అయ్యో.. పాపం
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం గోపయ్యపల్లి, ముత్తారం, రాఘవాపూర్ సర్పంచ్ పదవికి గత ఎన్నికల్లో పోటీపడి పరాజితులైన అభ్యర్థులే ఈసారి మళ్లీ బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. గోపయ్యపల్లి పంచాయతీ సర్పంచ్‌కు పోటీపడ్డ బానోత్ అంజినాయక్ గత ఎన్నికల్లో అత్యల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఈసారి ఓటర్లు కరుణించి సర్పంచ్ పీఠం అధిష్టించే అవకాశాన్ని కల్పించారు. రాఘవాపూర్ సర్పంచ్ స్థానానికి పోటీపడ్డ తాడిచెట్టి చామంతి భర్త శ్రీకాంత్ గతంలో సర్పంచ్, ఎంపీటీసీగా ఓడిపోయారు. ఈసారి మహిళలకు అవకాశం దక్కడంతో ఆయనభార్య చామంతిని బరిలో నిలిపి ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. ఓటర్లు శ్రీకాంత్‌పై సానుభూతిని చూపి ఆయన సతీమణి చామంతిని ప్రథమ పౌరురాలిగా ఎన్నుకున్నారు. ముత్తారం పంచాయతీ సర్పంచ్ స్థానానికి గతంలో పోటీపడ్డ మాజీ ఎంపీటీసీ నల్లగొండ కుమార్.. ఈసారి మళ్లీ బరిలోకి దిగి ప్రజలతో తన బాధను పంచుకున్నారు. సోషల్‌మీడియాలో చేసిన ప్రచారం చూసిన ఓటర్లు సానుభూతితో కుమార్‌ను సర్పంచ్‌గా అవకాశం కల్పిస్తూ తీర్పునిచ్చారు. ఏదేమైనా ఈసారి కొందరు అభ్యర్థులకు సెంటిమెంట్ పవనాలు వీయడంతో సర్పంచ్ గిరీ దక్కిందంటూ చర్చించుకుంటున్నారు.
ఫలించిన సానుభూతి మంత్రం గత ఎన్నికల పరాజితులు.. నేడు విజేతలు
అయ్యో.. పాపం
అయ్యో.. పాపం


