టీడీపీ కమిటీ సభ్యులుగా అచ్చెన్నాయుడు, యనమల, పితాని, పయ్యావుల, నిమ్మల, తంగిరాల సౌమ్య జనసేన కమిటీ సభ్యులుగా నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, గోవిందరావు, నాయకర్, యశస్విని

6:35 AM, Feb 22nd, 2024
నేడు ఏసీబీ కోర్టులో స్కిల్ స్కాం కేసు విచారణ

 • స్కిల్ స్కాం నిందితుడు, మాజీ ఎండీ లక్ష్మీనారాయణ పిటిషన్‌పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు
 • స్కిల్ స్కాంలో అప్రూవర్‌గా మారడానికి అనుమతించాల‌ని ఏసీఐ ఎండి చంద్రకాంత్ షా పిటిషన్
 • చంద్రకాంత్ షా పిటిషన్‌లో జత చేసిన డాక్యుమెంట్లు తనకి అందజేయాలని లక్ష్మీనారాయణ పిటిషన్
 • స్కిల్ కేసులో తాను కూడా ముద్దాయిగా ఉన్నందున చంద్రకాంత్ షా వేసిన పిటీషన్‌లోని డాక్యుమెంట్స్ ఇవ్వాలని వాదించిన లక్ష్మీనారాయణ తరపు న్యాయవాదులు
 • విచారణ నేటికి వాయిదా
 • నేడు ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించనున్న సీఐడీ తరపు న్యాయవాదులు

6:30 AM, Feb 22nd, 2024
భువనేశ్వరి మాటలతో క్లారిటీ వచ్చేసింది: మంత్రి అంబటి రాంబాబు

 • భువనేశ్వరి, లోకేష్ ఇద్దరు కలిసి కుర్చీలు మడత పెడుతున్నారు
 • రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ కుర్చీ మడత పెట్టేశారు
 • భువనేశ్వరి చంద్రబాబు నాయుడుని రెస్ట్ తీసుకోమని చెప్తోంది
 • కుప్పంలో చంద్రబాబుకి రెస్ట్ ఇవ్వండి అని కార్యకర్తలకు చెప్తుంది
 • కుప్పంలో చంద్రబాబు నాయుడు కుర్చీ కూడా మడత పెట్టేశారని అర్ధమౌతుంది.
 • భువనేశ్వరి చంద్రబాబు పెద్దవాడైపోయాడు ఆయన రెస్ట్ తీసుకుంటాడు నేను పోటీ చేస్తానని చెప్తోంది
 • చంద్రబాబు, లోకేష్‌కు రెస్ట్ ఇచ్చి ఎన్టీఆర్ కుమార్తె కుప్పంలో పోటీ చేసినా... కుప్పంలో ఓడిపోవడం ఖాయం
 • చంద్రబాబు కుప్పంలో సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసిన కుప్పంలో నీళ్లు ఇవ్వలేకపోయాడు
 • వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో త్వరలో కుప్పంలో నీళ్లు ఇవ్వబోతున్నాం
 • రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు
 • అనిల్‌ కుమార్ యాదవ్ వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి
 • చంద్రబాబు తెలుగుదేశాన్ని మూసేసే పరిస్థితి దగ్గర్లో ఉందని ప్రజలకు అర్థమైంది
 • భువనేశ్వరి మాట్లాడిన మాటలతో క్లారిటీ వచ్చింది
 • చంద్రబాబుకు ఏజ్ అయిపోయింది టైం అయిపోయింది ఆయన కొడుకుని చూస్తే ఎందుకు పనికిరాడు
 • అందుకే కనీసం కుప్పంలో నన్ను అన్న గెలిపించండి అని  టీడీపీ కార్యకర్తలను భువనేశ్వరి బతిమిలాడుకుంటుంది

6:25 AM, Feb 22nd, 2024
ఓటుకు నోటు: పవన్‌ కళ్యాణ్‌ పరమార్థమిదే

 • భీమవరం కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్
 • డబ్బులు పంచితే గానీ నెగ్గలేమట.!
 • డబ్బులు ఖర్చు పెడితేనే రాజకీయాలట.!
 • ఎన్నికలప్పుడు మాత్రమే ఏపీకి వస్తే తప్పు కాదా?
 • ప్యాకేజీ పాలిటిక్స్‌ చేస్తే ప్రజలెలా పట్టించుకుంటారు?భీమవరంలో పవన్‌ కళ్యాణ్‌ నోటి వెంట కొత్త మాటలు వచ్చాయి
 • ఎన్నికల వేళ జనసేన, టిడిపి నేతలను ఆశ్చర్యచకితులను చేసే వ్యాఖ్యలు
 • తమను చూసి ఎవరూ ఓటు వేయరన్న ఉద్దేశ్యంలో మాట్లాడిన పవన్‌ కళ్యాణ్‌
 • రాజకీయాలంటే డబ్బు ఖర్చు పెట్టడమేనంటూ ఓటరు విలువను దిగజార్చారు
 • ఎన్నికల సంఘం ఆదర్శాలను అపహస్యం చేసేలా తన బాసు చంద్రబాబు అనుసరిస్తోన్న ఓటుకు నోటు సిద్ధాంతాన్ని గుర్తు చేశారు

Advertisement
 
Advertisement