మంథని: చంద్రగ్రహణ ప్రతిబింబాలు కనువిందు చేశాయి. మంత్రపురి సమీప గోదావరి తీరంలో చంద్రగ్రహణం విడిచే సమయంలో కారుమబ్బులు కమ్ముకున్నాయి. వాటినుంచి బయట వచ్చిన చంద్రున్ని చూసేందుకు పట్టణవాసులు ఆసక్తి చూపారు. చంద్రగ్రహణం పూర్తయ్యాక మంత్రపురివాసులు గోదావరిలో పవిత్ర స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. గ్రహణ సమయంలోనూ భగవత్ నామస్మరణలో ఉన్నారు.
‘ఎల్లంపల్లి’ సందర్శన
రామగుండం: అంతర్గాం మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టును డీసీపీ బూక్యా రాంరెడ్డి, ఏసీపీ రమేశ్, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై వెంకటస్వామి తదితరులు మంగళవారం సందర్శించారు. 2027 గోదావరి పుష్కరాల నేపథ్యలో ముందస్తుగా చేపట్టిన ఏర్పాట్లపై వారు పరిశీలన చేశారు. గోలివాడ గోదావరినది, ఎల్లంపల్లి ప్రాజెక్టు తీరాలు పరిశీలించారు. గోదావరి పుష్కరాల కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లు తదితర అంశాలపై సమగ్ర ప్రణాళిక రూపొందించనున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.
అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి నిరంతరం సరఫరా చేస్తామని ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ గంగాధర్ తెలిపారు. ప్రస్తుత వేసవిలో అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఇబ్బంది కలుగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఫ్యాన్లు బిగించి ఉక్కపోత బాధ లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పెద్దపల్లి సర్కిల్ పరిఽధిలో ఇప్పటివరకు 69 అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశామన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం లేనివాటిని గుర్తించామన్నారు. వాటికి కొత్తగా కనెక్షన్లు మంజూరు చేయడంతోపాటు అంతర్గత వైరింగ్, ఇతర సదుపాయాలు వేగంగా సాగుతున్నాయని ఆయన వివరించారు.
జాతీయస్థాయి వేడుకలకు ఎంపిక
ఓదెల(పెద్దపల్లి): కొలనూ ర్ గ్రామపంచాతీ పరిధి లోని లైన్‌మన్ మునీశ్వర్ ఈనెల 7న న్యూఢిలీలో జరిగే దివస్ వేడుకలకు ఎంపికయ్యారు. ఈమే రకు ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆయన ఎంపికపై ట్రాన్స్‌కో సిబ్బంది, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
అమెరికా దాడిని ఖండించాలి
పెద్దపల్లి: ఆయిల్ లావాదేవీలపై ఆధిపత్యం కోసమే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దురాక్రమణదాడులు చేస్తున్నాయని, వీటిని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని సీపీఐ(ఎంఎల్) మాస్ ప్రజాపంథా ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ కోరారు. ప్రపంచ వనరులు కొల్లగొట్టడానికి, వాణిజ్య, రాజకీయ, ఆర్థిక ఆధిపత్యం కోసం అమెరికా, ఇజ్రాయెల్ మారణహోమం సృష్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు. వెంటనే యుద్ధం ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.


