ఓదెల మల్లికార్జునస్వామి ఆలయం మూసివేస్తున్న అర్చకులు
కమాన్‌పూర్ శ్రీఆదివరాహస్వామి ఆలయాన్ని మూసివేస్తున్న అర్చకులు
మంథని/ఓదెల/కమాన్‌పూర్: చంద్రగ్రహణం సందర్భంగా జిల్లాలోని పలు ఆలయాలను మంగళవా రం ఉదయం మూసివేశారు. సంప్రోక్షణ అనంత రం బుధవారం ఉదయం భక్తులకు దర్శన అవకా శం కల్పిస్తారు. ఓదెల మల్లికార్జునస్వామి ఆలయా న్ని మూసివేయడంతో అప్పటికే చేరుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలో బసచేశారు. అదేవిధంగా మంత్రపురి(మంథని)లోని దేవాలయాలను మూసివేశారు. వేదాలకు పుట్టినిల్లు కావడంతో వేదపండితులు శాస్త్రోక్తంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కమాన్‌పూర్ మండల కేంద్రంలోని శ్రీఆదివరాహస్వామి, శివాలయం, హనుమాన్ ఆలయాలను మూసివేశారు.


