10న తుది ఓటరు జాబితా
పెద్దపల్లి: జిల్లాలోని పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో తుది ఓటరు జాబితాను ఈనెల 10న విడుదల చేస్తామని అదనపు కలెక్టర్ వేణు తెలిపారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఓటరు జాబితా తయారీపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. వేణు మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల వారీగా ఈనెల 1న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేశామన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో 60 డివిజన్లు, పెద్దపల్లిలో 36 వార్డులు, సుల్తానాబాద్‌లో 15, మంథనిలోని 13 వార్డుల్లో 2,58,059 మంది ఓటర్లు ఉన్నట్లు డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో వెలువరించామని వివరించారు. ముసాయి దా ఓటరు జాబితా పరిశీలించి అభ్యంతరాలు ఉంటే తమకు తెలపాలని కోరారు. వాటిని పరిష్కరించి ఈనెల 10వ తేదీన తుది ఓటరు జాబితా వి డుదల చేస్తామని అదనపు కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్‌లు వెంకటేశ్, మనోహర్, రాజకీయ పార్టీ ప్రతినిధులు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ వేణు


