రాజన్న ఎన్‌కౌంటర్‌కు 40 ఏళ్లు
ఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి ప్రాంతంలోని రెబ్బల్‌దేవులపల్లి గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓదెల మండలం కొలనూర్ గ్రామానికి చెందిన అ ప్పటి పీపుల్స్‌వార్, ప్రస్తు త మావోయిస్టు పార్టీకి చెందిన దళనేత తుంగాని రాజన్న ఉరఫ్ గోపన్న చనిపోయిన ఆదివారం నాటికి 40 ఏళ్లు. పీడిత, తాడిన ప్రజల పక్షాన పెద్దపల్లి గడ్డపై గళమెత్తిన ధీరుడు రాజన్న. దొరలను గడగడలాడించిన వీరుడు. సుల్తానాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రెబ్బల్‌దేవులపల్లిలోని ఓ ఇంట్లో తుంగాని రాజన్న ఉరఫ్ గోపన్నతోపాటు ధర్మారం మండలం ఖానంపల్లికి చెందిన చంద్రయ్య ఉరఫ్ శీనన్న షెల్టర్ తీసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసు బలగాలు రాజన్న, శీనన్న షెల్టర్ తీసుకున్న గుడిసెను చుట్టుముట్టారు. ఇరువర్గాల మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభం కావటంతో తొలు కానిస్టేబుల్ నర్సయ్య మృతిచెందారు. ఆగ్రహం చెందినపోలీసులు.. గుడిసైపె పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆనాటి జ్ఞాపకాలు జిల్లా ప్రజల మదిలో ఇంకా మెదలుతూనే ఉన్నాయి. రాజన్న చనిపోయిన 40 ఏళ్లు కావడంతో భార్య తుంగాని రాధక్క, కూతురు క్రాంతి, కుటుంబసభ్యులు ఆయనను స్మరించుకున్నారు. కుటుంబ సభ్యున్ని కోల్పోయి కన్నీటిపర్యంతమయ్యారు.
స్మరించుకున్న కుటుంబసభ్యులు


