ప్రభుత్వ ఆస్పత్రిలో గైనిక్ సేవలు
మంథని: స్థానిక మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో మంగళవారం సీ్త్ర వైద్య నిపుణురాలు ఆధ్వర్యంలో గైనిక్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గత డి సెంబర్‌లో ఇక్కడి సీ్త్ర వైద్య నిపుణురాలు రెగ్యులర్ జాబ్‌కు వెళ్లడంతో ఎంసీహెచ్‌లో ఆ సేవలు నిలిచిపోయాయి. సీ్త్రవైద్య నిఫుణులు లేక సుమారు మూ డు నెలలుగా మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలో సీ్త్రవైద్య నిపుణురాలుగా సోనిని నియమిస్తూ కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఆస్పత్రిలో గైనిక్ సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి. మహిళా పేషెంట్లకు మెరుగైన సేవలు అందిస్తారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
కొందరి కోసమే వంతెన నిర్మాణం
మంథని: బంధువర్గ ప్రయోజనాల కోసమే గోదావ రి నదిపై వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు విమర్శించారు. పట్టణ సమీపంలోని గోదావరి నదీతీరంలో బ్రిడ్జి నిర్మాణ ప్రతిపాదిత ప్రదేశంలో మంగళవారం ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచిర్యాల జిల్లా శివ్వారం నుంచి మంథని మధ్య గల గోదావరి నదిపై నిర్మించే వంతెనతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. కూచిరాజ్‌పల్లి స మీపంలో 50 ఎకరాలు ఉన్నాయని, రియల్ ఎస్టేట్ లో వాటి ధరలు పెంచేందుకే బ్రిడ్జి నిర్మాణం చేపట్టారని ఆయన ఆరోపించారు. నాయకులు ఏగోళపు శంకర్‌గౌడ్, తగరం శంకర్‌లాల్, ఆరెపల్లికు మార్, కనవేన శ్రీనివాస్, రవీందర్, శేఖర్ ఉన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో గైనిక్ సేవలు


