టెన్త్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

టెన్త్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

Mar 4 2026 7:29 AM | Updated on Mar 4 2026 7:29 AM

● ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి

పెద్దపల్లి: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షల ని ర్వహణకు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏ ర్పాట్లు చేస్తోంది. ఈనెల 14 నుంచి ఏప్రిల్‌ 15వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. మొత్తం 7,495 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని అధికారులు తెలిపారు. వీరికోసం 41 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 29 ప్రభుత్వ, 12 ప్రై వేట్‌ సెంటర్లు ఉన్నాయి. ప్రశ్నాపత్రాలు ఇప్పటికే పోలీస్‌స్టేషన్లకు చేరాయి. అక్కడ వాటిని భద్రపర్చారు. 25 మంది దివ్యాంగ విద్యార్థులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. పరీక్ష కేంద్రాల వద్ద వారికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 8.30 గంటలకే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఉదయం 8.50 గంటలకు లోనికి అనుమతిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల నిర్వహణపై ఇన్విజిలేటర్లకు గతనెల 20 శిక్షణ ఇచ్చారు. ఈసారి నిర్దేశిత సమయం కన్నా ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్ష హాల్‌లోకి అనుమతిస్తారు. ఆ తర్వాత అనుమతించరు.

ప్రహరీ లేనిసెంటర్‌ వద్ద అదనపు ఏర్పాట్లు

జిల్లాలోని సెంటినరీకాలనీ సెంటర్‌కు ప్రహరీలేదు. అక్కడ అదనంగా ప్రత్యేక పోలీసు బందోబస్తు తోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జిరాక్స్‌ సెంటర్లతోపాటు కంప్యూటర్లు సెంటర్లు మూసిఉంచాలని పోలీసులు సూచించారు.

మూడు ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌

మూడు ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ను నియమించారు. అందులో గెజిటెడ్‌ ఆఫీసర్‌తోపాటు నాయబ్‌ తహసీల్దార్‌, ఏఎస్‌ఐ ర్యాంక్‌ గల అధికారులు ఉంటారు.

వందరోజుల ప్రణాళిక

టెన్త్‌లో అత్యధిక ఉత్తీర్ణత సాధించాలని అధికారు లు, ఉపాధ్యాయులు వందరోజుల ప్రణాళిక అమ లు చేశారు. గతంలోకన్నా ఈసారి ఉత్తీర్ణత అత్యధికంగా సాధిస్తారనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అందుబాటులో పారామెడికల్‌ సిబ్బంది

పరీక్ష కేంద్రాల వద్ద పారామెడికల్‌ సిబ్బందిని నియమించాలని జిల్లా వైద్యాధికారి ప్రమోద్‌ కుమార్‌ ఇప్పటికే పీహెచ్‌సీల డాక్టర్లకు సూచించారు.

ఏర్పాట్లు పూర్తి చేశాం

పదో తరతి వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తిచేశాం. ప్రశ్నాపత్రాలు ఇప్పటికే పోలీస్‌స్టేషన్లకు చేరాయి. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలి. – శారద, డీఈవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement