రాగినేడు ప్రైమరీస్కూల్ భవనం శిథిలం కావడంతో కూల్చివేశారు. కొత్తగా రెండు గదులు నిర్మించేందుకు రూ. 18 లక్షలు మంజూరయ్యాయి. పనులు త్వరలోనే మొదలవుతాయి. ప్రస్తుతం ఉన్నగదితోపాటు అంగన్‌వాడీ ఆవరణలో బోధన సాగుతోంది.
– సురేందర్, ఎంఈవో, పెద్దపల్లి
జూన్ నాటికి కొత్తభవనం
ప్రైమరీ స్కూల్‌లో తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వీలైనంత త్వరగా పనులు ప్రారంభించి వచ్చే విద్యాసంవత్సరం వరకు గదులు నిర్మించాలి. స్కూల్‌లో సరైన వసతులు లేక విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అధికారులు చొరవ చూపాలి.
– సోమ కుమార్, సర్పంచ్, రాగినేడు


