1972 శాసనసభ ఎన్నికలు సామాజికవర్గాల విశ్లేషణ | Sakshi
Sakshi News home page

1972 శాసనసభ ఎన్నికలు సామాజికవర్గాల విశ్లేషణ

Published Tue, Mar 5 2024 2:00 PM

1972 Andhra Pradesh Caste Equations - Sakshi

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌ ప్రభంజనం వీచింది. ఆంద్ర, రాయలసీమలలోని 186 సీట్లకు గాను 142 సీట్లు కాంగ్రెస్‌కు దక్కాయి. అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీ చీలి కొత్త కాంగ్రెస్‌, పాత కాంగ్రెస్‌గా ఏర్పడ్డాయి. ఇందిరాగాందీ నాయకత్వంలోని కాంగ్రెస్‌కు ప్రజలు పట్టం కట్టారు. ప్రస్తుతం ఉన్న ఏపీలో కమ్యూనిస్టు పార్టీకి నాలుగు స్థానాలు వస్తే, స్వతంత్ర పార్టీకి ఒక్క స్థానం మాత్రమే దక్కిందంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు. అదేసమయంలో ఇండిపెండెంట్లు ముప్పై ఎనిమిది మంది గెలిచారు.

సామాజికవర్గాల పరంగా చూస్తే  రెడ్లు ముప్పై నాలుగు మంది గెలవగా, వారిలో కాంగ్రెస్‌ నుంచి ఇరవై ఒక్క మంది, సీపీఐ నుంచి ఒకరు, ఇండిపెండెంట్లు పన్నెండు మంది నెగ్గారు. ఇక కమ్మ వర్గంలో ముప్పై ఒక్క మంది గెలిస్తే, కాంగ్రెస్‌ పక్షాన 19 మంది, స్వతంత్రపార్టీ నుంచి ఒకరు, సీపీఐ పక్షాన ఇద్దరు గెలిచారు. ఇండిపెండెంట్‌లు తొమ్మిది మంది గెలుపొందారు. కాపులలో 19 మందికిగాను పదిహేను మంది కాంగ్రెస్‌ వారే. బీసీలు ముప్పై మూడు మంది గెలవగా, వారిలో కాంగ్రెస్‌ నుంచి ఇరవై మూడు మంది, ఇండిపెండెంట్లు పది మంది గెలిచారు. ఎస్సీలు కాంగ్రెస్‌ నుంచి ఇరవైనాలుగు మంది గెలిస్తే ఇండిపెండెంట్‌గా ఒక్కరే గెలిచారు. బ్రాఆహ్మణ వర్గం వారు పదకుండు మంది కాంగ్రెస్‌ కాగా, ముస్లింలు ఏడుగురు కాంగ్రెస్‌ వారే, క్షత్రియులలో పదకుండు మంది కాంగ్రెస్‌ వారు కాగా ఒకరు ఇండిపెంటెండెంట్‌. వెలమ నుంచి ఇద్దరు, వైశ్య ఒకరు గెలిచారు. క్రిస్టియన్లు ముగ్గురు ఎన్నికయ్యారు..

రెడ్డి ఎమ్మెల్యేలు-34
రెడ్డి ఎమ్మెల్యేలు ముప్పైనాలుగుమంది ఎన్నిక కాగా వారిలో ఇరవై ఒక్క మంది కాంగ్రెస్‌ వారు.ఈ ఎన్నికలలో తొమ్మిది మంది కోస్తా నుంచి పన్నెండు మంది రాయలసీమ నుంచి గెలుపొందారు.ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేలు పన్నెండు మంది గెలవగా,నలుగురు తప్ప మిగిలినవారంతా రాయలసీమవారు.అంటే రాయలసీమ నుంచి ఇరవై మంది నెగ్గారు.కోస్తా నుంచి పద్నాలుగు మంది గెలుపొందారు.

కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎన్నికైన రెడ్డి ఎమ్మెల్యేల వివరాలు..21

 • డి.సత్యనారాయణరెడ్డి-రామచంద్రాపురం
 • బి.గోపాలరెడ్డి-దుగ్గిరాల
 • డి.కృష్ణారెడ్డి-నరసరావుపేట
 • పీ.రంగారెడ్డి-గిద్దలూరు
 • కె.ఓటుల్‌ రెడ్డి-ఎర్రగొండపాలెం
 • డి. రాజగోపాలరెడ్డి-దర్శి
 • పీ.రామచంద్రారెడ్డి-కోవూరు
 • ఆనం వెంకటరెడ్డి-నెల్లూరు
 • ఆర్‌.దశరధరామిరెడ్డి-అల్లూరు
 • బి.వీరారెడ్డి-బద్వేలు
 • గజ్జల రంగారెడ్డి-కడపి
 • ఆర్‌. రాజగోపాలరెడ్డి-లక్కిరెడ్డిపల్లె
 • పీ.బసిరెడ్డి-పులివెందుల
 • ఎస్‌.పీ నాగిరెడ్డి-మైదుకూరు
 • మద్దూరు సుబ్బారెడ్డి-నందికోట్కూరు
 • ఇ.అయ్యపురెడ్డి-పాణ్యం
 • బివి సుబ్బారెడ్డి-కోయిలకుంట్ల
 • ఎ. వెంకటరెడ్డి-అనంతపురం
 • ఎస్‌.డి.నారాయణరెడ్డి-పెనుకొండ
 • టి.ఎన్‌.అనసూయమ్మ-తంబళ్లపల్లె
 • ఎన్‌.అమరనాధరెడ్డి-వాయల్పాడు

సీపీఐ -1
మందపాటి నాగిరెడ్డి-గురజాల.

ఇండిపెండెంట్లుగా ఎన్నికైన రెడ్డి ఎమ్మెల్యేలు..12

 • జూలకంటి నాగిరెడ్డి-మాచర్ల
 • ఎమ్‌.ఆదినారాయణరెడ్డి-కందుకూరు
 • ఎస్‌.పాపిరెడ్డి-కనిగిరి
 • ఎన్‌.శ్రీనివాసులురెడ్డి-గూడూరు
 • టి.నరసింహారెడ్డి-జమ్మలమడుగు
 • ఎస్వి సుబ్బారెడ్డి-ఆళ్లగడ్డ
 • బొజ్జా వెంకటరెడ్డి-నంద్యాల
 • డి.కె.వెంకటరెడ్డి-గుత్తి
 • టి.రంగారెడ్డి-శింగనమల
 • పీ.రవీద్రరెడ్డి-గోరంట్ల
 • సి.నారాయణరెడ్డి-కదిరి
 • ఎ.బలరామిరెడ్డి-శ్రీకాళహస్తి

కమ్మ ఎమ్మెల్యేలు-31
కమ్మ ఎమ్మెల్యేలలో కాంగ్రెస్‌ నుంచి గెలిచినవారిలో పదిహేను మంది కోస్లా జిల్లాల నుంచి కాగా, నలుగురు రాయలసీమ నుంచి ఉన్నారు. మిగిలిన పన్నెండు మంది కూడా కోస్తా జిల్లాల వారే. అంటే మొత్తం ఇరవై ఏడు మంది కోస్తా నుంచి గెలుపొందారన్నమాట.

కాంగ్రెస్‌ తరపున ఎన్నికైన కమ్మ ఎమ్మెల్యేలు..19

 • అప్పసాని అప్పన్నదొర-విజయనగరం
 • కొండపల్లి కృష్ణమూర్తి-పెద్దాపురం
 • వి.రామకృష్ణచౌదరి-అనపర్తి
 • కె.రామచంద్రరావు-బూరుగుపూడి
 • జి.సత్యనారాయణమూర్తి-తణుకు
 • ఎమ్‌.రామ్మోహన్‌ రావు-దెందులూరు
 • కాజ రామనాధం-ముదినేపల్లి
 • కాకని వెంకటరత్నం-ఉయ్యూరు
 • అక్కినేని భాస్కరరావు-కంకిపాడు
 • చనుమోలు వెంకటరావు-మైలవరం
 • వసంత నాగేశ్వరరావు-నందిగామ
 • జీ.వి.రత్తయ్య-తాడికొండ
 • బి.సత్యనారాయణ-చిలకరూరిపేట
 • భవనం జయప్రద-వినుకొండ
 • కె.శ్రీహరి నాయుడు-ఆత్మకూరు
 • చల్లా సుబ్బారాయుడు-తాడిపత్రి
 • పీవి చౌదరి-ధర్మవరం
 • కిలారి గోపాలనాయుడు-నగరి
 • డి.ఆంజనేయులు నాయుడు -చిత్తూరు

స్వతంత్ర పార్టీ -1
యడ్లపాటి వెంకటరావు-వేమూరు

సీపీఐ-2

 • వేములపల్లి శ్రీకృష్ణ-మంగళగిరి
 • డి శంకరయ్య-కొండపి

ఇండిపెండెంట్‌ కమ్మ ఎమ్మెల్యేలు-9

 • బి.గోపాలకృష్ణారావు-రాజోలు
 • ఎ.హనుమంతరావు-కొవ్వూరు
 • విజిఆర్‌కె ప్రసాద్‌-జగ్గయ్యపేట
 • డి.రంగారావు-పొన్నూరు
 • డి.ఇందిర-తెనాలి
 • ఎమ్‌.నారాయణరావు-పర్చూరు
 • కె.నారాయణ స్వామి-పొదిలి
 • జి.కొండపనాయుడు-కావలి
 • ఎన్‌ .వెంకటరత్నం నాయుడు-రాపూరు

కాపు ఎమ్మెల్యేలు-19
కాపు ఎమ్మెల్యేలలో పదహారు మంది కోస్తా  జిల్లాల వారు కాగా, ముగ్గురు మాత్రమే రాయలసీమ  నుంచి గెలిచారు. కాంగ్రెస్‌ నంచి గెలిచిన పదిహేను మందిలో ఇద్దరు తప్ప మిగిలినవారు కోస్తావారు.

కాపు ఎమ్మెల్యేలు -కాంగ్రెస్‌-15

 • లుకలాపు లక్ష్మణ దాస్‌- పొందూరు-తెలగ దొర
 • కొమ్మూరు అప్పడు దొర-భోగాపురం-తెలగ దొర
 • వి.జోగిరాజు-ప్రత్తిపాడు
 • వైఎస్‌ఎన్‌ మూర్తి-పిఠాపురం
 • పంతం పద్మనాభం-జగ్గంపేట
 • జీ.కమలాదేవీ-ఆలమూరు
 • పీ.వెంకట్రావు-చెయ్యేరు
 • చేగొండి వెంకట హరిరామజోగయ్య-పాలకొల్లు
 • డి.పేరయ్య-ఉండి
 • మంగ తాయారమ్మ-కైకలూరు
 • పీ.పమిడేశ్వరరావు-మల్లేశ్వరం
 • ఎమ్‌.వి.కృష్ణారావు-అవనిగడ్డ
 • ఎడం చెన్నయ్య-రేపల్లె
 • జీ.సోమశేఖర్‌-హిందుపూర్‌-బలిజ
 • ఎమ్‌.ఎమ్‌.రత్నం-బలిజ

స్వతంత్ర-1
బండారు రత్న సభాపతి-రాజంపేట-బలిజ

సీపీఐ-1
వంకా సత్యనారాయణ-పెనుగొండ

ఇండిపెండెంట్‌ కాపు ఎమ్మెల్యేలు.. 2
ఈలి ఆంజనేయులు-తాడేపల్లి గూడెం
నిశ్శంకరరావు వెంకటరత్నం-గుంటూరు-2

బీసీ ఎమ్మెల్యేలు-33
బీసీ ఎమ్మెల్యేలలో కొప్పుల వెలమ నుంచిఐదుగురు, పొలినాటి వెలమ నుంచి ముగ్గురు పద్మశాలి, దేవాంగ ల నుంచి నలుగురు, యాదవ ఇద్దరు, కాళింగ ముగ్గురు, తూర్పు కాపు ఇద్దరు, కళావంతుల వర్గం నుంచి ఇద్దరు, బోయ ఇద్దరు, కురుబ ఇద్దరు గెలుపొందారు. జంగమ, గాండ్ల, గవర, శెట్టిబలిజ, మత్సకార, గౌడ, రెడ్డిక, నగరాలు సామాజికవర్గాల నుంచి ఒక్కొక్కరు గెలిచారు.

బీసీల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు: కాంగ్రెస్‌-23
బీసీ వర్గాలు కూడా అత్యధికం కోస్తా జిల్లాల నుంచి గెలుపొందారు. ముప్పై మూడు మందికిగాను ఏడుగురు రాయలసీమవారు.మిగిలిన ఇరవై ఆరు మంది కోస్లా జిల్లాలవారు.అందులోను ఉత్తరాంద్ర జిల్లాల నుంచి ఎక్కువగా  పదహారు మంది గెలిచారు.

 • యు.రంగబాబు-ఇచ్చాపురం-కాళింగ
 • మజ్జి తులసీదాస్‌-సోంపేట-కాళింగ
 • ఎస్‌.ఎల్‌.నాయుడు-టెక్కలి-పీ.వెలమ
 • బి.సరోజనమ్మ-నరసన్నపేట-పొలినాటి వెలమ
 • పీ.రుక్మిణమ్మ-ఉణుకూరు-తూర్పుకాపు
 • జి.పైడపు నాయుడు-చీపురుపల్లి-తూర్పుకాపు, జి.కృష్ణంనాయుడు-గొంప-కొప్పలు వెలమ,  వి.పాలవెల్లి-కొప్పుల వెలమ, బి.కళావతి-మాడుగుల-కొప్పుల వెలమ, పీవి రమణ-అనకాపల్లి-గవర, కుడిపూడి ప్రభాకరరావు-అమలాపురం, బి.మల్లిఖార్జునరావు-రాజమండ్రి-దేవాంగ, కటారి సత్యనారాయణరావు-గుడివాడ-యాదవ, పదసింగు లక్ష్మణరావు-మచి లీపట్నం-మత్స్యకార, అనగాని భగవంతరావు-కూచినపూడి-గౌడ, వి.రామానుజం-గుంటూరు-1-కళావంతుల, జి.కోటయ్య-చీరాల-పద్మశాలి, పీ.చెంచు రామయ్య-ఉదయగిరి-యాదవ, శేషన్న-డోన్‌-బోయ, కె.బినరసప్ప-ప్రత్తికొండ-కురుబ, పీ.సత్యనారాయణరాజు-ఎమ్మిగనూరు-బోయ, తిప్పేస్వామి-రాయదుర్గం-కురుమ, అగిశం వీరప్ప-నల్లమడ-పద్మశాలి.

ఇండిపెండెంట్‌ బీసీ ఎమ్మెల్యేలు-10

 • సీ.శ్యామలరావు-శ్రీకాకుళం-పొలినాటి వెలమ
 • పీ.శ్రీరామమూర్తి-నగరికటకం-కాళింగ
 • బి.హరియప్పడురెడ్డి- ఎచ్చర్ల-రెడ్డిక
 • చీకటిపరశు రామనాయుడు-పార్వతిపురం-కొప్పుల వెలమ
 • టీఎల్‌ నాయుడు-పెదమానాపురం-కొప్పలు వెలమ
 • పీ.సన్యాసిరావు-విశాఖ-2-నగరాలు
 • సీవికె.రావు-కాకినాడ-కళావంతుల
 • ఆమనగంటి శ్రీరాములు-ఏలూరు
 • బసప్ప-ఉరవకొండ- జంగమ
 • డి.వెంకటేశం-కుప్పం-గాండ్ల

షెడ్యూల్‌ కులాల ఎమ్మెల్యేలు-25
1972లో గెలిచిన ఎస్‌.సి ఎమ్మెల్యేలుగా గెలిచినవారిలో  ఒకరు తప్ప  మిగిలిన వారంతా కాంగ్రెస్‌ వారే కావడం విశేషం.

 • సుక్క పగడాలు-పాతపట్నం
 • కె.నరసయ్య-పాలకొండ
 • జీ.సూర్యనారాయణ-పాయకరావుపేట
 • జీ.మహాలక్ష్మి-నగరం
 • ఎస్‌.సత్తిరాజు-తాళ్లరేవు
 • ఎమ్‌.వి .ప్రసాదరావు-అల్లవరం, బత్తిన సుబ్బారావు-కడియం, జి.వెంకన్న-ఆచంట, కోట రామయ్య-తిరువూరు, కె.సోమేశ్వరరావు-నిడుమోలు,దాసరి ప్రకాశం-అద్దంకి (జనరల్‌) ఎస్‌.జీవరత్నంనాయుడు-ఒంగోలు, (జనరల్‌), ఆరేటి కోటయ్య-సంత నూతలపాడు, మంగళగిరి నానాదాస్‌-సర్వేపల్లి, పీ.వెంకటసుబ్బయ్య-సూళ్లూరుపేట, ఒ.వెంకట సుబ్బయ్య-వెంకటగిరి, గుంటి శ్రీరాములు-కోడూరు, డి.మునుస్వామి-కొడు మూరు, పీ.రాజరత్నరావు-ఆలూరు, ఎమ్‌.లక్ష్మీదేవి-కళ్యాణదుర్గం, ఎమ్‌. ఎల్లప్ప-మడకశిర, ఎమ్‌.మునుస్వామి-బంగారుపాళ్యం, సి.దాస్‌-సత్యవేడు, వి.మునిస్వామప్ప-వేపంజేరి

ఇండి-1
ఎస్‌.వెంకటరావు-గోపాలపురం

షెడ్యూల్‌ జాతులకు చెందిన ఎమ్మెల్యేలు..7
కాంగ్రెస్‌-5: జన్ని ముత్యాలు-సాలూరు,వి.రామన్న పడాల్‌-చింతపల్లి, టి.చిట్టినాయుడు-పాడేరు, టి.రత్నబాయి-ఎల్లవరం, కె.రాములు-పోలవరం.
ఇండి-2: వి.నరసింహరావు-కొత్తూరు, వి.చూడామణి   దేవ్‌-నాగూరు

క్షత్రియ...10
కాంగ్రెస్‌: పీ.సాంబశివరాజు-సతివాడ, కెపిఆర్‌ఎస్‌ పద్మనాభ రాజు-ఎస్‌.కోట, డి.సూర్యనారాయణ-బీమిలి, రాజా సాగి సూర్యనారాయణరాజు-నర్సీపట్నం, ఎన్‌.విజయలక్ష్మి-తుని, కె.విజయనరసింహరాజు-అత్తిలి, బి.విజయకుమార్‌ రాజు-భీమవరం, సిహెచ్‌ విపి మూర్తిరాజు-ఉంగుటూరు, ఇవి గోపాలరాజు-నగరి, బి.సుందరమ్మాళ్‌-పుంగనూరు.
ఇండి-2: ఎ.ఎస్‌.ఆర్‌.ఉప్పలపాటి-జామి,ఇండి-కెవి కాకర్లపూడి-యలమంచిలి

ముస్లిం ఎమ్మెల్యేలు..7
కాంగ్రెస్‌: ఎమ.ఆర్‌.డీన్‌-విశాఖ-1, ఎ అసిఫ్‌ పాషా-విజయవాడ-1, పీ.ఉన్నీసాబేగం-పెదకూరపాడు, ఎమ్‌.ఎన్‌.బేగ్‌-మార్కాపురం, ఎమ్‌.హబీబుల్లా-రాయచోటి, రెహ్మాన్‌ ఖాన్‌-కర్నూలు, ఎమ్‌.సైఫుల్లా బేగ్‌-పీలేరు

బ్రాహ్మణ వర్గం ఎమ్మెల్యేలు..11
కాంగ్రెస్‌: కె.ఎ.భుక్త-హరిశ్చంద్రపురం, భాట్టం శ్రీరామమూర్తి-పరవాడ, డి.భానుతిలకం-కొత్తపేట, చెరుకువాడ వెంకటరత్నం-సంపర, పరకాల శేషావతారం-నరసాపురం, డి.రామారావు-విజయవాడ తూర్పు, కోన ప్రభాకరరావు-బాపట్ల, గాదె వీరాంజనేయ శర్మ-గుంటూరు-2, ఆర్‌.సీతారామయ్య-కమలాపురం, హెచ్‌.సత్యనారాయణ-ఆదోని, ఎ.నర్సింగరావు-మదనపల్లె

వెలమ..3
సీవి కృష్ణారావు-బొబ్బిలి, డి.కోనేశ్వరరావు-చింతలపూడి  ఎమ్‌.రంగయ్యప్పారావు-నూజివీడు

క్రిస్టియన్‌ ...3
కాంగ్రెస్‌-టి.ఎస్‌.ఆనందాబాయి-గన్నవరం, చుక్కా పీటర్‌ పాల్‌-ప్రత్తిపాడు, విజయశిఖామణి-తిరుపతి
వైశ్య -1: కాంగ్రెస్‌- కొప్పరపు సుబ్బారావు-ప్రొద్దుటూరు


– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Advertisement
 
Advertisement
 
Advertisement