మాజీ సీఎం జగన్‌ను కలిసిన ఎమ్మెల్సీ విక్రాంత్‌ | - | Sakshi
Sakshi News home page

మాజీ సీఎం జగన్‌ను కలిసిన ఎమ్మెల్సీ విక్రాంత్‌

Aug 5 2026 1:53 AM | Updated on Aug 5 2026 1:53 AM

వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని పాలకొండకు చెందిన ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌..తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకుని, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

– పాలకొండ రూరల్‌

నకిలీ వైజాగ్‌ టీఎంటీపై హెచ్చరిక

విజయనగరం: వైజాగ్‌ టీఎంటీ పేరుతో మార్కెట్‌లో నకిలీ, నాసిరకం టీఎంటీ రీబార్లు విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని విశాఖ ఉక్కు కర్మాగారం(ఆర్‌ఐఎన్‌ఎల్‌) వెల్లడించింది. గృహ నిర్మాణదారులు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు, వినియోగదారులు అసలైన వైజాగ్‌ టీఎంటీ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేసింది. నాసిరకం ఉక్కు బీఐఎస్‌ ప్రమాణాలకు అనుగుణంగా ఉండకపోవడంతో భవనాల భద్రత, బలం, మన్నికపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రతి అసలైన రీబార్‌పై వైజాగ్‌ టీఎంటీ బ్రాండింగ్‌తో పాటు ఆర్‌ఐఎన్‌ఎల్‌ గుర్తు స్పష్టంగా ఉంటుందని, కొనుగోలు సమయంలో వాటిని తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. ఉత్పత్తి అసలు ధనంపై సందేహాలుంటే సమీప ఆర్‌ఐఎన్‌ఎల్‌ మార్కెటింగ్‌ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపింది. ప్రజల భద్రత దృష్ట్యా నకిలీ ఉత్పత్తులకు మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement