చెక్‌డ్యాం పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు
మంథనిరూరల్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమన్‌పల్లి చెక్‌డ్యాంను ఫోరెన్సిక్ నిపుణులు శనివారం సాయంత్రం పరిశీలించారు. మూడురోజుల క్రితం చెక్‌డ్యాం కూలిపోగా ఇరిగేషన్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఫోరెన్సిక్ నిపుణులు చెక్‌డ్యాం సందర్శించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. మానేరులో పడిపోయిన గోడ బండరాళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. శాంపిళ్లు సేకరించారు. స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి వాటిని పరీక్షిస్తామని, నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని డీఎస్పీ తెలిపారు.


