ఉద్యోగుల క్రికెట్‌ సమరం | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల క్రికెట్‌ సమరం

Aug 4 2026 1:35 AM | Updated on Aug 4 2026 1:35 AM

పార్వతీపురం రూరల్‌: జిల్లా పాలనా యంత్రాంగం ఆధ్వర్యంలో కలెక్టర్‌ ఆమోదంతో నిర్వహించిన స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల క్రికెట్‌ టోర్నమెంట్‌ ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమైంది. ఉద్యోగుల మధ్య మైత్రీభావం, క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన ఈ పోటీలకు మంచి స్పందన లభించింది. క్రీడాకారులు మైదానంలో క్రీడాస్ఫూర్తిని చాటగా, క్రికెట్‌ ఇన్‌చార్జ్‌ లక్ష్మణ్‌ జట్లకు శుభాకాంక్షలు తెలిపారు. టోర్నీలో భాగమైన ‘పూల్‌–ఎ’ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. మొత్తం 18 ప్రభుత్వ శాఖల జట్లు ఈ పూల్‌లో పోటీపడుతున్నాయి. తొలి విడతలో వీబీ–జీ రామ్‌జీ వర్సెస్‌ పశుసంవర్ధక, వైద్యారోగ్య వర్సెస్‌ ఆడిట్‌, ఇరిగేషన్‌ వర్సెస్‌ పంచాయతీరాజ్‌, కలెక్టరేట్‌ వర్సెస్‌ ఏపీఈపీడీసీఎల్‌, మున్సిపల్‌ వర్సెస్‌ అగ్రికల్చర్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌ వర్సెస్‌ ఎస్‌సీఎస్‌డబ్ల్యూ, పౌరసరఫరాలు వర్సెస్‌ ట్రెజరీస్‌, రెవెన్యూ వర్సెస్‌ సర్వే జట్లు తలపడనున్నాయి. విద్యాశాఖ, పీఆర్‌ ఎడ్యుకేషన్‌ జట్లు తదుపరి రౌండ్లలో విజేతలతో పోటీపడతాయి. మొదటి రౌండ్‌ విజేతలు తర్వాతి దశలు, సెమీఫైనల్స్‌ (ఎం–15, ఎం–16) దాటుకుని ’పూల్‌–ఎ’ విజేతను నిర్ణయించే ఆఖరి ఫైనల్‌ (ఎం–17) పోరుకు చేరుకుంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement