● అబ్కారీశాఖ డిప్యూటీ కమిషనర్ వై.శ్రీనివాస చౌదరి
విజయనగరం రూరల్: నూతన మద్యం విధానం అమల్లో భాగంగా జిల్లాలో అన్ని మద్యం దుకాణాల్లో ఎంఆర్‌పీకే మద్యం విక్రయాలు జరిగేలా చూడాల్సిన బాధ్యత ఆయా ఎకై ్సజ్ స్టేషన్ అధికారులదేనని అబ్కారీశాఖ డిప్యూటీ కమిషనర్ వై.శ్రీనివాస చౌదరి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన తన కార్యాలయంలో జిల్లాలోని 11 ఎకై ్సజ్‌స్టేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా అనధికార మద్యం విక్రయాలు జరగకుండా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో బెల్టు దుకాణాల నిర్వహణ, వాటికి సంబంధించి వేలంపాటలు నిర్వహిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సారా తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచి, నిరంతర దాడులు చేపట్టాలని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణా జరగకుండా జిల్లా సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఎస్.కోట మండలం బౌడార చెక్‌పోస్టు వద్ద గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక త నిఖీలు నిర్వహించి అప్రమత్తంగా వ్యవహరించాలన్నా రు. జిల్లాలోని బార్ ఆండ్ రెస్టారెంట్లు, మద్యం దుకాణా లు లైసెన్స్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. రెవెన్యూ పెంపుపై ప్ర త్యేక దృష్టి సారించి లక్ష్యాలను సాదించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అబ్కారీశాఖ ఈఎస్ బమ్మిడి శ్రీనాథుడు, ఏఈఎస్ ఎ.శ్రీరంగం దొర, ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.


