సాహిత్యానికే వన్నెతెచ్చిన సృజనశీలి ‘తులసి’ | - | Sakshi
Sakshi News home page

సాహిత్యానికే వన్నెతెచ్చిన సృజనశీలి ‘తులసి’

Aug 3 2026 12:55 AM | Updated on Aug 3 2026 12:55 AM

సాహిత్యానికే వన్నెతెచ్చిన సృజనశీలి ‘తులసి’

చింత అప్పలనాయుడుకు చా.సో

కథా పురస్కారం

తెలంగాణ రచయిత్రి స్వర్ణకు చా.సో అనువాద పురస్కారం

విజయనగరం టౌన్‌: తెలుగు సాహిత్యాన్ని దశ దిశ లా వ్యాప్తి చేసి, తన జీవితాన్ని సాహిత్యానికి అంకి తం చేసిన సాహిత్య సృజన శీలి చాగంటి తులసి అని పలువురు సాహితీవేత్తలు పేర్కొన్నారు. భార త సాహిత్య రంగానికి చాగంటి తులసి చేసిన అవిర ళకృషి మరువలేనిదని కొనియాడారు. తులసి సా హిత్య రచనలను ఆమె సమక్షంలోనే సమీక్షించడం ఎంతో ఆనందంగా ఉందని సాహితీవేత్తలు ఆనందపరవశులయ్యారు. స్థానిక పాల్‌నగర్‌లో తులసి స్వగృహంలో చాగంటి తులసి సాహితీ సమాలోచన పేరుతో సాహిత్యంలో విశేష కృషి చేసినటువంటి సాహితీవేత్తలను సముచితరీతిలో ఆదివారం సత్కరించారు. అభ్యుదయ రచయితల సంఘం జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు జిఎస్‌.చలం, రత్నాల బాలకృష్ణ ఆధ్వర్యంలో వారికి చా.సో కథా పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రముఖ వయోలిన్‌ విద్వాంసులు ద్వారం దుర్గాప్రసాదరావు తులసి కథల సంపుటి యాష్‌–ట్రే పుస్తకావిష్కరణ చేశారు. చాగంటి కృష్ణకుమారి సమీక్షించారు. సచీ రౌత్రాయ్‌ అనువాద కథల్ని ధవళ సర్వేశ్వరరావు ఆవిష్కరించారు. ప్రముఖ సాహితీవేత్త రామసూరి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో తులసి సాహిత్యంపై యువ సాహితీవేత్తలు దుప్పల రవికుమార్‌, కూరెళ్ల శ్రేయ, సుభ, గీతా రమాదేవి, రత్నాల బాలకృష్ణ ప్రసంగించారు. 90 ఏళ్ల వయసులో సాహిత్యంపై మక్కువ చూపిస్తున్న చాగంటి తులసి కీర్తిని కొనియాడారు.

చింతా అప్పలనాయుడుకు చా.సో కథా

పురస్కారం

వ్యంగ్య శైలిలో దోపీడి వ్యవస్థను తూర్పారబట్టిన ‘నగ జనకరి నాం నాం..’ అంటూ తన కథల ద్వారా దండోరా మోగిస్తున్న కథకుడు చింతా అప్పలనాయుడు చా.సో కథా పురస్కారం అందుకున్నారు. ఉత్తరాంధ్ర నుడికారాన్ని, యాసను, భాషను ప్రతి కథలోనూ ఇంకించి, రైతులు, దళితుల, గిరిజనుల దోపిడీకి కారణమైన వ్యవస్థలో లోపాలను తన రచనల ద్వారా ఎత్తి చూపారని సాహితీవేత్తలు విశ్లేషించారు. ఉత్తరాంధ్ర సంభాషణలు, వాలకాలు, చతు రోక్తులు, మాటలు, సామెతలు, దుక్కి, ఇలమీద దేవత, అరిసేతిలో బువ్వ, పువ్వు వంటి కవితా సంకలనాలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసి న చింతా అప్పలనాయుడుకు చాసో కథా పురస్కా రంతో సత్కరించారు. రూ.10 వేలు నగదు పురస్కారం, జ్ఞాపిక, శాలువతో సత్కరించారు. ఆయన రాసిన ‘నకజనకరి నాం..నాం..’ కథల సంపుటిని సరిపల్లి నాగరాజు సమీక్షించారు.

తెలంగాణ రచయిత్రి స్వర్ణ కిలారికికి

అనువాద పురస్కారం

తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్న తెలంగాణ రచయిత్రి స్వర్ణ కిలారికి చాగంటి తులసి అను వాద పురస్కారం దక్కింది. ఈ మేరకు రూ.15 వే లు నగదు పురస్కారం, జ్ఞాపిక, సాలువతో ఆమెను గౌరవప్రదంగా సత్కరించారు. ద్వారం దుర్గాప్రసా ద్‌ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో లిప్తకాలపు స్వప్నం పుస్తకాన్ని లండ సాంబ మూర్తి సమీక్షించా రు. తొలి అనువాదం లిప్తకాలపు స్వప్నంతో ప్రతిష్టాత్మక తెలుగు యూనివర్సిటీ అనువాద పురస్కారాన్ని అందుకుని, సాహితీ జగత్తులో కథా రచయిత్రిగా, అనువాదకురాలిగా, నవలా రచయిత్రిగా, సంపాదకురాలిగా తనదైన ముద్రతో స్వర్ణ ముందుకు సాగుతున్నారన్నారు. మానవ సంబంధాలు, సామాజిక సంక్లిష్టతలు, సమాజంలోని రక రకాల కోణాలు విశ్లేషించే కథలతో నల్ల బంగారం, గోడ అవతల వంటివి కథా సంపుటులుగా వెలువరించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement