విజయనగరం రూరల్: గ్రంథాలయ శాస్త్ర పితామహుడు, ఆధునిక గ్రంథాలయ ఉద్యమ మార్గదర్శకుడు ఎస్.ఆర్.రంగనాథన్ 134వ జయంతిని పురస్కరించుకుని స్థానిక జేఎన్‌టీయూ–జీవీలో బుధవారం జాతీయ గ్రంథాలయదారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జేఎన్‌టీయూ – జీవీ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలోని డాక్టర్ వైఎస్‌ఆర్ కేంద్ర గ్రంథాలయంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కోట చంద్రభూషణరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముందుగా ఎస్‌ఆర్ రంగనాథన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పుస్తక పఠనం వ్యక్తిత్వ వికాసానికి, ఆలోచనా విధానానికి, జ్ఞానాభివృద్ధికి, ఉన్నతమైన వృత్తి నిర్మాణానికి ఎంతో దోహదపడుతుందన్నారు. విద్యార్థులు ప్రతిరోజూ కనీసం ఒక గంట సమయాన్ని గ్రంథాలయంలో గడిపి పుస్తకాలు చదవడాన్ని అలవాటుగా చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి డీడీవీ శివరామ్ రోలంగి, గ్రం
థాలయ సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయంలో..
స్థానిక కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయంలో జాతీయ గ్రంథాలయదారుల దినోత్పవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి ఉపకులపతి టి.శ్రీనివాసన్ తొలుత డాక్టర్ ఎస్‌ఆర్ రంగనాథన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సీటీయూ గ్రంథాలయాధికారి డాక్టర్ కె.శంకర్‌రెడ్డి, ముక్కామల శరత్‌చంద్రబాబు, డాక్టర్ దాసరి నారాయణ, పి.శ్రీదేవి, అనిరుధ్‌కుమార్, సురేష్‌బాబు, బొంతు కోటయ్య, ఎన్‌వీఎస్ సూర్యనారాయణ, దివ్య, తారకేశ్వరరావు పాల్గొన్నారు.


