తో తమ ఇళ్లల్లో, ఆలయాల్లో శ్రావణ లక్ష్మికి పూజలు చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. పౌర్ణమినా డు చంద్రుడు శ్రవణా నక్షత్రం మీద సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణం అనే పేరు వచ్చింది. ఈ నెలలో వచ్చే శుక్రవారాలను వ్రతాలకు, నోములకు కేటాయించడం వెనుక పెద్ద కథే ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి నక్షత్రం కూడా శ్రవణమే. కావున ఆయన భార్య లక్ష్మీదేవికి, సోదరి గౌరికి శ్రావణ శుక్రవారాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు.శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలు చేస్తారు.
శ్రావణమాసానికి అత్యంత ప్రాధాన్యం
సకల సుఖాలను ఒసగే శ్రావణ మాసం జ్ఞానస్ధితిని అందిస్తుంది.హరిహర భేదం లేదని నిరూపించే శ్రావణమాసంలో వైష్ణవారాధనతో పాటు మహాశివునికి పెద్ద ఎత్తున రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు.ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకు శ్రావణ మాసంలో మంచిముహూర్తాలు ఉన్నాయి.
నేటినుంచి శ్రావణం మాసం ప్రారంభం
ఆగస్టు 21న వరలక్ష్మీ వ్రతం
28న రాఖీ పండగ
సెప్టెంబర్ 4న శ్రీకృష్ణ జన్మాష్టమి
పూజలు చేసుకునేందుకు సిద్ధమవుతున్న మహిళలు


