బీటెక్ చేసి.. గ్రూప్–3 సాధించి
రామడుగు: మండలంలోని గోపాల్‌రావుపేటకు చెందిన పైండ్ల శ్రీకాంత్ గ్రూప్–3 ఉద్యోగం సాధించారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. గతంలో గ్రూప్–4 ఉద్యోగం సాధించిన శ్రీకాంత్ గ్రూప్–3లోనూ ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు పైండ్ల అంజయ్య–శాంత. బీటెక్ పూర్తి చేశారు.
వల్లంపట్ల యువకుడి ప్రతిభ
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని వల్లంపట్లకు చెందిన ఎర్రం రఘు గ్రూపు–3 ఉద్యోగానికి ఎంపికయ్యాడు. మారుమూల గ్రామం వల్లంపట్లకు చెందిన యువకుడు కార్మిక ఉపాధి కల్పన శాఖలో ఉద్యోగం సాధించడంతో గ్రామస్తులు అభినందిస్తున్నారు. నిరుపేద కుటుంబమైనప్పటికీ కష్టపడి తల్లి చదివించింది. తల్లి కష్టానికి రఘు ఫలితం దక్కించారు.


