సర్పంచులపైనే ఆధారం
● హైకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ● సర్పంచులకు సన్మానం
పెద్దపల్లి: బహుజన భావజాలం పల్లెలకు విస్తరించడంలో సర్పంచులే అత్యంత కీలకమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జ స్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. జిల్లాకు చెందిన బ డుగు, బలహీనవర్గాల సర్పంచులను మాజీ జెడ్పీటీసీ గోపగాని సారయ్యగౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలో సన్మానించారు. బహుజన ప్రజాస్వామిక వేదిక అధ్యక్షుడు తాడూరి శ్రీమన్నారాయణ అధ్యక్షత వహించారు. జస్టిస్ చంద్రకుమా ర్ మాట్లాడుతూ, సర్పంచులపై ప్రభుత్వం భారమై న బాధ్యత మోపిందని, చట్ట పరిధిలో పాలన సాగించాలన్నారు. ఏటా ఆడిట్ నివేదిక పంపించకుంటే సర్పంచ్‌ను కలెక్టర్ సస్పెండ్ చేయవచ్చనే చట్టం పొందుపరిచారని తెలిపారు. ఆర్నె ల్లుగా ఆరోగ్య సమస్యలతో బాధపడే మహిళా సర్పంచులకు ప్రమాదమేమీలేదన్నారు. మాజీ ఎంపీపీ సంధవేణి సునీత, రచయిత ఏలేశ్వరం వెంకటేశ్వర్లు, వివేక్ పటేల్, కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు రామస్వామి, రైతుసంఘం నాయకుడు మల్లన్నతోపాటు భీమోదు సురేందర్, బూతగడ్డ సంపత్, బొడ్డుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


