మెడికల్ కాలేజీలో ప్రవేశాలు
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం ప్రభుత్వ మెడికల్ కాలేజీ(సిమ్స్)లో పీజీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ముందుకు వచ్చారు. నాలుగు కోర్సుల్లో 16 పీజీ సీట్లు ఉండగా ప్రస్తుతం 12 మంది చేరడానికి కౌన్సెలింగ్‌లో ఆప్షన్ ఎంచుకున్నారు. 50 శాతం సెంట్రల్ కోటాలో 8 పీజీ సీట్లు ఉండగా ఇప్పటివరకు ఆరుగురు, మరో 50 శాతం స్టేట్ కోటాలో 8 సీట్లు ఉండగా ఇందులో కూడా ఆరుగురు విద్యార్థులు కౌన్సెలింగ్‌లో రామగుండం మెడికల్ కాలేజీని ఎంపిక చేసుకున్నారు. ఇంకా నాలుగు సీట్లు ఖాళీగా ఉన్నాయని, ఇవికూడా కౌన్సెలింగ్ పూర్తయ్యేలోగా భర్తీ అవుతాయని ప్రిన్సిపాల్ నరేందర్ తెలిపారు. బుధవారం స్టేట్ కోటాలో వచ్చిన ఇద్దరు విద్యార్థులు కాలేజీలో జాయిన్ అయ్యారు. వారిలో ఆర్థోపెడిక్ జి.హర్షిల్, ఎమర్జెన్సీ మెడిసిన్ డి.వరెన్య సిమ్స్‌లో చేరారు. వీరికి ప్రిన్సిపాల్ జాయినింగ్ ఆర్డర్లు అందజేసి అభినందించారు. ఈనెల 25 వరకు సెంట్రల్ కోటా కౌన్సెలింగ్ గడువు ఉండగా, గురువారం వరకు స్టేట్ కోటా కౌన్సెలింగ్ ప్రక్రియకు గడువు ముగుస్తుందని ప్రిన్సిపాల్ వెల్లడించారు. వైస్ ప్రిన్సిపాల్ లావణ్య, డాక్టర్లు ప్రదీప్, భానులక్ష్మి, ఓబులేశ్ తదితరులు పాల్గొన్నారు.


