ప్రాజెక్టుకు ఓకే.. ప్రయోజనం లేకే..
రామగిరి(మంథని): రామగుండం కోల్‌మైన్స్(బాహుబలి) ప్రాజెక్టు ఏర్పాటుపై శుక్రవారం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంతంగా ముగిసింది. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో అధికారి భిక్షపతి అధ్యక్షతన పన్నూర్ జేఎన్టీయూలో సభ నిర్వహించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత సింగరేణి రామగుండం–3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు ప్రాజెక్టు వివరాలు వెల్లడించారు. అనంతరం కలెక్టర్, మాట్లాడుతూ, ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ప్రజలు లేవనెత్తిన సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. రామగిరి మండలం పన్నూరు, నాగేపల్లి, లద్నాపూర్, రత్నాపూర్, బుధవారంపేట, కమాన్‌పూర్ మండలం జూలపల్లి, ములకలపల్లి, వకీల్‌పల్లి గ్రామాల సమీపంలో 4,326 హెక్టార్ల విస్తీర్ణంలో బాహుబలి ఓపెన్‌కాస్ట్ మైనింగ్ కోసం రూ పొందించిన డీపీఆర్‌పై ప్రజాభిప్రాయం సేకరిస్తున్నామని ఆయన తెలిపారు. వచ్చే 40ఏళ్లపాటు బొగ్గు ఉత్పత్తికి ఇబ్బందులు కలుగకుండా రామగుండంలో ఏర్పాటయ్యే తెలంగాణ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేసేలా ఓపెన్‌కాస్ట్ మైనింగ్ పనిచేస్తుందని కలెక్టర్ చెప్పారు. ఆర్డీవో సురేశ్, ఏపీఏ, ఆర్జీ–1, 2, ఎన్విరాన్‌మెంట్ జీఎంలు నాగేశ్వరరావు, లలిత్‌కుమార్, వెంకట య్య, సైదులు, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నా యకులు వాసిరెడ్డి సీతారామయ్య, బి.జనక్ ప్రసా ద్, పర్యావరణ అధికారి రాజారెడ్డి, పర్సనల్ మేనేజర్ సుదర్శనం, తహసీల్దార్ సుమన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీబందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రాజెక్టుకు ఓకే.. ప్రయోజనం లేకే..
ప్రాజెక్టుకు ఓకే.. ప్రయోజనం లేకే..


