చలితీవ్రతకు వ్యక్తి మృతి
రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని ఏ–పవర్‌హౌస్ చమన్ పరిసరాల్లోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి చనిపోయి కనిపించాడు. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి చలితీవ్రతకు మృతిచెంది ఉంటాడని భాస్తున్నట్లు స్థానిక కాంగ్రెస్ నాయకుడు సలీంబేగ్ తెలిపారు. ఈమేరకు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సంధ్యారాణి శనివారం ఆ మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బంధువులు ఉంటే 87126 56525 నంబరుకు ఫోన్‌చేసి సమాచారం అందించాలని ఎస్సై కోరారు.
పరిశుభ్రతపై దృష్టి
పెద్దపల్లిరూరల్: గ్రామాల పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని డీపీవో వీరబుచ్చయ్య అన్నారు. హన్మంతునిపేట పంచాయతీని ఆయన శనివారం సందర్శించారు. రికార్డులు తనిఖీ చేశారు.
ముందస్తు క్రిస్మస్ వేడుకలు
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి లో శనివారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. సూపరింటెండెంట్ శ్రీధర్ కేక్‌కట్ చేశారు. ఆర్‌ఎంవో విజయ్‌కుమార్, నర్సింగ్ సూపరింటెంటెండెంట్ అనిత ప్రియదర్శిని, పద్మ, హెడ్‌నర్స్ బేబీరాణి, భవాని ఉన్నారు.
హత్యాయత్నం కేసులో జైలు
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన మర్రి కుమార్‌పై హత్యాయత్నం చేసిన అల్లంల మధునయ్యకు 10నెలల జైలుశిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి సునీత శనివారం తీర్పు ఇచ్చారని ఎస్సై వెంకటేశ్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గౌడ రాజమ్మ 11వ రోజు కర్మకు వెళ్లిన మర్రి కుమార్.. అల్లంల మధునయ్య మధ్య గొడవ జరిగింది. గొడవను మనసులో పెట్టుకున్న అల్లంల మధునయ్య.. గత ఫిబ్రవరి 3వ తేదీన మర్రి కుమార్‌పై వెంట తెచ్చుకున్న స్క్రూ డ్రైవర్‌తో దాడి చేశాడు. అంతటితో ఆగకుండా బీరుసీసాతో కొట్టాడు. గాయపడిన కుమార్‌ను స్థానికు ఆస్పత్రికి తరించారు. బాధితుడి మేనల్లుడు ఒజ్జె శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్సై.. విచారణ అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. వరువర్గాల వాదనలు విన్న జడ్జి.. జైలుశిక్షతోపాటు జరిమానా విధించారు.
చలితీవ్రతకు వ్యక్తి మృతి
చలితీవ్రతకు వ్యక్తి మృతి


