నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌

Aug 3 2026 12:55 AM | Updated on Aug 3 2026 12:55 AM

దుర్గమ్మకు కానుకగా బంగారపు ఆభరణాలు

పార్వతీపురం: కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కారవేదిక(పీజీఆర్‌ఎస్‌)లో ప్రజలు తమ వినతులను సమర్పించవచ్చునని కలెక్టర్‌ డా.ఎన్‌. ప్రభాకరరెడ్డి ఆదివారం తెలిపారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అర్జీల వివరాలు, వాటి స్థితిని మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవడంతో పాటు1100 టోల్‌ఫ్రీ కాల్‌సెంటర్‌ ద్వారా కూడా తెలుసుకోవచ్చునన్నారు. కలెక్టరేట్‌లో ప్రతిరోజు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

’క్యూఆర్‌ కోడ్‌ ద్వారా స్పందన ఇవ్వండి

పీజీఆర్‌ఎస్‌ ద్వారా అందుతున్న సేవలపై ప్రజలు క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి తమ అభిప్రాయాలను వెల్లడించాలని కలెక్టర్‌ డా.ఎన్‌. ప్రభాకరరెడ్డి ప్రజలను కోరారు. జిల్లా, మండల స్థాయి పీజీఆర్‌ఎస్‌ కేంద్రాల్లో ప్రజలకు స్పష్టంగా కనిపించేలా క్యూఆర్‌ కోడ్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

నారు యాజమాన్యంపై అవగాహన అవసరం

పాలకొండ రూరల్‌: ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ స్థితి నుంచి వరి పంట సాగులో యాజమాన్య పద్ధతులు అవసరమని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ పీవీ.సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు పాలకొండ మండలంలోని తంపటాపల్లి గ్రామాన్ని ఆయన ఆదివారం సందర్శించి అక్కడి రైతులతో మమేకమయ్యారు. ఈ క్రమంలో అక్కడి పంటల సాగు తీరుపై ఆరా తీశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సాగునీటి ఎద్దడి ఏర్పడే సమయంలో నారు యాజమాన్యం, వర్షం అనుకూలించే ప్రాంతాల్లో స్వల్పకాలిక వంగడాలను వేసుకోవాలని సూచించారు. ప్రస్తుత వాతావరణ స్థితిగతులను ఏ విధంగా అధిగమించాలనే అంశాలపై సీతంపేట వ్యవసాయ పరిశోధనస్థానం శాస్త్రవేత్తలు డాక్టర్‌ పి.వెంకటేశ్వరరావు, పి.సౌజన్య తదితరులు వివరించారు. ప్రకృతి విపత్తులనుంచి నష్టపోకుండా ఉండేందుకు పంటల బీమాపై అవగాహన కలిగి ఉండాలని, సకాలంలో బీమా చేయడం వల్ల అర్థిక వెసులుబాటు ఉంటుందని వ్యవసాయ సహాయకుడు వి.గుణశేఖర్‌ తెలిపారు.

ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయనగరానికి చెందిన భక్తులు బంగారపు నత్తు, బొట్టు, బొల్లాకిని ఆదివారం కానుకగా సమర్పించారు. విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన కె.సత్యనారాయణ, అప్పాయమ్మ దంపతులు కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశా రు. రూ. 2.50లక్షల వ్యయంతో సుమారు 19 గ్రాముల బంగారాన్ని వినియోగించి బొట్టు, నత్తు, బొల్లాకిని తయారు చేయించి ఆలయ అధికారులకు అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతల కు ఆలయ పర్యవేక్షకులు నాగేశ్వరరావు అమ్మ వారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement