1985 శాసనసభ ఎన్నికలు సామాజికవర్గాల విశ్లేషణ | Sakshi
Sakshi News home page

1985 శాసనసభ ఎన్నికలు సామాజికవర్గాల విశ్లేషణ

Published Thu, Mar 7 2024 12:27 PM

1985 Andhra Pradesh Caste Equations - Sakshi

1985 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం సాదించింది. 1984లో నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు నేపద్యంలో శాసనసభను రద్దు చేసి ఆనాటి ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్‌ మళ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికలలో కోస్తా, రాయలసీమలలో కలిపి తెలుగుదేశం పార్టీకి 146 స్థానాలు వస్తే, కాంగ్రెస్‌ పార్టీకి ముప్పై మూడు స్థానాలే వచ్చాయి. సీపీఐకి నాలుగు, సీపీఎంకు మూడు, ఇండిపెండెంట్లు ఇద్దరు గెలిచారు. సామాజికవర్గాల వారీ చూస్తే రెడ్లు 38 మంది గెలవగా, వారిలో ఇరవై రెండు మంది టీడీపీ పక్షాన, పద్నాలుగు మంది కాంగ్రెస్‌ తరపున గెలిచారు.

కమ్మ సామాజికవర్గం అత్యదిక స్థానాలలో నలభై నాలుగు చోట్ల విజయం సాదించింది. ఇందులో టీడీపీ పక్షాన ముప్పై ఏడు సీట్లు, కాంగ్రెస్‌ తరపున ఐదు సీట్లు వచ్చాయి. సీపీఐ, సీపీఎంల నుంచి ఒక్కొక్కరు గెలిచారు. కాపు సామాజికవర్గం నుంచి ఇరవై రెండు మంది గెలవగా, ఇరవై మంది టీడీపీవారు కాగా, ఇద్దరు కాంగ్రెస్‌ వారు. బీసీలలో కూడా ముప్పై నాలుగు  మంది గెలవగా వారిలో ముప్పై మంది టీడీపీవారే. నలుగురు  కాంగ్రెస్‌ వారు. షెడ్యూల్‌ కులాల వారిలో పదిహేడు మంది టీడీపీ, కాగా కాంగ్రెస్‌ఐ ఇద్దరు, సీపీఐ ఇద్దరు, సీపీఎం ఒకరు ఉన్నారు. గిరిజనులలో ఆరుగురు టీడీపీ,ఇద్దరు కాంగ్రెస్‌ కు చెందినవారు. క్షత్రియ సామాజికవర్గం నుంచి పది మంది గెలవగా టీడీపీ ఏడు కాంగ్రెస్‌ ఇద్దరు ఉన్నారు. ఇతర వర్గాలలో ముస్లీంలు ఇద్దరు టీడీపీ, ఒకరుకాంగ్రెస్‌ కాగా, వెలమ ముగ్గురు టీడీపీ వారే. వైశ్యులు ఇద్దరు టీడీపీ వారే.

రెడ్డి ఎమ్మెల్యేలు-38
బహుశా ఇతర సామాజికవర్గాలకన్నా,ముఖ్యంగా కమ్మ సామాజికవర్గం కన్నా రెడ్డి ఎమ్మెల్యేలు తక్కువగా ఎన్నికవడం విశేషం. రెడ్డి ఎమ్మెల్యేలు మొత్తం 38 మంది ఎన్నికైతే, కమ్మ ఎమ్మెల్యేలు 43మందిఎన్నికయ్యారు. తెలుగుదేశం నుంచే ఈ రెండు సామాజికవర్గాల ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గెలవడం మరో విశేషం.తెలుగుదేశం పక్షాన గెలిచిన రెడ్డి ఎమ్మెల్యేలలో ఏడుగురు కోస్తావారు కాగా, ఇరవై ఒక్క మంది రాయలసీమ నుంచి గెలిచారు. వారి వివరాలు.

టీడీపీ రెడ్డి ఎమ్మెల్యేలు..22

 • ఎన్‌.మూలారెడ్డి-అనపర్తి
 • ముత్యం అంకిరెడ్డి-గురజాల
 • ఉడుముల వెంకటరెడ్డి-కంభం
 • ముక్కు కాశిరెడ్డి-కనిగిరి
 • నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి-కోవూరు
 • ఆనం రామ నారాయణరెడ్డి-రాపూరు
 • ఇ.రామకృష్ణారెడ్డి-సర్వేపల్లి
 • బీ.వీరారెడ్డి-బద్వేల్‌
 • ఆర్‌.రాజగోపాలరెడ్డి-లక్కిరెడ్డిపల్లి
 • పీ.శివారెడ్డి-జమ్మలమడుగు, ఎన్‌.వరదరాజులురెడ్డి-ప్రొద్దుటూరు, ఎస్‌.రఘురామిరెడ్డి-మైదుకూరు, బీ.వెంగళరెడ్డి-ఆత్మకూరు, ఇ.తిమ్మా రెడ్డి-నందికోట్కూరు, కే.రాంభూపాల్‌ రెడ్డి-పాణ్యం, కే.సుబ్బారెడ్డి-కోయిలకుంట్ల, బివి మోహన్‌ రెడ్డి-ఎమ్మిగనూరు, ఎస్‌.వెంకటరెడ్డి-నల్లమడ, జీ.నాగిరెడ్డి-ధర్మవరం, ఎవి లక్ష్మీదేవమ్మ-తంబళ్లపల్లె, సీ.ప్రబాకరరెడ్డి-పీలేరు, ఎన్‌.రామకృష్ణారెడ్డి-పుంగనూరు

కాంగ్రెస్‌ రెడ్డి ఎమ్మెల్యేలు..14

 • ఎమ్‌.ఆదినారాయణరెడ్డి-కందుకూరు
 • కెపి కెండారెడ్డి-మార్కాపురం
 • కే.యానాదిరెడ్డి-కావలి
 • బీ.సుందరరామిరెడ్డి-ఆత్మకూరు
 • కేవి సుబ్బారెడ్డి-నెల్లూరు
 • ఎమ్‌.రాజమోహన్‌ రెడ్డి-ఉదయగిరి
 • ఎమ్‌.నాగిరెడ్డి-రాయచోటి
 • వైఎస్‌ రాజశేఖరరెడ్డి-పులివెందుల
 • ఎమ్‌.వి.మైసూరారెడ్డి-కమలాపురం
 • జీ.ప్రతాపరెడ్డి-ఆళ్లగడ్డ
 • జేసీ దివాకరరెడ్డి-తాడి పత్రి
 • ఎన్‌.అమరనాదరెడ్డి-వాయల్పాడు
 • ఎమ్‌.రామిరెడ్డి-తిరుపతి
 • ఆర్‌. చెంగారెడ్డి-నగరి

ఇతరులు-2

 • పిడతల రంగారెడ్డి-గిద్దలూరు- ఇండి
 • జక్కా వెంకయ్య-అల్లూరు-సీపీఎం

1985 కమ్మ సామాజికవర్గ ఎమ్మెల్యేల విశ్లేషణ-44
ఈ ఎన్నికలలో తెలుగుదేశం గెలవడం ఒక విషయం అయితే, కమ్మ వర్గం ఎమ్మెల్యేలు రెడ్డి ఎమ్మెల్యేల సంఖ్యను మించి ఉండడం మరో ఆసక్తికరమైన విషయం అవుతుంది. మొత్తం నలభై మూడు మంది కమ్మ ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. వారిలో తెలుగుదేశంకు చెందినవారు ముప్పై ఆరు మంది కాగా, కాంగ్రెస్‌ తరపున ఐదుగురు ఎన్నికయ్యారు. ఒకరు సీపీఐ పక్షాన, మరొకరు సీపీఎం పక్షాన గెలిచారు. ఇరవై ఆరు మంది టీడీపీ ఎమ్మెల్యేలు కోస్తా ప్రాంతం నుంచి, మిగిలిన ఏడుగురు రాయలసీమ నుంచి గెలుపొందారు. కాంగ్రెస్‌లో నలుగురు కోస్తా, ఒకరు రాయలసీమ నుంచి గెలుపొందారు. కాగా ఎన్‌టీరామారావు గుడివాడ, హిందుపూర్‌ రెండు చోట్ల నుంచి గెలుపొందారు. ఎన్‌టీఆర్‌ తెలంగాణలోని నల్గొండ నుంచి కూడా గెలుపొంది ఒకేసారి మూడు చోట్ల పోటీచేసి విజయం సాదించిన ఏకైక నేతగా రికార్డు సాదించారు.

తెలగుదేశం కమ్మ ఎమ్మెల్యేలు...37

 • ఎమ్‌.వి.కృష్ణారావు-ఇచ్చాపురం
 • ఎ.రామచంద్రరావు-పెందుర్తి
 • బలుసు రామారావు-పెద్దాపురం
 • వి.నారాయణమూర్తి-ఆలమూరు
 • ఎమ్‌.వి.వి రామారావు-రామచంద్రపురం
 • పీ.సాంబశివరావు-బూరుగుపూడి
 • జీ.బుచ్చయ్యచౌదరి-రాజమండ్రి
 • పీవి కృష్ణారావు-కొవ్వూరు
 • ఎమ్‌.వి.కృష్ణారావు-తణుకు
 • కంటమని శ్రీనివాసరావు-ఉంగుటూరు
 • గారపాటి సాంబశివరావు-దెందులూరు, మూల్పూరు బాలకృష్ణారావు-గన్నవరం, ఎన్‌టీరామారావు-గుడివాడ, ఎర్నేని సీతాదేవి-ముదినేపల్లి, అన్నె బాబూరావు-ఉయ్యూరు, దేవినేని రాజశేఖర్‌-కంకిపాడు, వసంత నాగేశ్వరరావు-నందిగామ, నెట్టెం రఘురాం-జగ్గయ్యపేట, కే.సదాశివరావు-పెదకూరపాడు, ఎమ్‌.ఎస్‌.ఎస్‌.కోటేశ్వరరావు-మంగళగిరి, దూళిపాళ్ల వీరయ్య చౌదరి-పొన్నూరు, కొడాలి వీరయ్య-వేమూరు, యడ్ల వెంకట్రావు-రేపల్లె, అన్నాబత్తుని సత్యనారాయణ-తెనాలి, ఎమ్‌.పెదరత్తయ్య-ప్రత్తిపాడు, కోడెల శివప్రసాదరావు-నరసరావుపేట, దగ్గుబాటి వెంకటేశ్వరరావు-పర్చూరు, బీసీ గరటయ్య-అద్దంకి, కే.బలరాం-మార్టూరు, పీ.కోటేశ్వరరావు-ఒంగోలు, ఎస్‌.నారాయణప్ప-ఉరవకొండ, ఎన్‌టీరామారావు-గుడివాడ, వేలూరి కేశన్న-గోరంట్ల, ఆర్‌.నారాయణరెడ్డి-మదనపల్లె, జయదేవనాయుడు-చంద్రగిరి, జీ.ముద్దుకృస్ణమ నాయుడు-పుత్తూరు, ఎన్‌.రంగస్వామి నాయుడు-కుప్పం

కాంగ్రెస్‌ కమ్మ ఎమ్మెల్యేలు-5

 • చనుమోలు వెంకటరావు-మైలవరం
 • ఆలపాటి ధర్మారావు-దుగ్గిరాల
 • సోమేపల్లి సాంబయ్య-చిలకలూరిపేట
 • జీ.అచ్యుతకుమార్‌-కొండపి
 • వి.రాంభూపాల్‌ చౌదరి-కర్నూలు

ఇతర పార్టీలు..2

 • పుతుంబాక వెంకటపతి-సత్తెనపల్లి-సీపీఎం
 • గంగినేని వెంకటేశ్వరరావు-వినుకొండ-సీపీఐ

1985 కాపు, బలిజ సామాజికవర్గ ఎమ్మెల్యేలు
కాపు సామాజికవర్గం ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది గెలుపొందగా, వారిలో ఇరవై మంది టీడీపీకి చెందినవారే. ఇద్దరు మాత్రం కాంగ్రెస్‌ నుంచి గెలిచారు.టీడీపీ ఎమ్మెల్యేలలో పదిహేను మంది కోస్తా నుంచి ఎన్నిక కాగా, ఐదుగురు రాయలసీమ నుంచి గెలుపొందారు. కాంగ్రెస్‌ నుంచి గెలిచినవారిలో ఒకరు కోస్తా నుంచి ,ఇద్దరు రాయలసీమ నుంచి గెలిచారు.

తెలుగుదేశం కాపు ఎమ్మెల్యేలు-20

 • పీ.చలపతిరావు-యలమంచిలి
 • ముద్రగడ పద్మనాభం-ప్రత్తిపాడు
 • వి.నాగేశ్వరరావు-పిఠాపురం
 • చిక్కాల రామచంద్రరావు-తాళ్లరేవు
 • మెట్ల సత్య నారాయణ-అమలాపురం
 • వడ్డి వీరభద్రరావు-కడియం
 • తోట సుబ్బారావు-జగ్గం పేట
 • పీ.మణెమ్మ-పెనుకొండ
 • ఎవి సత్యనారాయణ-పాలకొల్లు
 • చేగొండి వెంకట హరిరామజోగయ్య-నర్సాపురం
 • ఎర్రా నారాయణస్వామి-తాడేపల్లిగూడెం
 • వడ్డి రంగా రావు-మచిలీపట్నం
 • సింహాద్రి సత్యనారాయణ-అవనిగడ్డ
 • ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు-బాపట్ల
 • ఎన్‌. శ్రీరాములు-దర్శి
 • బీ.రత్న సభాపతి-రాజంపేట
 • సీ.రామచంద్రయ్య-కడప(బలిజ)
 • బీ. హూలి కుంటప్ప-రాయదుర్గం(బలిజ)
 • ఎన్‌.రామకృష్ణ-అనంతపురం (బలిజ)
 • ఎస్‌.ముని రామయ్య-శ్రీకాళహస్తి(బలిజ)

కాంగ్రెస్‌ కాపు ఎమ్మెల్యేలు-2

 • వంగవీటి మోహన రంగారావు- విజయవాడ-2
 • ఆర్‌.గోపినాద్‌-చిత్తూరు (బలిజ)

బీసీ వర్గాల ఎమ్మెల్యేలు..34
ఈ ఎన్నికలలో బీసీ వర్గాల ఎమ్మెల్యేలు 34 మంది ఎన్నిక కాగా వారిలో ముప్పై మంది టీడీపీ వారు కాగా, నలుగురు మాత్రమే కాంగ్రెస్‌కు చెందినవారు. టీడీపీ ఎమ్మెల్యేలలో ఇరవైఐదు మంది కోస్తా ప్రాంతం నుంచి నలుగురు రాయలసీమ నుంచి గెలుపొందారు. కాగా కాంగ్రస్‌ ముగ్గురు ఎమ్మెల్యేలు కోస్తావారే. తూర్పు కాపుల నుంచి అత్యధికంగా పదకుండు మంది ఎన్నికవడం విశేషం.గౌడ వర్గీయులు ఐదుగురు, పొలినాటి వెలమ  నలుగురు , తూర్పుకాపు ముగ్గురు, కాళింగ ఇద్దరు, యాదవ ఇద్దరు, కళావంతుల ఇద్దరు, గవర, మత్సకార, దేవాంగ, బోయ, కురుబ వర్గాల నుంచి ఒక్కొక్కరు ఎన్నికయ్యారు.

తెలుగుదేశం బీసీ ఎమ్మెల్యేలు-30

 • గౌతు శివాజీ-సోంపేట-గౌడ
 • వరద సరోజ-టెక్కలి-కాళింగ
 • జీ.ఎ. సూర్య నారాయణ-శ్రీకాకుళం-పీ.వెలమ
 • తమ్మినేని సీతారాం-ఆముదాల వలస-కాళింగ
 • ఎస్‌.ప్రభాకరరావు-నరసన్నపేట-పీ.వెలమ
 • కే.ఎర్రన్నాయుడు-హరిశ్చంద్రపురం-పీ.వెలమ
 • కే.కళా వెంకటరావు-ఉణుకూరు-తూర్పుకాపు
 • ఎమ్‌.వెంకట్రామ నాయుడు-పార్వతీపురం-కే.వెలమ
 • ఎస్సీవి అప్పలనాయుడు-బొబ్బిలి-కే.వెలమ
 • టి.జయప్రకాష్‌-తెర్లాం-కే.వెలమ
 • కే.రామ్మోహన్‌ రావు-చీపురుపల్లి-తూర్పు కాపు
 • కోళ్ల అప్పలనాయుడు-ఉత్తరాపల్లి-కే.వెలమ
 • పీ.నారాయణస్వామి నాయుడు-భోగాపురం-తూర్పు కాపు, అల్లు భానుమతి-విశాఖ-1-కొప్పుల వెలమ,రాజాన రమణి-విశాఖ-2-యాదవ, పైల అప్పలనాయుడు-పరవాడ-కే.వెలమ, జీ.ఎర్రు నాయుడు-చోడవరం-కే.వెలమ, రెడ్డి సత్యనారాయణ-మాడుగుల-కే.వెలమ, దాడి వీరభద్రరావు-అనకాపల్లి-గవర, సిహెచ్‌. అయ్యన్నపాత్రుడు-నర్సీపట్నం-కే.వెలమ, వై.రామకృష్ణుడు-తుని-యాదవ, టిఎస్‌ఎల్‌ నాయకర్‌-సంపర-మత్స్యకార, ఎమ్‌. రంగారావు-ఏలూరు-కొప్పుల వెలమ, కాగిత వెంకట్రావు-మల్లేశ్వరం-గౌడ, ఇ.సీతా రావమ్మ-కూచినపూడి-గౌడ, ఎస్‌.చంద్రమౌళి-చీరాల-దేవాంగ, కే.ఇ.కృష్ణమూర్తి-డోన్‌-గౌడ, గాది లింగప్ప-గుత్తి-బోయ, హెచ్‌.నర్సేగౌడ-మడకశిర-గౌడ, ఎస్‌.రామ చంద్రారెడ్డి-పెనుకొండ-కురబ.

కాంగ్రెస్‌ బీసీ ఎమ్మెల్యేలు-4

 • డీ.నారాయణరావు-పాతపట్నం-పీ.వెలమ
 • వి.ఎస్‌.అప్పలనాయుడు-గజపతినగరం-కే.వెలమ
 • సిహెచ్‌ జయరాంబాబు-గుంటూరు-2-కళావంతుల
 • నట్టువకృష్ణమూర్తి-మాచర్ల-కళావంతుల.

ఎస్సీ ఎమ్మెల్యేలు-22
షెడ్యూల కులాల ఎమ్మెల్యేలలో తెలుగుదేశం నుంచి పదిహేడు మంది గెలవగా,కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు గెలుపొందారు. సీపీఐ నుంచి ఒకరు, సీపీఎం నుంచి ఇద్దరు గెలిచారు.

తెలుగుదేశం ఎస్సీ ఎమ్మెల్యేలు-17

 • కే.ప్రతిభా భారతి-ఎచ్చెర్ల
 • టీ.భద్రయ్య-పాలకొండ
 • కే.నూకరాజు-పాయకరావుపేట
 • పండు కృష్ణమూర్తి-ముమ్మడివరం
 • ఉండ్రు కృష్ణారావు-నగరం
 • గొల్లపల్లి సూర్యారావు-అల్లవరం
 • కే.వివేకానంద-గోపాలపురం
 • పీ.వెంకటరత్నం-తిరువూరు
 • జె.ఆర్‌.పుష్పరాజ్‌-తాడికొండ
 • ఎస్‌.ఆదెన్న-సంతనూతలపాడు
 • బీ.దుర్గాప్రసాదరావు-గూడూరు
 • ఎమ్‌.మణెయ్య-సూళ్లూరుపేట
 • టి.పెంచలయ్య-కోడూరు
 • ఎమ్‌. శిఖామణి-కొడుమూరు
 • కెజయరాం-శింగనమల
 • ఎమ్‌.సురాజన్‌-సత్యవేడు
 • పీ.సుబ్బయ్య-పలమనేరు.

కాంగ్రెస్‌ ఎస్సీ ఎమ్మెల్యేలు..2

 • మసాల ఈరన్న-ఆలూరు
 • జీ.కుతూహలమ్మ-వేపంజేరి

ఇతర పార్టీల ఎస్సీ ఎమ్మెల్యేలు..3

 • ఎ.చిత్తరంజన్‌-ఆచంట-సీపీఎం
 • పీ.రామయ్య-నిడుమోలు-సీపీఎం
 • పకీరప్ప-కళ్యాణదుర్గం-సీపీఐ

ఎస్టి ఎమ్మెల్యేలు-8
ఎస్టి. ఎమ్మెల్యేలలో ఆరుగురు టీడీపీకి చెందినవారు కాగా, ఇద్దరు కాంగ్రెస్‌ వారు

టీడీపీ ఎస్టి ఎమ్మెల్యేలు..6

 • బీ.రాజయ్య-సాలూరు
 • ఎల్‌.బీ.దుక్కు-ఎస్‌.కోట
 • ఎమ్‌.వి.వి.సత్యనారాయణ-చింతపల్లి
 • కే.చిట్టినాయుడు-పాడేరు
 • సీ.జోగారావు-ఎల్లవరం
 • ఎమ్‌.లక్ష్మణరావు-పోలవరం

కాంగ్రెస్‌ ..2

 • విశ్వాసరాయ నరసింహారావు-కొత్తూరు
 • శత్రుచర్ల విజయరామరజాజు-నాగూరు

క్షత్రియ ఎమ్మెల్యేలు-10
క్షత్రియ సామాజికవర్గం ఎమ్మెల్యేలు పది మంది గెలవగా, వారిలో ఏడుగురు టీడీపీ, ఇద్దరు కాంగ్రెస్‌, ఒకరు సీపీఐకి చెందినవారు

టీడీపీ క్షత్రియ ఎమ్మెల్యేలు-7

 • పీ.అశోక్‌ గజపతిరాజు-విజయనగరం
 • ఆర్‌ఎస్‌ డిపిఎ నరసింహరాజు-భీమిలి
 • ఎవి సూర్యనారాయణరాజు-రాజోలు
 • ఐ.ఎస్‌.రాజు-కొత్తపేట,వేగేశ్న కనక రాజు-అత్తిలి
 • పీవి నరసింహరాజు-భీమవరం
 • కలిదిండి రామచంద్రరాజు-ఉండి

కాంగ్రెస్‌ క్షత్రియ ఎమ్మెల్యేలు-2

 • పీ.సాంబశివరాజు-సతివాడ
 • కనుమూరి బాపిరాజు-కైకలూరు

ఇతర పార్టీలు-1
యు.రామచంద్రరాజు-సీపీఐ

ముస్లీం-3, టీడీపీ-2, కాంగ్రెస్‌ -1

 • ఎమ్‌.డి జాని-గుంటూరు-1-కాంగ్రెస్‌
 • ఎన్‌.ఎమ.డి ఫరూఖ్‌-నంద్యాల-టీడీపీ
 • రసూల్‌-కదిరి-టీడీపీ

వెలమ-టీడీపీ-3

 • కోటగిరి విద్యాధరరావు-చింతలపూడి-టీడీపీ-వెలమ
 • కే.హనుమంతరావు-నూజివీడు-టీడీపీ-వెలమ
 • సాయికృష్ణ యాచేంద్ర-వెంకటగిరి-టీడీపీ -వెలమ

వైశ్య- టీడీపీ-2,కాంగ్రెస్‌ -1

 • ముత్తా గోపాలకృష్ణ-కాకినాడ-టీడీపీ
 • మహాబలేశ్వరగుప్త-ప్రత్తికొండ-టీడీపీ
 • రాయచోటి రామయ్య-ఆదోని-కాంగ్రెస్‌.


– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Advertisement
 
Advertisement
 
Advertisement