ఆగస్టు 5, 6, 7 తేదీల్లో బీసీల ‘చలో ఢిల్లీ’ | - | Sakshi
Sakshi News home page

ఆగస్టు 5, 6, 7 తేదీల్లో బీసీల ‘చలో ఢిల్లీ’

Aug 3 2026 12:55 AM | Updated on Aug 3 2026 12:55 AM

ఆగస్టు 5, 6, 7 తేదీల్లో బీసీల ‘చలో ఢిల్లీ’

పార్వతీపురం రూరల్‌: సగానికి పైగా జనాభా.. చట్టసభల్లో నామమాత్రపు ప్రాతినిధ్యం. ఈ అసమానతలను రూపుమాపుతూ, రాజ్యాంగ సవరణ ద్వారా ఓబీసీలకు 34శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం పార్వతీపురంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలిగాపు విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఉత్తరాంధ్ర స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ సమానత్వం, సామాజిక న్యాయం దక్కాలంటే ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే రిజర్వేషన్ల బిల్లును ఆమోదించి 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కోరారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసేలా ప్రధాని మోడీపై సీఎం చంద్రబాబు ఒత్తిడి తేవాలని కోరారు. కులవృత్తుల వికాసానికి రూ.15 వేల కోట్లతో ‘ఆర్టిజన్స్‌ వెల్ఫేర్‌ స్కీమ్‌’, ప్రత్యేక సబ్‌ప్లాన్‌న్‌ చట్టాన్ని తీసుకురావాలని విజయలక్ష్మి డిమాండ్‌ చేశారు. హక్కుల సాధన కోసం ఆగస్టు 5, 6, 7 తేదీల్లో తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ గర్జనకు బీసీలంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ ఉద్యమానికి ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు కృష్ణమూర్తినాయుడు సంఘీభావం తెలిపారు.

బాధ్యతల పంపిణీ

మన్యం జిల్లా ఉపాధ్యక్షులుగా జి.రవి, పాత గౌరీశంకర్‌ నాయుడు, ప్రధాన కార్యదర్శిగా బోను మధుయాదవ్‌, కార్యదర్శిగా కుప్పిలి సంతోష్‌, విజయనగరం జిల్లా ఉపాధ్యక్షుడిగా మహేష్‌ నియమితులయ్యారు. కార్యక్రమంలో మోహనన్‌రావు, తోకాడ రాము, సి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ

అధ్యక్షుడు వరప్రసాద్‌ యాదవ్‌

చట్టసభల్లో 3శాతం రిజర్వేషన్లు.. ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement