ప్రజారోగ్యాన్ని కాపాడాలి
సింగరేణి ఓసీపీలతో దుమ్ము, ధూళి వస్తున్నది. ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. గాలిలో నాణ్యత మెరుగుకు ఎస్‌జీడీ యూనిట్లు నిర్మించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అవి అమలు కావడం లేదు. ఏక్యూఐలో తప్పుడు సంఖ్య నమోదు చేస్తున్నారు. వాయు కాలుష్యాన్ని నియంత్రించి, ప్రజారోగ్యానికి పెద్దపీట వేయాలి.
నిరుద్యోగులకు అన్యాయం
సింగరేణి ప్రభావిత ప్రాంతా ల నిరుద్యోగులకు ఉపాధి కల్పనలో అన్యాయమే జరుగుతోంది. గత ప్రజాభిప్రా య సేకరణ సందర్భంగా ఇదేవిషయాన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చాం. అయినా ఉపయోగం లేకుండా పోతోంది. ఇప్పుడు జరుగుతున్న కాంట్రాక్టు నియా మకాల్లో ప్రభావిత ప్రాంతాల నిరుద్యోగులు లేరు. అందరూ ఇతర ప్రాంతాల వారే.
– మబ్బు శంకర్, అక్కెపల్లి
అభివృద్ది సంగతేమిటి?
రామగుండం కోల్‌మైన్స్ ప్రాజెక్టు ఏర్పాటు మాకు అంగీకారమే కానీ.. భూములను కోల్పోతున్న మా సంగతేమిటి? ఓసీపీలతో నష్టం జరుగుతున్నా.. మా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని మద్దతిస్తున్నాం. పరిసర ప్రాంతాలు, ఆర్‌అండ్‌ఆర్ కాలనీల్లో మౌలికవసతులు కల్పించాలి. సింగరేణి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం మానుకోవాలి.
– కె.అభిలాష్, బుధవారంపేట
ప్రమాణాలు మెరుగుపర్చాలి
ఓసీపీలతో ప్రజల సగటు జీ వన ప్రమాణాలు పడిపోతున్నాయి. గాలి, నీరు, ధ్వని కాలుష్యం పెరిగిపోతోంది. విపరీతమైన కాలుష్యంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. బొ గ్గు రవాణా చేసే లారీలు నిబంధనలు పాటించడంలేదు. అధికారులూ పట్టించుకోవడం లేదు. జీవన ప్రమాణాలు మెరుపర్చాలి.
– సీహెచ్ లింగమూర్తి,
జాతీయ కార్యదర్శి, సదాశయ ఫౌండేషన్
ప్రజారోగ్యాన్ని కాపాడాలి
ప్రజారోగ్యాన్ని కాపాడాలి
ప్రజారోగ్యాన్ని కాపాడాలి


