బళ్లారి రాఘవకు పోలీస్‌ శాఖ నివాళులు | - | Sakshi
Sakshi News home page

బళ్లారి రాఘవకు పోలీస్‌ శాఖ నివాళులు

Aug 3 2026 12:55 AM | Updated on Aug 3 2026 12:55 AM

బళ్లారి రాఘవకు పోలీస్‌ శాఖ నివాళులు

పార్వతీపురం రూరల్‌: తెలుగు నాటక రంగ పితామహుడు తాడిపత్రి రాఘవాచార్యులు (బబళ్లారి రాఘవ) జయంతి వేడుకలను పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ థామస్‌ రెడ్డి, ఇతర అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ బళ్లారి రాఘవ గొప్ప నటుడే కాకుండా, తెలుగు నాటక రంగానికి జాతీయ గుర్తింపు తెచ్చిన కళాకారుడని కొనియాడారు. కళ ద్వారా ఆయన ప్రజల్లో తీసుకొచ్చిన సామాజిక చైతన్యాన్ని స్మరించుకున్నారు. వృత్తిరీత్యా గొప్ప న్యాయవాది కూడా అయిన ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని, సిబ్బంది విధుల్లో క్రమశిక్షణ, అంకితభావం, సేవా దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌ఐలు నాయుడు, రాంబాబు, ఏఆర్‌ ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement