కనుచూపు మేరలో..
బొబ్బిలి: జిల్లాలో సుమారు 1.20 లక్షల ఎకరాల్లో ఏటా వరి సాగు కావాల్సి ఉంది. ఈ ఏడాది దాదాపు 30 శాతం కూడా ఉభాలు కాలేదు.వరి నారు వేసిన 21 రోజుల్లో నాట్లు వేసుకోవాల్సి ఉన్నా ఇప్పటికే చాలా చోట్ల 35 నుంచి 40 రోజులుగా వరి నారు ముదిరి పోతోంది. కాలువలు, బావుల్లో నీరు ఇంకిపోతోంది. వరి నారును కొంతమంది మళ్లీ వేసుకున్నారు. అదీ పనికి వచ్చేలా లేదు. కరువు పొంచి ఉంది. రెండు నెలలుగా రైతులు వర్షం కోసం కంటిమీద కునుకులేకుండా ఎదురు చూస్తున్నారు. అల్పపీడనాలు, వాయుగుండాలు వచ్చి వెళ్లిపోతున్నాయే తప్ప చుక్క నీరు రాల్చడం లేదు. ఇటీవల వచ్చిన తుఫాన్ వర్షాలు కూడా అంతే. రెండు రోజులు మేఘావృతమై పూలజల్లులు కురవడం, మరుసటి రోజంతా మాడు పగిలే ఎండలుకాయడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. జిల్లా సగటు వర్షపాతం తక్కువగా నమోదవుతోంది. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు తరిగిపోతున్నాయి. రైతులను ఆదుకుని కరువునుంచి గట్టెక్కించే చర్యలుతీసుకోవాలి కానీ అదిశగా కనీసం అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు.
జిల్లాలో గడిచిన రెండునెలల్లో
వర్షపాతం వివరాలు(మి.మీలలో)
నెల సాధారణ కురిసిన
జూన్ 123.5 96.3
జూలై 100.5 41.9
బోర్ల వద్ద ఎండుతున్న వరిపైరు
వీఆర్‌ఎస్, పాల్తేరు చానళ్లలో
కానరాని సాగునీరు
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని ప్రభుత్వం
ఆగస్టు వచ్చేసినా 30శాతం కూడా పడని వరినాట్లు


