విద్యా ప్రమాణాలు మెరుగుపర్చాలి
రామగిరి(మంథని): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కనీస విద్యా ప్రమాణాలు మెరుగుపర్చాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. చందనపూర్ ప్రభుత్వ పాఠశాల, రత్నాపూర్ ఆర్ అండ్ ఆర్ కాలనీ, ప్రాథమికోన్నత పాఠశాలలను ఆయన మంగళవారం పరిశీలించి పలు సూచనలు చేశారు. లద్నాపూర్ ఆర్ అండ్ ఆర్ కాలనీవాసుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. తహసీల్దార్ సుమన్, ఎంపీడీవో శైలజారాణి, పీఆర్ డీఈ అప్పలనాయుడు, సింగరేణి అధికారులు ఐలయ్య, రాజిరెడ్డి, మణిదీప్‌రెడ్డి, ఏఈలు వరలక్ష్మి, జగదీశ్, సర్పంచులు పల్లె ప్రతిమ, వనం రాంచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. కాగా, లక్ష్మీనగర్ ఆర్ అండ్ ఆర్ కాలనీలో కలెక్టర్ శ్రీహర్ష పర్యటించారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా అభివృద్ధిపై వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో కలెక్టర్ గ్రామాన్ని పరిశీలించారు. తహసీల్దార్ సుమన్ తదితరులు పాల్గొన్నారు.
భవన నిర్మాణం పూర్తిచేయాలి
కమాన్‌పూర్(మంథని): మండల కేంద్రంలో చేపట్టిన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణాన్ని రెండు నెలల్లోగా పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అదేశించారు. నూతన భవన నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ వాసంతి, పీఆర్‌డీఈ, ఏఈలు అప్పలనాయుడు, జగదీశ్ పాల్గొన్నారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష


