పేదల జీవితాల్లో వెలుగులు
● ఉచితంగా నేత్రశస్త్రచికిత్సలు ● ఉమ్మడి జిల్లాలో రోజూ శిబిరాలు
పెద్దపల్లి: పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు లయన్స్ క్లబ్ సంస్థవారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన అభాగ్యులకు అండగా ఉంటున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు పథకం ద్వారా ప్రత్యేక వైద్య నిపుణుల సాయంతో వేలాదిమందికి కంటి పరీక్షలు చేశారు. సమస్య తీవ్రంగా ఉన్నవారిని గుర్తించి అందులో 23,485 మందికి ఉచితంగా శస్త్రచికిత్స చేసి వెలుగులు నింపారు. దాతల సాయంతో 63,743 మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. మంథనిలో రోజూ ఉచితంగా కంటి పరీక్షలు చేస్తున్నారు. దీంతోపాటు లక్సెట్టిపేట, పరకాలలో ప్రతీ మంగళవారం, బుధవారం కోరుట్ల, నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో, గురువారం పెద్దపల్లిలో, శనివారం కాటారం, ఆసిఫాబాద్‌లో, ఆదివారం కొత్తపల్లి హవేలి, బె ల్లంపల్లిలో ఉచిత సేవలు అందిస్తున్నారు.


