జాతీయ నాయకుల ఫొటోలకు రక్తాభిషేకం
ఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు గొస్కె రాజేశం ఆ పార్టీ జాతీయకులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క చిత్రపటాలకు శనివారం రక్తాభిషేకం చేశారు. చాలా ఏళ్లుగా కాంగ్రెస్‌లో కార్యకర్త నుంచి జిల్లా అధికార ప్రతినిధిస్థాయికి ఎదిగానని, అయినా, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తనకు మద్దతు ఇవ్వకుండా మరోవ్యక్తికి మద్దతు ఇచ్చి ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలిపించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మడక పంచాయతీ ఎస్సీ కేటగిరీకి రిజర్వేషన్ చేశారని, 300 కుటుంబాలు కలిగిన తమకు అన్యాయం చేశారని అన్నారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తిని సర్పంచ్ చేశారని రాజేశం పేర్కొన్నారు. కొందరు ప్రభుత్వ స్థలాలను అన్యాక్రాంతం చేశారని, వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే పెద్దలు కాపాడరని ఆరోపించారు. అనంతరం రోడ్డుపై కాలనీవాసులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో సీనియర్ నాయకులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందారు.
విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం
మంథనిరూరల్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులో కరెంట్ షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు కాలిపోయింది. భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. బాధితులు తెలిపిన వివరాలు. ఇందారపు విజయ్ ఇంటిలో రాచమల్ల శివకుమార్ అద్దెకు ఉంటున్నారు. ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లిన క్రమంలో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో సర్పంచ్ దండవేన సంధ్యబానేశ్ వెంటనే మంథని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే వస్తువులు, బంగారం, నగదు, బట్టలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఇంటి యజమానికి రూ.15లక్షలు, అద్దెకు ఉండే శివకుమార్‌కు రూ.5లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లింది. సర్వం కోల్పోయిన శివకుమార్‌తోపాటు ఓనర్ విజయ్‌ను ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ కోరారు.
ప్రయాగ్‌రాజ్‌కు మరిన్ని ప్రత్యేక రైళ్లు
రామగుండం: ధనుర్మాసం సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసే భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు మరిన్ని రైళ్లను నడిపిస్తున్నట్లు ప్రకటించారు. ఈనెల 23, 24, 25, 26వ తేదీల్లో 07402/03/04/05 రైళ్లు ప్రయాగ్‌రాజ్‌కు నడుస్తాయన్నారు. ఇవి చర్లపల్లిలో రాత్రి 7.45గంటలకు బయలుదేరి కాజీపేటకు రాత్రి 9.42 గంటలకు, పెద్దపల్లికి రాత్రి 11.50గంటలకు, మంచిర్యాలకు అర్ధరాత్రి 12.35గంటలకు చేరుకుంటాయన్నారు. రెండోరోజు వేకువజామున 4.30గంటలకు ప్రయాగ్‌రాజ్ చేరుకుంటాయని వివరించారు.
జాతీయ నాయకుల ఫొటోలకు రక్తాభిషేకం


