నెల్లిమర్ల రూరల్:
మండలంలోని కొండవెలగాడ గ్రామానికి చెందిన వల్లూరి అజయ్‌బాబు కామన్‌వెల్త్ గేమ్స్‌లో రజత పతకం సాధించినందుకు గాను ఆయన తండ్రి శ్రీనివాసరావును గ్రామస్తులు ఆదివారం ఘనంగా సత్కరించారు. అజయ్‌బాబు దేశానికే కాదు..గ్రామానికి కూడా మంచి పేరు తెచ్చారని గ్రామపెద్దలు ప్రశంసించారు. కొడుకును ప్రోత్సహించి, అతడి విజయానికి దోహదపడిన తండ్రిని సన్మానించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకుడు మొయిద అప్పారావు, నాయకులు ఆదినారాయణ, త్రినాధరావు తదితరులు పాల్గొన్నారు.


