● రాగినేడు ప్రభుత్వ పాఠశాల తీరు
● మూడేళ్లుగా విద్యార్థులకు తప్పని తిప్పలు
విద్యార్థులకు పాఠం చెబుతున్న ఉపాధ్యాయుడు
కూలిన పాఠశాల గదులు
పెద్దపల్లిరూరల్: రాగినేడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అవసరమైన తరగతి గదులు లేక చెట్లకింద చదువుకోవాల్సిన దుిస్థితి నెలకొంది. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో అధికారులు దానిని కూల్చివేయించారు. కొత్త భవనం నిర్మిస్తామని చెప్పారు. మూడేళ్లు గడచినా ఆ దిశగా అడుగులు పడడం లేదు. పాఠశాలలో వసతులు లేవనే కారణంతో తమ పిల్లలను బడికి పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. ఉన్నవారికి తిప్పలు తప్పడంలేదు.
ఒకగది.. ఐదు తరగతులు
రాగినేడు ప్రాథమిక పాఠశాలలో దాదాపు 30మంది వరకు విద్యార్థులు ఉన్నారు. ఐదు తరగతుల విద్యార్థులకు ఒకేగదిలో బోధించలేక ఆవరణలోని చెట్ల కింద.. ఆరుబయటే విద్యాబోధన చేస్తున్నారు.


