ఓటర్ల జాబితా సవరణ వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఓటర్ల జాబితా సవరణ వేగవంతం చేయాలి

Aug 4 2026 1:35 AM | Updated on Aug 4 2026 1:35 AM

పార్వతీపురం: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్‌)లో క్లెయిమ్‌లు, అభ్యంతరాలను నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలకుడు, రాష్ట్ర సీసీఎల్‌ఏ అదనపు కార్యదర్శి జె.వెంకటరమణ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన కలెక్టరేట్‌లో కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డితో పాటు ఇతర అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫామ్‌–6, 7, 8లు క్షేత్రస్థాయి సిబ్బంది వద్ద అందుబాటులో ఉంచుకోవాలని, తొలగించిన, సవరించిన పేర్ల జాబితాలను గ్రామ, మండల కార్యాలయాల నోటీసు బోర్డులపై ప్రదర్శించాలని సూచించారు. ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌, ఆన్‌లైన్‌ సేవలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా 18ఏళ్లు నిండే యువతను గుర్తించి కొత్త ఓటర్లుగా నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ ఆర్‌.వైశాలి. డీఆర్‌ఓ కె. హేమలత, ఆర్డీఓ కె. మాధురి, పాలకొండ సబ్‌ కలెక్టర్‌ పవర్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement