నాసిరకమని నాడే చెప్పా
● మంత్రి శ్రీధర్‌బాబు
మంథని: గత ప్రభుత్వం చెక్‌డ్యాంలను అశాసీ్త్రయంగా, నాసిరకంగా నిర్మిస్తోందని తాను ఎమ్మెల్యేగా ఉన్నసమయంలోనే వెల్లడించానని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. శాసనసభలో ఈ విషయం గురించి సుదీర్ఘంగా తాను మాట్లాడానని గుర్తుచేశారు. దానిఫలితం ఇప్పుడు కనిపిస్తోందన్నారు. అడవిసోమన్‌పల్లి మానేరులో ఇటీవల కూలిన చెక్‌డ్యాంను మంగళవారం మంత్రి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నాటి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట మూడు బ్యారేజీలు, మానేరుపై రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన చెక్‌డ్యాంలు ని ష్ప్రయోజనంగా మారాయన్నారు. చెక్‌డ్యాంలు కూ లిన ఘటనపై నీటిపారుదల మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారనిమంత్రి తెలిపారు. నివేదికను కూడా త్వరగా బయట పె ట్టాలని ఆయన అన్నారు. తద్వారా బాధ్యులపై చర్యలు ఉంటాయని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఈఈ బలరామయ్య, డీఈఈ రమేశ్‌బాబు, నాయకులు సెగ్గెం రాజేశ్, గట్టు దామోదర్, శశిభూషణ్ కాచే, కుడుదుల వెంకన్న, తొట్ల తిరుపతి యాదవ్, ఐలి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


