TS: అమిత్‌ షా దిశానిర్దేశం.. ఎన్నికలపై బీజేపీ మాస్టర్‌ ప్లాన్‌ | Amit Shah Direction To BJP Leaders On Telangana Election Activities - Sakshi
Sakshi News home page

TS: అమిత్‌ షా దిశానిర్దేశం.. ఎన్నికలపై బీజేపీ మాస్టర్‌ ప్లాన్‌

Aug 27 2023 7:02 PM | Updated on Aug 29 2023 6:27 PM

Amit Shah Direction To Bjp Leaders On Telangana Election Activities - Sakshi

ఖమ్మం నుంచి ఎన్నికల శంఖారావం పూరించిన బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. అసెంబ్లీ ఎన్నికల కార్యాచరణపై తెలంగాణ నేతలకు దిశానిర్దేశం చేశారు.

సాక్షి, ఖమ్మం​: ఖమ్మం నుంచి ఎన్నికల శంఖారావం పూరించిన బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. అసెంబ్లీ ఎన్నికల కార్యాచరణపై తెలంగాణ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఖమ్మంలో ‘రైతు గోస–బీజేపీ భరోసా’ బహిరంగ సభ అనంతరం బీజేపీ రాష్ట్రస్థాయి కోర్‌ కమిటీ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో సబ్బండ వర్గాలను ఆకట్టుకునేలా బీజేపీ మాస్టర్‌ ప్లాన్‌ వేసినట్లు సమాచారం.

బీజేపీ కేంద్రీకరించి పనిచేస్తున్న ఎమ్మెల్యే, ఎంపీలు స్థానాలు ఎన్ని.. ఏ జిల్లాలో గెలుస్తాం.. ఏ నియోజకవర్గంలో రెండో స్థానంలో​ ఉంటాం.. అంటూ అమిత్‌ షా పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గెలుపు కోసం అధిష్టానం నుంచి కావాల్సిన సహకారంపై ఫుల్‌ క్లారిటీ ఇచ్చిన అమిత్‌ షా.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే దిశగా పనిచేయాలని నేతలకు అమిత్‌ షా సూచించారు.

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అసంతృప్త నేతలను బీజేపీలోకి ఆహ్వానించడం.. మజ్లిస్‌, బీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్‌ రాజకీయ ఎత్తుగడలు.. బీఆర్‌ఎస్‌ అవినీతి, అక్రమాలపై దృష్టి పెట్టాలని అమిత్‌ షా సూచించారు. నేతల మధ్య ఆధిపత్య పోరు.. గ్రూపులు ఉండొద్దన్న అమిత్‌ షా.. ఐక్యంగా పనిచేయాలని హితవు పలికారు.
చదవండి: కేసీఆర్‌ సర్కార్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది: అమిత్‌ షా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement