కొత్తపల్లి: వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ మైదానంలో శుక్రవారం శ్రీఫ్లిక్కర్‌శ్రీ పేరిట నిర్వహించిన భగత్‌నగర్ అల్ఫోర్స్ ఈటెక్నో స్కూల్ వార్షికోత్సవం సందడిగా సాగింది. వేడుకలను ఎస్సారార్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ వి.మధుసూదన్‌రెడ్డితో కలిసి అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్‌రెడ్డి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ 35ఏళ్లుగా అల్ఫోర్స్ విద్యా సంస్థల ద్వారా రాష్ట్ర విద్యారంగానికి విశిష్ట సేవలు అందిస్తూ తలమానికంగా నిలుస్తున్నామని తెలిపారు. అల్ఫోర్స్ ఈటెక్నో పాఠశాల, కళాశాలలో విద్యనభ్యసించిన హర్షిత్‌రెడ్డి ఇటీవల గేట్–2025లో ఆల్‌ఇండియా 60వ ర్యాంకు సాధించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
బిల్లుల కోసం మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు
కరీంనగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన నిర్వహిస్తున్నదా లేక రాక్ష స పాలన సాగిస్తున్నదా అని మాజీ స ర్పంచుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు లక్ష్మీరాజం ప్రశ్నించా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ అభివృద్ధి బి ల్లుల విడుదలకు మోకాలడ్డుతున్న ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తప్పుబడుతూ, ఆందోళనలకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించా రు. బిల్లుల కోసం మంత్రుల చుట్టూ తిరిగినా, నిరాశే మిగి లిందని విమర్శించారు. నాయకుల ఎదుట మా సమస్యలు చెప్పుకోవడం తప్పేనా అన్నారు. అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలను కలవడం అనైతికమా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని, లేదంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
సందడిగా అల్ఫోర్స్ ‘ఫ్లిక్కర్’