
2014 ఎన్నికలు రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు. పరిస్థితి అంత అనుకూలంగా లేదని తెలుసుకున్న చంద్రబాబు వెంటనే పొత్తుల పంథాను అనుసరించారు. ఇక్కడ పవన్ కళ్యాణ్‌ను, అక్కడ బీజేపీ వెంట పడి పొత్తులు కలిపేసుకున్నారు. ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి 102 స్థానాలు దక్కగా, వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు 67 స్థానాలు వచ్చాయి. బీజేపీకి నాలుగు స్థానాలు, ఇద్దరు స్వతంత్రులు గెలిపారు. సామాజికవర్గాల వారీగా చూస్తే రెడ్డి నేతలు 40 మంది గెలుపొందగా, కమ్మవర్గం వారు ముప్పై ఒక్క మంది విజయం సాదించారు. కాపు సామాజికవర్గం నేతలు ఇరవై మంది, బీసీలు ముప్పై రెండు మంది నెగ్గారు. ముస్లీంలు నలుగురు, ఇతర వర్గాల వారు పది మంది ఉన్నారు. రెడ్డి ఎమ్మెల్యేలు అత్యధికంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పక్షాన ముప్పై ఒక్క మంది విజయం సాదించారు.
టీడీపీ తరపున తొమ్మిది మంది గెలిచారు. కమ్మ సామాజికవర్గ నేతలు అత్యధికంగా ఇరవై ఎనిమిది మంది టీడీపీ తరపున గెలిస్తే, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పక్షాన ముగ్గురే గెలిచారు. కాగా కాపులలో పద్నాలుగు మంది టీడీపీ, ముగ్గురు వైసిపి, ఇద్దరు బిజేపి, ఇండిపెండెంటుగా ఒకరు గెలిచారు. వెనుకబడిన తరగతులలో ఇరవై ఎనిమిది మంది టీడీపీ నుంచి నలుగురు వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి గెలిచారు.
ఎస్సీలలో పదహారు మంది టీడీపీ, పదమూడు మంది వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యారు. గిరిజనులలో ఒకరు మాత్రమే టీడీపీ నుంచి గెలవగా, మిగిలిన ఆరుగురు వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యారు. ముస్లీంలు నలుగురు వైసిపివారే కావడం విశేషం.ఐదుగురు క్షత్రియ సామాజికవర్గం నుంచి శాసనసభకు ఎన్నిక కాగా ముగ్గురు టీడీపీ, కరు బీజేపీ, మరొకరు స్వతంత్రుడిగా గెలుపొందారు. ఇద్దరు వైశ్యులు టీడీపీ పక్షాన నెగ్గారు. ఇద్దరు వెలమ నేతలు వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి విజయం సాదించారు. ఒక బ్రాహ్మణ నేత వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యారు.
బీసీ వర్గాలలో ఆయా సామాజికవర్గాలు
రెడ్డి నేతలు - శాసనసభకు మొత్తం నలభై మంది రెడ్డి నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.వారిలో తెలుగుదేశం కు చెందినవారు తొమ్మిది మంది అయితే, వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు చెందినవారు ముప్పై ఒక్క మంది ఉన్నారు. వైసిపి ఎమ్మెల్యేలలో ఏడుగురుపార్టీ ఫిరాయించారు.టీడీపీ నుంచి ఎన్నికైన రెడ్డిఎమ్మెల్యేలలో ముగ్గురు కోస్తా నుంచి ఆరుగురు రాయలసీమ నుంచి గెలుపొందారు.వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో పది మంది కోస్తా నుంచి గెలుపొందగా, ఇరవై ఒక్క మంది రాయలసీమ నుంచి ఎన్నికయ్యారు.
తెలుగుదేశం పార్టీ..9
- ఎన్.రామకృష్ణారెడ్డి-అనపర్తి
- ఎమ్.వేణుగోపాలరెడ్డి-గుంటూరు పశ్చిమ
- పి.శ్రీనివాసరెడ్డి-కోవూరు
- ఎమ్ మల్లిఖార్జున రెడ్డి రాజంపేట
- బి.సి. జనార్దనరెడ్డి- బనగానపల్లె
- జయనాగేశ్వరరెడ్డి-ఎమ్మిగనూరు
- జెసి ప్రభాకరరెడ్డి-తాడిపత్రి
- పి.రఘునాదరెడ్డి-పుట్టపర్తి
- బి.గోపాలకకృష్ణారెడ్డి-శ్రీకాళహస్తి.
వైఎస్ ఆర్ కాంగ్రెస్ ..31
- సి.జగ్గారెడ్డి-కొత్తపేట,
- ఎ.రామకకృష్ణారెడ్డి-మంగళగిరి,
- జి.శ్రీనివాసరెడ్డి-నరసరావుపేట,
- పి.రామకృష్ణారెడ్డి-మాచర్ల,
- జె.వెంకటరెడ్డి-మార్కాపురం,
- అశోక్ రెడ్డి-గిద్దలూరు,
- ఆర్.ప్రతాప్ కుమార్ రెడ్డి-కావలి,
- ఎమ్.గౌతం రెడ్డి-ఆత్మకూరు,
- కె.శ్రీధర్ రెడ్డి-నెల్లూరు రూరల్,
- కె.గోవర్దనరెడ్డి-సర్వేపల్లి,
- జి.శ్రీకాంత రెడ్డి-రాయచోటి,
- వైఎస్ .జగన్మోహన్ రెడ్డి-పులివెందుల,
- పి.రవీంద్రనాద్ రెడ్డి-కమలాపురం,
- ఆదిఆనారాయణరెడ్డి-జమ్మలమడుగు,
- ఆర్.శివప్రసాదరెడ్డి-ప్రొద్దుటూరు,
- రఘురామిరెడ్డి-మైదుకూరు,
- భూమా శోభానాగిరెడ్డి(పోలింగ్ కు ముందే మరఠణించారు) ఆళ్లగడ్డ,
- భి.రాజశేఖరరెడ్డి-శ్రీశైలం,
- ఎస్.వి.మోహన్ రెడ్డి-కర్నూలు,
- గౌరు చరిత-పాణ్యం,
- బి.నాగిరెడ్డి-నంద్యాల (2017లో మరణించారు),
- బి.రాజేంద్రనాద్ రెడ్డి- డోన్,
- బాలనాగిరెడ్డి-మంత్రాలయం,
- సాయిప్రసాదరెడ్డి-ఆదోని,
- విశ్వేశ్వర్ రెడ్డి-ఉరవకొండ,
- సి.రామచంద్రారెడ్డి-పీలేరు,
- దేశాయ్ తిప్పారెడ్డి-మదనపల్లె,
- పి.రామచంద్రారెడ్డి-పుంగనూరు,
- సి.భాస్కరరెడ్డి-చంద్రగిరి,
- ఆర్.కె. రోజా-నగరి,
- అమరనాథ్ రెడ్డి-పలమనేరు.
ఉప ఎన్నికలు:
- ఆళ్లగడ్డ-భూమ అఖిలప్రియ- వైఎస్‌ఆర్ కాంగ్రెస్
- నంద్యాల-భూమా బ్రహ్మానందరెడ్డి -టీడీపీ
వైసిపి నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు-7
- అశోక్ రెడ్డి-గిద్దలూరు
- ఆదినారాయణరెడ్డి-జమ్మలమడుగు
- బి.రాజశేఖరరెడ్డి-శ్రీశైలం
- భూమా అఖిలప్రియ-ఆళ్లగడ్డ
- భూమా నాగిరెడ్డి-నంద్యాల(మరణించారు)
- ఎస్.వీ.మోహన్ రెడ్డి-కర్నూలు
- అమరనాదరెడ్డి-పలమనేరు.
వీరిలో అఖిలప్రియ, ఆదినారాయణరెడ్డి, అమరనాదరెడ్డిలు మంత్రులు అవడం కూడా విశేషం.
కమ్మ ఎమ్మెల్యేలు..33
ఏపీలో కమ్మ నేతలు మొత్తం ముప్పై మూడు మంది గెలిచారు. వారిలో తెలుగుదేశం పార్టీ నుంచి ఇరవై తొమ్మిది మంది, ముగ్గురు వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి , ఒకరు బీజేపీ నుంచి గెలుపొందారు. టీడీపీ నుంచి గెలిచిన కమ్మ నేతలలో ఇరవై రెండు మంది కోస్తా జిల్లాల నుంచి ఎన్నిక కాగా, ఏడుగురు రాయలసీమ నుంచి గెలుపొందారు.వైసిపి నుంచి గెలిచినవారిలో ముగ్గురు కోస్తావారే. వైసిపి నుంచి గెలిచినవారిలో ఇద్దరు పార్టీ ఫిరాయించారు.
కమ్మ టీడీపీ ఎమ్మెల్యేలు- 29
- వి.రామకృష్ణబాబు - విశాఖ తూర్పు
- పీ.వెంకటేష్-రాజానగరం
- జీ.బుచ్చయ్య చౌదరి - రాజమండ్రి రూరల్
- వి.జోగేశ్వరరావు
- బి.శేషారావు-నిడదవోలు
- ఏ.రాదాకృష్ణ - తణుకు
- జీ.వీరాంజనేయులు - ఉంగుటూరు
- సీ.ప్రభాకర్-దెందులూరు
- వల్లభనేని వంశి - గన్నవరం
- బోడె ప్రసాద్ -పెనమలూరు
- గద్దె రామ్మోహన్ -విజయవాడ తూర్పు
- దేవినేని ఉమామహేశ్వరరావు-మైలవరం
- కె.శ్రీధర్-పెదకూరపాడు
- డి.నరేంద్ర-పొన్నూరు
ఎ.రాజేంద్రప్రసాద్-తెనాలి, పి.పుల్లారావు - చిలకలూరిపేట, కోడెల శివప్రసాదరావు - సత్తనపల్లి, జీవీ ఆంజనేయులు-వినుకొండ, వై.శ్రీనివాసరావు - పిడుగురాళ్ల, వై.సాంబశివరావు-పర్చూరు, డి.జనార్దన్-ఒంగోలు, బి.రామారావు-ఉదయగిరి, వి.ప్రభాకర చౌదరి-అనంతపురం, పరిటాల సునీత - రాప్తాడు, నందమూరి బాలకృష్ణ-హిందూపూర్, జి.సూర్యనారాయణ-దర్మవరం, వి.హనుమంతరావయ చౌదరి-కళ్యాణ దుర్గం, కె.రామకృస్ణ-వెంకటగిరి, ఎన్.చంద్రబాబు నాయుడు-కుప్పం.
కమ్మ బీజేపీ ఎమ్మెల్యే-1
- కామినేని శ్రీనివాస్-కైకలూరు
- వైఎస్ ఆర్ కాంగ్రెస్ కమ్మ ఎమ్మెల్యేలు-3
- కొడాలి వెంకటేశ్వరరావు( నాని)-గుడివాడ
- గొట్టిపాటి రవికుమార్-అద్దంకి
- పి.రామారావు-కందుకూరు
వీరిలో ఇద్దరు రవికుమార్, రామారావులు టీడీపీలోకి ఫిరాయించారు.
కాపు ఎమ్మెల్యేలు..20
కాపు, బలిజ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఆంద్ర ప్రదేశ్ లో ఇరవై మంది ఎన్నికయ్యారు. వీరిలో టీడీపీ నుంచి పద్నాలుగు మంది, వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి ముగ్గురు గెలపొందారు.కాపులు,బలిజ వర్గాల నుంచి ఎన్నికైన వారిలో ఇద్దరు తప్ప మిగిలినవారంతా కోస్తా జిల్లాల నంచి ఎన్నికయ్యారు.కాగా వైసిపి నుంచి గెలిచివనవారిలో ఇద్దరు పిరాయించి టీడీపీలో చేరిపోయారు.
తెలుగుదేశం తరపున ఎన్నికైన కాపు ఎమ్మెల్యేలు-14
- గంటా శ్రీనివాసరావు-భీమిలి
- పి.సత్యనారాయణ-అనకాపల్లి
- పి.రమేష్ బాబు-యలమంచిలి
- నిమ్మకాయల చినరాజప్ప-పెద్దాపురం
- తోట త్రిమూర్తులు-రామచంద్రాపురం
- నిమ్మల రామానాయుడు-పాలకొల్లు
- బి.మాధవ నాయుడు-నరసాపురం
- రామాంజనేయులు-భీమవరం
- బి.కె.రామారావు-ఏలూరు
- మండలి బుద్ద ప్రసాద్- అవనిగడ్డ
- బి.ఉమామహేశ్వరరావు-విజయవాడ సెంట్రల్
- కదిరి బాబూరావు- కనిగిరి
- ఎమ్.వెంకటరమణ-తిరుపతి(బలిజ) ( మరణించారు)
- కె. సత్యప్రభ-చిత్తూరు (బలిజ).
- ఉప ఎన్నిక- సుగుణమ్మ-తిరుపతి(బలిజ)
బీజేపీ కాపు ఎమ్మెల్యేలు -2
- ఆకుల సత్యనారాయణ-రాజమండ్రి సిటీ
- పి మాణిక్యాలరావు-తాడేపల్లిగూడెం
ఇతరులు...(కాపు)-1
ఆమంచి కృష్ణమోహన్ - చీరాల (నవోదయ పార్టీ పేరుతో గెలిచి, ఆ తర్వాత టీడీపీలో చేరిపోయారు)
వైఎస్ ఆర్ కాంగ్రెస్ కాపు ఎమ్మెల్యేలు-3
- దాడిశెట్టి రాజా-తుని,
- వరుపుల సుబ్బారావు-ప్రత్తిపాడు
- జె.వి.అప్పారావు- (నెహ్రూ)-జగ్గంపేట
వీరిలో ఇద్దరు నెహ్రూ, సుబ్బారావులు వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి ఫిరాయించారు.
బీసీ ఎమ్మెల్యేలు 32 మంది..
ఏపీలో మొత్తం ముప్పై ఒక్క మంది బీసీ ఎమ్మెల్యేలు గెలవగా, వారిలో ఇరవైఎనిమిది మంది టీడీపీ పక్షాన, నలుగురు మాత్రమే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పక్షాన గెలుపొందారు. వీరిలో గౌడ వర్గం నుంచి ఐదుగురు, తూర్పుకాపు వర్గీయులు ఐదుగురు,కాళింగ ఇద్దరు, పోలినాటి వెలమ ముగ్గురు, కొప్పుల వెలమ ముగ్గురు, మత్సకార ముగ్గురు, యాదవ ఇద్దరు, శెట్టి బలిజ ఇద్దరు, గవర, బోయ, కురబ వర్గాల వారు ఒక్కొక్కరు గెలుపొందారు.ఆరుగురు తప్ప మిగిలినవారంతా కోస్తా జిల్లాల వారే.వైసిపి నుంచి గెలుపొందినవారిలో ఒకరు తూర్పు కాపు, ఒకరు కొప్పుల వెలమ, ఒకరు యాదవ, ఒకరు బోయ ఉన్నారు.
వెనుకబడిన తరగతులకు (బీసీ) చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు-28
- బెందాళం అశోక్- ఇచ్చాపురం-కళింగ,
- గౌతు శివాజి-పలాస-గౌడ-సిగిడి,
- కె.అచ్చెన్నాయుడు-టెక్కలి -పోలినాటి వెలమ,
- గూండా లక్ష్మీదేవి-శ్రీకాకుళం-పోలినాటి వెలమ,
- కె.రవికుమార్- ఆముదాలవలస-కాళింగ,
- కె. కళావెంకటరావు- ఎచ్చెర్ల-తూర్పుకాపు,
- బగ్గు రమణమూర్తి- నరసన్నపేట-పోలినాటి వెలమ,
- కిమిడి మృణాళిని-చీపురుపల్లి-తూర్పు కాపు,
- కె.అప్పల నాయుడు-గజపతినగరం-తూర్పుకాపు,
- పి.నారాయణస్వామి నాయుడు-నెల్లిమర్ల-తూర్పు కాపు,
- మీసాల గీత-విజయనగరం-తూర్పు కాపు,
- కె.లలితకుమారి-శృంగవరపు కోట-కొప్పుల వెలమ,
- వి.గణేష్ కుమార్ -విశాఖ దక్షిణం,-మత్సకార,
- పివిజిఆర్ నాయుడు-విశాఖ పశ్చిమ-గవర,
- పల్లా శ్రీనివాస్-గాజువాక-యాదవ,
- బండారు సత్యనారాయణమూర్తి-పెందుర్తి-కొప్పుల వెలమ,
- అయ్యన్న పాత్రుడు- నర్సీపట్నం-కొప్పుల వెలమ,
- వి.వెంకటేశ్వరరావు-కాకినాడ సిటీ- మత్స్యకార,
- పిల్లి అనంతలక్ష్మి- కాకినాడ రూరల్-శెట్టి బలిజ,
- పితాని సత్యనారాయణ - ఆచంట-శెట్టి బలిజ,
- కె.వెంకట్రావు- పెడన-గౌడ,
- కొల్లు రవీంద్ర-మచిలీపట్నం-మత్స్యకార,
- ఎ.సత్యప్రసాద్-రేపల్లె-గౌడ,
- కె.ఇ. కృష్ణమూర్తి-ప్రత్తికొండ - గౌడ,
- కాల్వ శ్రీనివాసులు-రాయదుర్గం-బోయ,
- జితేందర్ గౌడ్-గుత్తి-గౌడ,
- కె.పార్దసారది-పెనుకొండ-కురుబ,
- శంకర్ యాదవ్- తంబళ్లపల్లె-యాదవ్
వైసిపి నుంచి ఎన్నికైన బీసీ ఎమ్మెల్యేలు-4
- కె.వెంకటరమణ-పాతపట్నం-తూర్పుకాపు
- బి.ముత్యాల నాయుడు-మాడుగుల-కొప్పుల వెలమ
- అనిల్ కుమార్ యాదవ్-నెల్లూరు రూరల్- యాదవ్
- జీ.జయరాం- ఆలూరు-బోయ
వీరిలో వెంకటరమణ పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారు.
తెలుగుదేశం పార్టీ పక్షాన గెలుపొందిన ఎస్సీ ఎమ్మెల్యేలు-16
- చిరంజీవులు - పార్వతిపురం,
- వి.అనిత-పాయకరావుపేట,
- ఎ. ఆనందరావు-అమలాపురం,
- జి. సూర్యారావు- రాజోలు,
- పి.నారాయణమూర్తి-పి.గవన్నవరం,
- కెఎస్ జవహర్-కొవ్వూరు,
- ఎమ్.వెంకటేశ్వరరావు-గోపాలపురం,
- పి.సుజాత-చింతలపూడి,
- టి.ప్రభాకరరావు -నందిగామ,
- టి.శ్రావణకుమార్-తాడికొండ,
- నక్కా ఆనంద్ బాబు- వేమూరు,
- రావెల కిషోర్ బాబు-ప్రత్తిపాడు,
- డాక్టర్ స్వామి-కొండపి,
- యామిని బాల-సింగనమల,
- కె.ఈరన్న- మడకశిర,
- టి.ఆదిత్య-సత్యవేడు.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment