గోదావరిఖని: గతనెలలో బొగ్గు ఉత్పత్తి తగ్గింది కానీ, అనూహ్యంగా రవాణా పెరిగింది. అత్యధిక బొగ్గు ఉత్పత్తి చేయాల్సిన ఫిబ్రవరిలో బొగ్గు ఉత్పత్తి తగ్గడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. వందశాతానికి మించి ఉత్పత్తి చేయాల్సిన ఫి బ్రవరిలో కేవలం 60 శాతంతోనే సరిపెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు భిన్నంగా రవాణా వందశాతం పూర్తిచేశామని సింగరేణి యా జమాన్యం చెప్పడం గమనార్హం. బొగ్గు ఉత్పత్తి లక్ష్యంపై మీడియాకు వివరాలు వెల్లడించే సమయంలో కూడా నెలవారీ గణాంకాలు చెప్పలేదు. కానీ, వందశాతం బొగ్గు రవాణా చేసినట్లు అధికా రులు వివరించడంపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బొగ్గు ఉత్పత్తి 60 శాతం నమోదైదే.. వందశాతం రవాణా ఎలా జరిగిందనే ప్రశ్న కార్మిక సంఘాల నుంచి వస్తోంది. బొగ్గు ఉత్పత్తి, రవాణా, నిల్వలపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎండీ.. వ్యూ హాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్ప త్తి, రవాణా విషయంలో కచ్చితంగా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈక్రమంలో అన్నిఏరియాల్లో ఫిబ్రవరిలో బొగ్గు ఉత్పత్తి 60 శాతానికే పరిమితమైందని కొందరు అంటున్నారు.
బొగ్గు నిల్వలు క్లియర్?
ఏరియా టార్గెట్ సాధించింది శాతం
ఆర్జీ–వన్ 3.71 1.47 40
ఆర్జీ–టూ 10.27 5.54 54
ఆర్జీ–3 5.89 2.25 38
ఏపీఏ 1.43 0.16 12
భూపాలపల్లి 4.21 1.47 35
కొత్తగూడెం 1.51 0.12 8
సత్తుపల్లి 1.18 1.12 95
ఇల్లెందు 5.07 1.52 30
మణుగూరు 10.16 7.48 74
బెల్లంపల్లి 3.00 3.76 126
మందమర్రి 2.24 2.07 93
శ్రీరాంపూర్ 5.40 1.86 34
ఇదెలా సాధ్యమంటున్న కార్మిక సంఘాలు
బొగ్గు తవ్వకం, తరలింపుపై అనేక అనుమానాలు
స్టాక్ కోల్ క్లియర్ చేశామంటున్న సింగరేణి యాజమాన్యం


