జాతర పనులు పూర్తిచేయాలి
గోదావరిఖని: గోదావరి తీరంలోని సమ్మక్క– సారలమ్మ జాతర వద్ద సుమారు రూ.6కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. సమ్మక్క గద్దెలను కలెక్టర్ గురువారం సందర్శించారు. మున్సిపల్, ఎన్టీ పీసీ, సింగరేణి అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తిచేయాలన్నారు. వచ్చే ఏడాది జనవరి 28, 29, 30, 31వ తేదీల్లో గిరిజన దేవతల జాతర జరుగుతుందని అన్నారు. గోదావరినది ఒడ్డున ఉన్న శ్మశానవాటిక అభివృద్ధి కోసం డీపీఆర్ తయారు చేయాలని సూచించారు. అశోక్‌నగర్ బాలికల హైస్కూల్ అభివృద్ధికి రూ.కోటి మంజూరు చేశామని, డిజైన్ ప్రకారం నెల రోజుల్లోగా పనులు పూర్తిచేయాలన్నారు. ఆర్జీ –వన్ జీఎం లలిత్‌కుమార్, సింగరేణి శ్రీనివాస్ పాల్గొన్నారు.
22లోగా ప్రతిపాదనలు పంపించాలి
పెద్దపల్లి: జిల్లాలోని గోదావరిఖని, గోలివాడ ప్రాంతాల్లో జరిగే సమ్మక్క – సారలమ్మ జాతర ఏర్పాట్లపై ఈనెల 22లో ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. తన కార్యాలయంలో జాతర నిర్వహణపై ఆయన సమీక్షించారు. పారిశుధ్యం నిర్వహణ, రోడ్లు, విద్యుత్, తాగునీరు, సిబ్బందికి భోజన వసతి తదితర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఆర్డీవో గంగయ్య, కరీంనగర్ దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష


